Latest Updates
-
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా?
ముఖ సౌందర్యాన్ని పెంచుకోవడానికి హోం మేడ్ నేచురల్ ఫేస్ బ్లీచ్ లు
బ్లీచింగ్ చేసిన వెంటనే మీ చర్మం తెల్లగా మరియు ప్రకాశవంతంగా అవుతుంది. మీరు తొందరలో ఉన్నప్పుడు మరియు ఒక వివాహానికి హాజరు కావలసి ఉన్నప్పుడు లేదా, మీ స్నేహితులతో కలిసి బయటిగి వెళ్ళవలసి వచ్చినప్పుడు మీ ముఖానికి బ్లీచింగ్ చేసుకోవటం వలన తక్కువ సమయంలో మీ ముఖం కాంతివంతంగా మరియు తెల్లగా అవుతుంది.
అయితే, బ్లీచింగ్ క్రీమ్స్ లో వాడే రసాయనాల వలన సుదీర్ఘ కాలంలో మీ ముఖ చర్మం దెబ్బతింటుంది. చాలా మంది చర్మం సున్నితమైనదిగా ఉండటం వలన, బ్లీచింగ్ క్రీమ్స్ లో వాడే రసాయనాల వలన చర్మంపై దద్దుర్లు ఏర్పడి చికాకు కలిగిస్తుంది. తేలికగా, ప్రకాశవంతంగా మీ చర్మం బ్లీచ్ చేసుకోవటానికి కొన్ని ప్రభావవంతమైన ఫేషియల్ బ్లీచ్ రెసిపీస్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
ఇంట్లో తయారుచేసుకున్న చర్మం బ్లీచ్ చాలా సురక్షితం, సహజమైనది మరియు ప్రభావవంతమైనది. ఇవి సున్నితమైన చర్మానికి సరిఅయినవి. ఇంట్లో తయారుచేసుకున్న బ్లీచ్ల వలన చర్మం మీద దద్దుర్లు రావటం మరియు ఇరిటేషన్ వంటివి కలగవు. ఇవి చాలా ప్రభావవంతమైనవి మరియు ఏ రకమైన చర్మానికి సరిపడతాయి. ఇంట్లో తయారయిన బ్లీచ్లు పిగ్మెంటేషన్, మొటిమలు మరియు మచ్చలకు చికిత్సలాగా కూడా పనిచేస్తాయి.
సహజమైన ఇంట్లో తయారుచేసుకునే బ్లీచ్ రెసిపీల వలన కలిగే అసాధారణ ఫలితాలు చూడటానికి వీటిని అనేక సార్లు వాడాలి. మీ చర్మాన్ని వెంటనే మార్చే రసాయన బ్లీచ్లులతో పోలిస్తే ఇంట్లో తయారయిన బ్లీచ్లులతో అనుకున్న ఫలితాలు చూడాలనుకుంటే కొంచెం సమయం పడుతుంది. ఎందుకంటే ఇవి సహజ నివారణలు.
ఇవి మీ చర్మాన్ని ప్రకాశవంతంగా మరియు ఆరోగ్యకరంగానే కాకుండా అందంగా కూడా తయారుచేస్తాయి. చర్మం కోసం సహజంగా ఇంట్లో తయారయ్యే బ్లీచ్ లను కొన్నిటిని పరిశీలిద్దాం . క్రింద సహజంగా తయారయిన చర్మం బ్లీచింగ్ రెసిపీలను కొన్ని ఇస్తున్నాము. చూడండి.

బొప్పాయి మరియు పాలు
ఒక గిన్నెలో పండిన బొప్పాయి ముక్కలు తీసుకుని మెత్తగా గుజ్జుగా చేయండి మరియు దానికి రెండు టేబుల్ స్పూన్స్ పాలు జోడించండి. చిక్కటి పేస్ట్ అయ్యేవరకు వాటిని బాగా కలపాలి. ఈ ముద్దను ముఖానికి పూయండి మరియు 15 నిమిషాలు అలానే ఉంఛి తరువాత చల్లని నీటితో కడగండి.

