Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
ఆల్కహాల్ మీ చర్మానికి చేసే మేలు అంతా..ఇంతా..కాదు !!
ఆ చక్కటి విస్కీ ఇప్పుడిక గ్లాస్ లో కాక మీ మొహం మీద పోసుకునే సమయం వచ్చేసింది. ఆల్కాహాల్ తో మీ చర్మ సంరక్షణ చేసుకుంటే ఇక మీరు మొటిమలు, దద్దుర్లు, మచ్చలు లాంటి వాటిని దూరంగా ఉంచవచ్చు. ఇందులో ముందుగా మీరు గుర్తు పెట్టుకోవలసిన విషయం ఏమిటంటే ఆల్కాహాల్ ను నీటితో కలిపి దాన్ని ఇతర పదార్ధాలతో కలిపి చర్మానికి పట్టించాలి.
ఇలా చేస్తే ఆల్కాహాల్ లో వున్న రసాయనాల వల్ల మీ చర్మం పాడవకుండా వుంటుంది. అయితే, సున్నితమైన చర్మం మీద మాత్రం ఆల్కాహాల్ వాడకూడదు, ఎందుకంటే దాని ప్రతిచార్య చాలా తీవ్రంగా వుంటుంది. మీ చర్మం రకాన్ని బట్టి మీరు ఏరకం ఆల్కాహాల్ వాడాలో ఎంచుకోవచ్చు. మేని ఛాయ మెరుగు పడేందుకు వైన్ వాడవచ్చు, మచ్చలు పోగేట్టేందుకు వోడ్కా వాడవచ్చు.
READ MORE:మద్యం తీసుకొనే ముందు తినాల్సినటువంటి ఆహారాలు
గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆల్కాహాల్ వాడిన ప్రదేశంలో తరువాత 24 గంటల దాకా సబ్బు వాడకూడదు, ఎందుకంటే అది చర్మానికి మరింత హాని చేస్తుంది.
చర్మ సంరక్షణ కోసం మీరు ఆల్కాహాల్ ను వాడే కొన్ని విధానాలు ఇవిగో :

చర్మం మెరవడానికి వైన్
విన్ ను క్లెంజర్ లాగా ఉపయోగించి మీ చర్మం మెరిసేట్లు చేసుకోండి. ఒక కాటన్ ముక్కను ఎరుపు వైన్ లో ముంచండి, ఎక్కువగా ఉన్నదాన్ని తీసేసి, మీ ముఖానికి మర్దన చేయండి. కాసేపు ఆరనివ్వండి, 15 నిమిషాల తరువాత మరలా ఇదేవిధంగా చేయండి.

చర్మం తెల్లగా రావడానికి వైన్
మీరు రాత్రికిరాత్రే అందంగా తయారవ్వాలంటే మీ చర్మంపై వైన్ ని ఉపయోగించి ప్రయోజనాన్ని పొందండి. ఒక కప్పు వైన్ కి కొద్దిగా రోజ్ వాటర్ ని కలపడం మీకు అవసరం. ఈ పదార్ధంతో మీ ముఖాన్ని రుద్ది కొద్దిసేపు అరెదాకా వదిలేయండి. 10 నిమిషాల తరువాత, గోరువెచ్చని నీటితో రుద్దండి. చర్మ సంరక్షణకు ఈ ఆల్కహాలును వారానికి రెండుసార్లు ఉపయోగించి ఫలితాలను చూడండి.

వైన్ చర్మాన్ని మృదువుగా చేస్తుంది
మీరు పొడి, గట్టిబడిన చర్మంతో బాధపడుతుంటే, వైన్ ని ఉపయోగించాల్సిన సమయం ఆసన్నమైంది. ఒక కప్పు వైన్ కి కొద్దిగా పాలు కలపండి. ఈ రెండు పదార్ధాలను కలిపి ఆ మిశ్రమాన్ని ముఖంపై పూయండి. కొన్ని వారాల తరువాత మీరు మార్పును గమనించండి. ఇది చర్మ సంరక్షణ కు ఉపయోగించే ఒక మంచి ఆల్కహాల్ చిట్కా.

స్కిన్ టోనర్ గా వైన్
ఎరుపు లేదా తెలుపు వైన్ తో మీ స్కిన్ టోన్ చేయవచ్చు. చాలా సమయంతో కూడినది అయినప్పటికీ ఈ రెండు పదార్ధాలు మీ స్కిన్ టోన్ ను పోగొట్టే సామర్ధ్యం కలిగి ఉన్నాయి. వీటిలో దేనితోనైనా సరే మీరు వారానికి రెండుసార్లు మీ ముఖాన్ని శుభ్రం చేసుకుని ఫలితాలను చూడండి.

చర్మం మెరవడానికి రమ్
చర్మ సంరక్షణకు రమ్ మరో మంచి ఆల్కహాల్. రమ్ నీటితో కలిపి కాటన్ సహాయంతో ముఖంపై రాయండి. దానిని ఆరనిచ్చి చల్లని నీటితో కడగండి. ఇలా వారానికి రెండుసార్లు చేయండి.

యాక్నే కి రమ్
యాక్నే అనేది చాలామంది ఎదుర్కునే సాధారణ సమస్య. అయితే, కొద్దిపాటి రమ్ లో రోస్ వాటర్ ని కలిపిన ఈ రెండు పదార్ధాల మిశ్రమం యాక్నే కి ముగింపు పలుకుతుంది. మీ ముఖంపై రోజ్ వాటర్ అప్లై చేసి తరువాత యాక్నే గుర్తులు, మచ్చలు ఉన్నచోట కొద్దిగా రమ్ రాయండి.

పొడి చర్మానికి రమ్ తో స్క్రబ్ చేయండి
ఆల్కాహాల్ సహాయంతో పొడి చర్మానికి చికిత్స చేయవచ్చు. ఒక గ్లాసు రమ్ ను నీటితో కలిపి ఆ మిశ్రమం లో కొద్దిగా పంచదార కలిపి రమ్ తో స్క్రబ్ చేయండి. ఈ మిశ్రమాన్ని స్క్రబ్ లాగా ఉపయోగించి మీ ముఖంపై ఉన్న పొడి చర్మాన్ని నివారించుకోండి.

వోడ్కా మేకప్ రిమూవార్ గా పనిచేస్తుంది
మేకప్ ని తొలగించడం అనేది బాధతో కూడిన విషయం. మీరు వోడ్కా సహాయంతో మేకప్ ని తొలగించవచ్చు. ముందు శుభ్రమైన నీటితో ముఖం కడుక్కోవడం ఎంతో అవసరం, తరువాత వోడ్కా తో మేకప్ ను తుడిచేస్తే అదనంగా ఉన్న మచ్చలు పోతాయి.

ముఖానికి వోడ్కా
వోడ్కా ను ఉపయోగించి ముఖాని శుభ్రం చేస్తే మీ ముఖంపై ఉన్న మురికి, గంభీరత్వం పోతుంది. ఇది చర్మ సంరక్షణకు మంచి ఆల్కహాల్, ఇది మిమ్మల్ని తాజాగా ఉండేట్టు చేసి, ముఖంపై ఉన్న రంధ్రాలను మూసి ఉంచుతుంది.

బీర్ స్కిన్ టోన్ ను మెరుగుపరుస్తుంది
స్కిన్ టోన్ ను మెరుగుపరచడానికి కూడా బీర్ సహాయపడుతుంది. మీరు మీ జుట్టును శుభ్రపరచడం అయిన తరువాత, కొద్ది బీర్ ను ఉంచి, మీ ముఖాన్ని కూడా రుద్దండి. ఇలా వారానికి ఒకసారి చేస్తే మీ స్కిన్ టోన్ స్థాయి పెరిగి, ముఖచాయ పెరుగుతుంది.

బ్లాక్ హెడ్స్ ను అరికట్టడానికి కూడా బీర్ సహాయపడుతుంది
చర్మ సంరక్షణకు మంచి ఆల్కహాల్ బీర్, దీనికి మీ ముక్కుపై పెరిగిన బ్లాక్ హెడ్స్ ను తగ్గించడానికి లేదా తొలగించే సామర్ధ్యం కూడా ఉండి. కొద్దిగా బీర్ ను ముక్కుపై రాయండి, సహజ స్క్రబ్ ను ఉపయోగించి అదనంగా ఉన్న హెడ్స్ ను తొలగించండి.

మచ్చలు తగ్గడానికి బీర్
బీర్ సహాయంతో మచ్చలను తగ్గించవచ్చు. దీనిని రాత్రంతా రాసి ఉంచుకుంటే మచ్చలు తగ్గుముఖం పడతాయి. అందువల్ల, మీరు మీ ముఖాన్ని బీర్ మాస్క్ తో కప్పి ఉంచండి, మచ్చలను తగ్గించుకోండి.



Click it and Unblock the Notifications











