Latest Updates
-
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.!
మీ వయస్సు కంటే పెద్దవారిలా కనబడేవారికి 6 నేచురల్ ఫేస్ ప్యాక్స్
చర్మం ముఖ్యంగా వయస్సును నిర్ణయిస్తుంది. ముఖంలో ముడుతలు, మొటిమలు, ఫైన్ లైన్స్ ఏర్పడినప్ప్పుడు ముఖ సౌందర్యంను పూర్తిగా పాడు చేస్తుంది. చిన్న వయస్సులోనే మీరు పెద్ద వయస్కులుగా కనబడుతారు. స్కిన్ ఏజింగ్ ప్రొసెస్ ఆలసత్వం చేయకుండా వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
యవ్వనంగా కనబడుట ప్రతి మహిళ యొక్క డ్రీమ్. యూత్ ఫుల్ స్కిన్ పొందడానికి చేయని ఫేషియల్ ఎక్సర్ మెంట్స్ అంటూ ఉండవు. కానీ మీ ఫేషియల్ స్కిన్ వెనుక దాగున్న రహస్యం ఏంటో తెలుకోలేకపోతున్నారు. ముఖంలో ముడుతలు లేకుండా, సాఫ్ట్ గా బేబీ స్కిన్ కలిగి ఉంటే ఈ ప్రపంచంలో మీ వయస్సును గుర్తించే వారే ఉండంటే అతిశయోక్తి లేదు.
READ MORE: ఈ ఆహారాలు తింటే ముసలితనం మీ దరిచేరదు
కాబట్టి, అందుకు ఇప్పుడు మీరు వర్రీ అవ్వాల్సిన పనిలేదు, మీకోసం కొన్ని ఎఫెక్టివ్ మరియు బెస్ట్ నేచురల్ ఫేస్ ప్యాక్స్ ఉన్నాయి . ఈ ఫేస్ ప్యాక్స్ ను చర్మంలోని వయస్సుపైబడ్డం తెలిపే అన్ని రకాల లక్షణాలను తొలగిస్తాయి. మరియు ఈ హోం రెమెడీస్ ఏజింగ్ ప్రోసెస్ ను ఆలస్యం చేస్తాయి.
మీరు ఏజ్ లెస్ స్కిన్ పొందడానికి సింపుల్ విషయం ఏంటంటే, ఈ చిన్ని చిట్కాలను అనుసరించాలి. యంగ్ గా కనబడుటకు కొన్ని ఫేస్ ప్యాక్స్ ఈ క్రింది విధంగా...

బియ్యం పిండి మరియు పాలతో ప్యాక్:
బియ్యం పిండి సాగిన చర్మంను టైట్ చేస్తుంది దాంతో యవ్వనంగా కనబడుతారు. బియ్యం పిండిలో కొద్దిగా పాలు మిక్స్ చేయడం వల్ల మరింత గ్లో వస్తుంది . చర్మం యొక్క కాంతి మెరగవుతుంది . ఈ ప్యాక్ వేసుకొన్న 15నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల ముడుతలు మరియు డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి.

ఓట్స్ అండ్ పెరుగు ప్యాక్:
ఓట్స్ పొడిని పెరుగులో వేసి మిక్స్ చేసి ముఖానికి పట్టించి సర్కులర్ మోషన్ లో మర్దన చేయాలి. ఇది మీ చర్మం ను ఎక్స్ ఫ్లోయేట్ చేస్తుంది మరియు డెడ్ స్కిన్ సెల్స్ ను నివారిస్తుంది. పెరుగు చర్మానికి పోషణ అందిస్తుంది మరియు చర్మం మెరిసేలా చేస్తుంది.

. ఎగ్ మాస్క్:
యూత్ ఫుల్ స్కిన్ పొందడానికి ఇది చాలా సింపుల్ స్టెప్.. గుడ్డును మ్యాష్ చేసి ముఖానికి పట్టించి 15 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది సాగిన చర్మంను టైట్ చేస్తుంది . చర్మం యవ్వనంగా కనబడేలా చేస్తుంది. ఇది ఒక మోస్ట్ ఎఫెక్టివ్ ఫేస్ మాస్క్.

అరటిపండ్లు:
స్కిన్ టైటనింగ్ కు బనానా ఫేస్ ప్యాక్ గ్రేట్ గా సహాయపడుతుంది. బాగా పండిన అరటిపండును మ్యాష్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ముఖం ప్రకాశవంతంగా మారుతుంది . అప్లై చేసిన 20నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

బొప్పాయి మరియు నిమ్మరసం:
బొప్పాయి మరియు నిమ్మరసం ను మ్యాష్ చేసి ముఖ చర్మానికి అప్లై చేయాలి. ఇది మీ చర్మంను సాఫ్ట్ గా చేస్తుంది. మరియు యంగ్ అండ్ గ్లోయింగ్ గా మార్చుతుంది. ఇది ఎక్కువ యాంటీఆక్సిడెంట్స్ , విటమిన్స్ మరియు ఎంజైమ్స్ , పెపైన్ అనే ఎంజైమ్ ను కలిగి ఉండటం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగిస్తుంది. చర్మం యవ్వనంగా కనబడేలా చేస్తుంది.

మామిడిపండు మరియు రోజ్ వాటర్:
బాగా పండిన మామిడిపండు గుజ్జులో రోజ్ వాటర్ మిక్స్ చేసి ముఖానికి పట్టించి 15నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఇది డల్ స్కిన్ నివారించి మంచి షైనింగ్ మరియు గ్లోను అందిస్తుంది. తరచూ ఇలా చేస్తుంటే మీ చర్మం చాలా యూత్ ఫుల్ గా కనబడుతుంది . ఈ హోం రెమెడీ చర్మంను టైట్ చేయడంలో కూగా గ్రేట్ గా సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications
