Latest Updates
-
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి!
సున్నిపిండిలో బ్యూటీ బెనిఫిట్స్ ఎన్నో..ఎన్నెన్నో...
బ్లాక్ గ్రామ్ (ఉద్దిపప్పు)మన నిత్యవసర వస్తువు. మన ఇండియాలో బాగా తెలిసిన ఆహార పదార్థం. దీన్ని వివిధ వంటల్లో విరివిగా ఉపయోగిస్తుంటాము. ఎందుకంటే వీటిలో ప్రోటీనులు, విటమిన్స్, మినిరల్స్, ఫైబర్, స్ట్రార్చ్ అధికంగా ఉంటాయి.
ఈ పోషకవిలువలు మాత్రమే కాదు, ఈ బ్లాక్ గ్రామ్ లో అనేక చర్మం మరియు జుట్టుకు సంబంధించిన ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇది ఆరోగ్యకరమైన చర్మంను మరియు జుట్టును ప్రోత్సహిస్తుంది. అందుకే అనేక బ్యూటీ ప్రొడక్ట్స్ లో వీటిని విరివిగా ఉపయోగించడం జరుగుతుంటుంది.
ఫేస్ ప్యాక్ గా ఉపయోగించినప్పుడు, చర్మానికి మంచి గ్లోను తీసుకొస్తుంది. ఉద్దిపప్పు(సున్నిపిండిని)ముఖానికి అప్లై చేయడం వల్ల స్కిన్ స్ట్రక్చర్ సాప్ట్ గా మరియు మ్రుదువుగా మారుతుంది.
నిజానికి భారత్ లోనే సున్ని పిండిని స్కిన్ ఎక్స్ ఫ్లోయేట్ గా ఉపయోగిస్తున్నారు. కొంత మంది సోపుకు ప్రత్యామ్నాయంగా సున్నిపిండిని బాడీ స్ర్కబ్బర్ గా ఉపయోగిస్తున్నారు.
దీన్ని శరీరానికి అప్లై చేసి మర్దన చేయడం వల్ల చర్మంలోని మురికి మరియు డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. మరి ఈ సున్ని పిండి వల్ల చర్మానికి కలిగే మరికొన్ని ప్రయోజనాలను ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకుందాం...

సన్ బర్న్ నివారిస్తుంది:
బ్లాక్ గ్రామ్(సున్నిపిండి)లో చర్మంను కాంతివంతంగా మార్చే లక్షణాలు, చర్మ సమస్యలను నివారించే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది సన్ బర్న్ ను నివారిస్తుంది. సున్నిపిండిలో కొద్దిగా పెరుగు మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఇది చాలా ఎఫెక్టివ్ గా సన్ బర్న్ నివారిస్తుంది.

దీన్ని స్ర్కబ్బర్ గా కూడా ఉపయోగించవచ్చు:
బ్లాక్ గ్రామ్ (సున్నిపిండి) వల్ల చర్మానికి ఎక్కువ ప్రయోజనం. రెండు చెంచాల నెయ్యి మరియు రెండు చెంచాల పాలు మిక్స్ చేసి పేస్ట్ లా చేసి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ హోం రెమెడీ డెడ్ స్కిన్ సెల్స్ తొలగిస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.

చర్మ కాంతిని మెరుగుపరుస్తుంది:
సున్నిపిండి చర్మ కాంతిని మెరుగుపరుస్తుంది మరియు ఇది నేచురల్ బ్లీచ్ గా పనిచేస్తుంది . నీళ్ళలో ఉద్దులు మరియు బాదం రెండు నానబెట్టి, ఉదయం మిక్సీలో వేసి, మెత్తగా పేస్ట్ చేసి ముఖానికి పట్టించాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 15నిముషాల తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి.

మొటిమలను నివారిస్తుంది:
బ్లాక్ గ్రామ్ లో చర్మాన్ని శుభ్రపరిచే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . అంతే కాదు చర్మంలోని బ్యాక్టీరియాను నివారించే యాంటీసెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . ఈ మిశ్రమాన్ని రెగ్యులర్ గా అప్లై చేస్తుంటే సున్నిపిండి మొటిమలను నివారిస్తుంది.

మచ్చలను తగ్గిస్తుంది:
బ్లాక్ గ్రామ్ లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ముఖంలో మచ్చలను తగ్గిస్తుంది. మీ చర్మం యంగ్ గా కనబడుతుంది. రెగ్యులర్ గా ఉపయోగిస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

మీ జుట్టును సాఫ్ట్ గా మార్చుతుంది:
జుట్టుకు బ్లాక్ గ్రామ్ తో కలిగే ప్రయోజనాలు . మీ జుట్టు డ్రైగా ఉన్నట్లైతే వాటిని సాఫ్ట్ గా మార్చుకోవాలని కోరుకుంటున్నట్లైతే ఈ హోం రెమెడీ చక్కగా పనిచేస్తుంది . ఈ దాల్లో ఉండే న్యూట్రీషియన్స్ జుట్టును సాఫ్ట్ గా మరియు షైనీగా మార్చుతుంది. ఈ సున్నిపిండిలో కొద్దిగా పెరుగు చేర్చి మీ జుట్టుకు మరియు తలకు అప్లై చేాయలి . అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.

రోజ్ వాటర్-సున్నిపిండి(రోజ్ వాటర్):
రెండు చెంచాల సున్నిపిండి పౌడర్ లో నాలుగు చెంచాల పాలు, రెండు చెంచాల రోజో వాటర్ కలపాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పది నిమిషాల తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేసినట్లైతే చర్మంలోని జిడ్డు తొలగి అందంగా, ఆకర్షణీయంగా తయారవుతుంది.

సున్నిపిండి-(పసుపు):
పూర్వకాలం నుంచి నేటి వరకూ సాంప్రదాయబద్దంగా ఉపయోగించే వస్తువు మినపప్పు, పసుపు. ఇవి రెండూ శరీర ఆరోగ్యానికి, చర్మ ఆరోగ్యానికి అందాన్ని ఇచ్చేవి. ఒక ప్రాత్రలో రెండు స్పూన్ల మినపప్పు పౌడర్ లో చిటికెడు పసుపు, కాస్త నీటిని వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసిన అరగంట సేపు తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రపరిచినట్లైతే చర్మం ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

జిడ్డు చర్మానికి (పెరుగు-నిమ్మరసం):
సున్నిపిండికి పెరుగు కలిపిన చిక్కగా పేస్ట్ లా చేసి ఫేషియల్ వేసుకుంటే జిడ్డు తొలగి ముఖం అందంగా మారిపోతుంది. ఒక పాత్రలో మినపప్పు తీసుకొని అందులో మినుపపిండి, నిమ్మరసం వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరచాలి. ఇలా చేస్తే జిడ్డు తగ్గి ముఖం అందంగా మారుతుంది.

డల్ గా ఉన్న ముఖం కోసం(హెర్బల్):
మినపపిండి(సున్నిపిండితో పాటు, తులసి, వేప ఆకుల పొడిని కలిపి, అందులో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి ప్యాక్ లా వేయాలి. పదినిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే చాలు ముఖం కళకళలాడుతూ ప్రకాశవంతంగా మారుతుంది.



Click it and Unblock the Notifications











