శీతాకాలంలో చర్మంపై దురద పోగొట్టే సింపుల్ టిప్స్

By Nutheti

శీతాకాలం వచ్చిందంటే చాలు.. చర్మమంతా పగిలి, పెచ్చుల్లా రాలిపోతూ.. ఎక్కడ చూసినా దురద వేధిస్తుంది. ఒక్క పూట మాయిశ్చరైజర్ రాసుకోవడం మర్చిపోయినా.. అంతే సంగతి. చర్మం దురదగా ఉండటమే కాదు.. పగుళ్ల వల్ల చర్మం నల్లగా మారిపోతుంది.

READ MORE: శీతాకాలంలో చర్మ రక్షణకు: 10 టాప్ టిప్స్

కొందరికైతే దురతో ఆగిపోదు. చిన్న చిన్న పొక్కులు వచ్చి మరింత ఇబ్బందికి గురిచేస్తాయి. ఇలా దురద నుంచి, పగుళ్ల నుంచి, పొక్కుల నుంచి బయటపడాలంటే.. సౌందర్య ఉత్పత్తులు వాడటం కంటే.. హోం రెమిడీస్ ఉపయోగించడం బెటర్. చర్మానికి కావాల్సినంత తేమను అందించి.. చర్మం మృదువుగా మారడానికి సహాయపడతాయి.

గుడ్డు సొన

గుడ్డు సొన

గుడ్డులోని పచ్చసొన, టీ స్పూన్ తేనె, పాలపొడి తీసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలిపి మిశ్రమం తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ని ముఖానికి, చేతులకు అప్లై చేసి 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. తేనెలో యాంటీ మైక్రోబియల్ గుణాలు బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. చర్మానికి కావాల్సిన తేమను అందిస్తాయి.

ఓట్ మీల్

ఓట్ మీల్

ఓట్ మీల్ పౌడర్ ని నీటిలో కలిపి పేస్ట్ లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని దురదగా అనిపించిన చోట రాసుకోవాలి. బాగా ఆరిపోయిన తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేస్తే దురద తగ్గడమే కాదు.. చర్మం స్మూత్ గా తయారవుతుంది.

ఎసెన్షియల్ ఆయిల్స్

ఎసెన్షియల్ ఆయిల్స్

ఎనెన్షియల్ ఆయిల్స్ లో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలుంటాయి. ఇవి దురదను తగ్గించటానికి తోడ్పడతాయి. ఏదో ఒక ఎసెన్షియల్ ఆయిల్ తీసుకుని చర్మంపై కాసేపు మర్దనా చేసుకుని గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే.. చర్మానికి పోషణ లభించడమే కాదు.. స్మూత్ గా మెరిసిపోతుంది.

కలబంద

కలబంద

చలికాలంలో కొన్నిసార్లు చర్మంపై దురదతో పాటు చిన్న చిన్న కురుపులు వస్తూ ఉంటాయి. వీటిని తగ్గించుకోవడానికి కలబందను ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు మంట, దురద వంటి సమస్యలకు కూడా చెక్ పెడుతుంది. చర్మం డ్రైగా మారి దురదగా అనిపించిన చోట, కురుపులు ఏర్పడిన ప్రాంతంలో కలబంద గుజ్జుని అప్లై చేయాలి. ఆరిన తర్వాత తుడుచుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

అవకాడో

అవకాడో

బాగా పండిన అవకాడో తీసుకుని మెత్తగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పొడిగా మారిన చర్మానికి అప్లై చేసుకోవాలి. చర్మం మరీ పొడిగా మారి ఉంటే.. అవకాడో గుజ్జుకి కాస్త తేనెను కలుపుకుని రాసుకోవాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగేసుకుంటే ఫలితం ఉంటుంది.

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్

స్నానానికి ముందు నీటిలో రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ కలపాలి. ఆ నీటితో స్నానం చేస్తే చర్మం పొడిబారకుండా.. మృదువుగా ఉంటుంది.

కొబ్బరి నూనె

కొబ్బరి నూనె

పొడిబారిన చర్మానికి చక్కటి పరిష్కారం కొబ్బరినూనె. అప్పుడప్పుడు కొబ్బరి నూనెతో చర్మానికి మర్ధనా చేసుకోవడం వల్ల చర్మం పొడిబారకుండా.. స్మూత్ గా మారుతుంది.

సెనగపిండి

సెనగపిండి

సెనగపిండిలో నువ్వులనూనె, కొద్దిగా పసుపు, తేనె, ఒక స్పూను పెరుగు కలిపి ముఖానికి రాసుకుని పదినిమిషాలైన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

అరటిపండు

అరటిపండు

అరటిపండు సౌందర్యానికి బాగా ఉపయోగపడుతుంది. అరటిపండు గుజ్జులో పాల మీగడ, తేనె కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే పొడిబారిన చర్మం స్మూత్ గా మారడమే కాదు.. కొత్త నిగారింపుని సంతరించుకుంటుంది.

Story first published: Thursday, November 12, 2015, 18:02 [IST]
Desktop Bottom Promotion