నిమ్మ మరియు దోసకాయ బ్లీచ్
గ్రైండర్ లో కొన్ని దోసకాయ ముక్కలు వేసి పేస్ట్ అయ్యేవరకు గ్రైండ్ చేయండి. ఈ పేస్ట్ లో రెండు టేబుల్ స్పూన్స్ నిమ్మకాయరసం మరియు ఒక టేబుల్ స్పూన్ వేసి, బాగా కలపాలి. మీ చర్మంపై ఈ ముద్దను పూసి 15-20 నిమిషాలు అలానే ఉంచండి. ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో కడగండి.

టమోటా మరియు నిమ్మరసం
టమోటో ప్రకృతిలో లిభించే సహజ ఆమ్లగుణం కలది, అలానే నిమ్మకాయ కుడా. ఇవి చాలా ప్రభావవంతమైన సహజ బ్లీచింగ్ కారకాలు. ఒక టమోటాను తీసుకుని గుజ్జుగా చేయండి మరియు దానికి నిమ్మ రసం రెండు టేబుల్ స్పూన్స్ కలండి. ముఖానికి ఈ గుజ్జును పూయండి మరియు అలానే 15 నిమిషాలు ఉంచండి. తరువాత కడగండి.

ఆరెంజ్ పీల్స్ మరియు పాలు క్రీమ్
ఎండలో నారింజ పీల్స్ కొన్నిటిని బాగా ఎండనివ్వండి మరియు బాగా ఎండిన తర్వాత, వాటిని మెత్తటి పొడి చేయండి. ఈ పొడిని రెండు టేబుల్ స్పూన్స్ తీసుకుని ఒక టేబుల్ స్పూన్ పాల మీగడతో కలపండి. ఈ పేస్ట్ ను ముఖానికి పట్టించండి మరియు 20 నిమిషాలు అలానే ఉంచండి. తరువాత చల్లని నీటితో కడగండి.

పాలు మరియు నిమ్మకాయ
ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసంతో ఒక టేబుల్ స్పూన్ పచ్చి పాలు కలపండి. వీటిని 10 నిమిషాల వరకు చిక్కగా అయ్యేవరకు బాగా వాటిని కలపాలి. ముఖానికి ఈ పేస్ట్ ను పట్టించండి మరియు అలానే 15 నిమిషాలు ఉంచండి. సున్నితమైన చర్మం కోసం సురక్షితమైన మరియు తేలికపాటి సహజంగా ఇంట్లో తయారు చేసుకునే బ్లీచ్ లలో ఒకటి.

పసుపు మరియు నిమ్మకాయ
పసుపు ఒక చిటికెడు, కొన్ని చుక్కల నిమ్మరసం మరియు కొన్ని చుక్కల రోజ్ వాటర్ కలిపి పేస్ట్ చేయండి. సున్నితంగా ఈ పేస్ట్ ను ఎగువ దిశగా ముఖానికి పట్టించండి. 20 నిమిషాలపాటు అలానే ఉంచండి మరియు తరువాత కడగండి.

నిమ్మకాయ, పాలు మరియు అనాస
ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాతో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం మరియు పాలు కలపండి. దానిలో తురిమిన పైనాపిల్ ముక్కలు కలండి. పేస్ట్ అయ్యేవరకు కలపండి మరియు ఈ పేస్టును ముఖానికి పట్టించండి. 15 నిమిషాలు అలానే ఉంచి, తరువాత కడిగేయండి.

ఆపిల్ పళ్లరసం, వినెగార్ మరియు తేనె
ఆపిల్ పళ్లరసం కూడా మీ చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది మరియు దీనిని తేనెతో కలిపినప్పుడు మీ చర్మం ఆరోగ్యంగా మరియు ప్రకాశవంతంగా అవుతుంది. ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ లో ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ పళ్లరసం, వినెగార్ కలపండి మరియు దీనికి ఒక టేబుల్ స్పూన్ తేనె కలండి. ముఖానికి ఈ మిశ్రమాన్ని పట్టించండి మరియు 20 నిమిషాలు అలానే వదిలేయండి. తరువాత కడగండి.



Click it and Unblock the Notifications











