Latest Updates
-
కరకరలాడే మొక్కజొన్న పకోడీ'.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
ఎండల తీవ్రతతో గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు అప్రమత్తంగా ఉండాల్సిందేనా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీలో మండుటెండల ఎఫెక్ట్: పెళ్లిళ్ల ప్లాన్స్ మార్చేసిన జంటలు.. అర్ధరాత్రికి షిఫ్ట్ అవుతున్న ఫేరాలు! -
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఈ చిట్కాలు ట్రై చేయండి -
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే!
చర్మంను కాంతివంతంగా మార్చే విటమిన్ సి ఫ్రూట్ ఫేస్ ప్యాక్
ముఖ సౌందర్యం పెంచుకోవడానికి ఉపయోగించే ఫేస్ ప్యాక్స్ లో విటమిన్ సి ఒక ఉత్తమ న్యూట్రీసియన్ ఫ్రూట్. ఎందుకంటే విటమిన్ సి ఫ్రూట్ మీ ముఖాన్ని కాంతివంతంగా మరియు హెల్తీగా మార్చుతుంది. సిట్రస్ పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఆరెంజ్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఆరెంజ్ తొక్క మరియు పాలు ఉపయోగించుకొని ఫేషియల్ ప్యాక్ ను వారానికొకసారి ఉపయోగించడం వల్ల ఇది చర్మం యొక్క స్ట్రక్చర్ ను మెరుగుపరుస్తుంది.
ఆరెంజ్ లో మాత్రమే కాదు, స్ట్రాబెర్రీస్ లో కూడా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందుకే స్ట్రాబెర్రీని కూడా పేస్ ప్యాక్ గా వేసుకోవచ్చు. గుప్పెడు స్ట్రాబెర్రీస్ ను మెత్తగా పేస్ట్ చేసి, అందులో తేనె మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి . స్ట్రాబెర్రీ ఫేస్ ప్యాక్ డ్రై స్కిన్ కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ముఖ్యంగా చర్మం యొక్క మొదటి లేయర్ మీద చాలా ఎఫెక్టివ్ గా పనిచేసి, మీ చర్మంను సాఫ్ట్ గా మార్చుతుంది.
చర్మ సౌందర్యంను పెంపొందించుకోవడంలో విటమిన్ సి పుష్కలంగా ఉండే ఈ రెండు పండ్లు, ఇతర పండ్లుతో పోల్చినప్పుడు వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. వీటితో పాటు మరికొన్ని విటమిన్ సి ఫేస్ ప్యాక్ ను ఈ క్రింది స్లైడ్ లో వివరించడం జరిగింది.
ఈ హోం రెమెడీస్ ను మీ చర్మం మీద ప్రయోగించేప్పుడు, చేతి మీద లేదా చెవి మీద ఒక ప్యాచ్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది . ఎలాంటి అలర్జీ లేనట్లైతే వెంటనే ఈ హోం రెమెడీస్ ను మీరు అనుసరించవచ్చు...

ఆరెంజ్ తొక్క ఫేస్ ప్యాక్
ఆరెంజ్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది . ఆరెంజ్ తొక్కను ఎండబెట్టి, పొడి చేసి అందులో కొద్దిగా పాలు పోసి ఫేస్ట్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల స్కిన్ క్వాలిటి పెరుగుతుంది.

స్ట్రాబెర్రీ ఫేస్ ప్యాక్
ఆరెంజ్ తర్వాత విటమిన్ సి అధికంగా ఉండే మరో ఫ్రూట్ స్ట్రాబెర్రీ . స్ట్రాబెర్రీని చిక్కగా పేస్ట్ చేసి, దీన్ని ముఖానికి అప్లై చేసి 15 నిముషాల తర్వాత మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి . ఒక సారి వేసుకొన్న ఫేస్ ప్యాక్ డ్రై అయిన తర్వాత తిరిగి దీన్ని రిపీట్ చేయాలి.

కివి ఫేస్ ప్యాక్
పండ్లలో విటమిన్ అధికంగా ఉండే మరో పండు విటమిన్ సి. ఈ పండుతో కూడా ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు . ముఖ్యంగా డ్రై మరియు దురద పెట్టే చర్మ తత్వం కల వారికి ఇది ఒక ఉత్తమ హోం రెమెడీ . ఇలాంటి స్కిన్ సమస్యను నివారించడంలో ఇది ఒక ఉత్తమ హోం రెమెడీ.

టమోటో ఫేస్ ప్యాక్
విటమిన్ సి అధికంగా ఉండే మరో ఆహారం పదార్ధాల్లో టమోటో ఒకటి. ఇది చర్మం మీద గీతలను, మొటిమలకు సంబంధించిన మచ్చలను నివారిస్తుంది.

స్ట్రాబెర్రీ మరియు ఓట్ మీల్
స్ట్రాబెర్రీని మెత్తగా చేసి, అందులో ఓట్ మీల్ పొడి వేసి పేస్ట్ లా చేయాలి . ఈ మిశ్రమాన్ని ఫేస్ కు ప్యాక్ లా వేసుకోవాలి . ఈ ఫేస్ ప్యాక్ ను వారానికి మూడు సార్లు అప్లై చేయాలి. ఓట్ మీల్ డెడ్ స్కిన్ ను నివారిస్తుంది మరియు స్ట్రాబెర్రీ చర్మంను సాఫ్ట్ గా మార్చుతుంది.

బొప్పాయి మరియు ఫుల్లర్స్ ఎర్త్
బొప్పాయి పండు గుజ్జు మరియు ఫుల్లర్స్ ఎర్త్ ను రెండింటిని మిక్స్ చేయడం వల్ల ఇది ఒక గొప్ప హోం మేడ్ ఫేస్ ప్యాక్. ఈ ప్యాక్ ను మీ చర్మానికి అప్లై చేయడానికి ముందు మీ చర్మానికి రోజ్ వాటర్ ను అప్లై చేయాలి.

క్రాన్ బెర్రీ మరియు పెరుగు
ఒక కప్పు క్రాన్ బెర్రీని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి . అందులో అరకప్పు పెరుగు వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి పట్టించాలి. క్రాన్ బెర్రీ మొటిమలను నివారించడానికి సహాయపడుతుంది. మరియు పెరుగు చర్మంను తెల్లగా మార్చడానికి సహాయపడుతుంది.

పుచ్చకాయ మరియు పాలు
పుచ్చకాయను పాలతో మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని చర్మానికి అప్లై చేయాలి.ఇలా క్రమం తప్పకుండా 3 వారాల పాటు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

పైనాపిల్ అండ్ నిమ్మరసం
నిమ్మరసం ఒక బ్లీచింగ్ ఏజెంట్ మరియు పైనాపిల్ గుజ్జును ముఖానికి అప్లై చేస్తే, ఇది చర్మం మెరిసేలా చేస్తుంది. తక్షణం కాంతివంతంగా మార్చుతుంది.

నిమ్మరసం
నిమ్మరసంలో కూడా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి, దీన్ని కూడా పేస్ ప్యాక్ గా ఉపయోగించుకోచ్చు. ఇది ముఖంలో మచ్చలను తేలిక చేస్తుంది. ముఖానికి నేచురల్ బ్లీచ్ గా ఉపయోగపడుతుంది.

ఆరెంజ్ పీల్ మరియు రోజ్ వాటర్
డార్క్ సర్కిల్స్ నివారించడంలో ఆరెంజ్ తొక్క మరియు రోజ్ వాటర్ గ్రేట్ గా సహాయపడుతుంది. డార్క్ సర్కిల్స్ నివారించడానికి ఇది ఒక ఫర్ఫెక్ట్ కాంబినేషన్ . ఈ పేస్ట్ ను చాలా చిక్కగా కళ్ళ క్రింది బాగంలో అప్లై చేయాలి.

బొప్పాయి మరియు వాల్ నట్ పౌడర్
బొప్పాయి గుజ్జును మూడు టేబుల్ స్పూన్ల వాల్ నట్ పౌడర్లో వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి పట్టించాలి. ఇది చర్మం యొక్క డ్రైనెస్ మరియు డెడ్ స్కిన్ ను తొలగిస్తుంది.



Click it and Unblock the Notifications