Latest Updates
-
కండలను ఉక్కును మార్చే రాగితో హెల్తీ బన్ దోశ.. బరువు తగ్గాలంటే పక్కా తినాల్సిందే.! -
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.!
కేవలం 15రోజుల్లో ఫెయిర్ నెస్ స్కిన్ పొందడం ఎలా
మన శరీరంలో చర్మం చాలా సున్నితమైనటువంటి మరియు ముఖ్యమైన పార్ట్. మరి ఇంత సున్నితమైన చర్మం ఎండకు, వాతావరణ కాలుష్యం, మురికి మరియు వాతవరణ వేడి వల్ల చాలా తర్వగా హాని కలుగుతుంది. ఈ అన్ని కారణాల వల్ల చర్మం డార్క్ గా మరియు డల్ గా మారుతుంది.
ఈ సమస్యలను నివారించుకోవడానికి మనం బిబి, సిసి క్రీములు మరియు ఇతర విలువైన ప్రొడక్ట్స్ ను ఎక్కువగా ఉపయోగిస్తుంటాము. చర్మ కాంతిని మెరుగుపరుచుకోవడానికి ఇలా వివిధ రకాల క్రీములను ఎన్ని రోజులని ఉపయోగిస్తాము చెప్పండి? ఎన్ని ఖరీదైనా క్రీములు రాసుకొన్ని, ట్రీట్మెంట్స్ తీసుకొన్నా కొద్ది రోజుల తర్వాత తిరిగి అదే సమస్య మొదలవుతుంది. READ MORE: ఇండియన్ ఛర్మ ఛాయను ఫెయిర్ గా మార్చే నేచురల్ ఫేస్ ప్యాక్స్
ఎప్పుడు బయట వెళ్ళడానికి 20 ముందు శరీరానికి సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేయాలి. సన్ స్క్రీన్ spf 40 ఇండియన్ వాతావరణంకు చాలా ఉత్తమమైనది . ఇది చర్మంను క్లీన్ గా ఉంచుతుంది మరియు ఇంటికి రాగానే గోరువెచ్చనీ నీటితో ముఖం కాళ్ళు చేతులను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం మీద ఉండే దుమ్ము ధూలి తొలగిపోతుంది. దాంతో అనేక చర్మ సమస్యలను నివారించుకోవచ్చు.
అంతే కాదు, ఎక్కువగా నీరు తీసుకోవడం, ఎల్లప్పుడూ శరీరంను హైడ్రేషన్లో ఉంచుకోవడం చాలా అవసరం. నీళ్ళు ఒక నేచురల్ హీలర్. ఈ ప్రక్రియలో శరీరంలోని జీవక్రియలు చురుకుగా పనిచేసి శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు నెట్టివేయడం వల్ల మీరు చూడటానికి అందంగా మరియు ఆరోగ్యంగా ఉంటారు.
READ MORE: మిమ్మల్ని తెల్లగా మార్చే 20 నేచురల్ ఫేస్ ఫ్యాక్స్
కాబట్టి, ఉన్నపళంగా కేవలం 15రోజుల్లో మీరు ఫెయిర్ గా మారాలంటే కొన్ని హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి...

గుడ్డు ప్యాక్:
ఒక గుడ్డును బాగా గిలకొట్టి, దాన్నీ నేరుగా ముఖానికి అప్లై చేయాలి. 10-20నిముషాలు అలాగే వదిలేసి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. మీకు గుడ్డు వాసన పడకపోతే అందులో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసుకోవాలి.

టమోటోలు:
కొన్ని టమోటోలను మొత్తగా పేస్ట్ చేసి, అందులో కొద్దిగా నిమ్మరసం, శెనగపిండి మిక్స్ చేయాలి. తర్వాత ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది నేచురల్ గా పనిచేస్తుంది మరియు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

లెంటిల్స్ :
శెనగపిండిలో కొద్దిగా తేనె మరియు పసుపు మిక్స్ చేసి దీన్ని ముఖం, మెడ, మరియు ఇతర భాగాలకు అప్లై చేసి 20నిముషాలు అలాగే ఉంచిత తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్రతి రోజూ చేసుకొన్ని మంచి ఫలితాలను పొందవచ్చు.

దాల్:
తూర్ దాల్ లేదా చెన్నా దాల్ లేదా మసూర్ దాల్ ను మెత్తగా పొడి చేసుకొని అందులో ముల్లాని మట్టి మిక్స్ చేసి దీన్నిపూర్తిగా ఫేస్ మరియు నెక్ కు అప్లై చేసి 20నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

బంగాళదుంపలు:
బంగాళదుంపలను పేస్ట్ చేసి అందు నుండి వచ్చే రసాన్ని ముఖానికి అప్లై చేయాలి. బంగాళదుంప నేచురల్ స్కిన్ లైటనర్ కాబట్టి, దీన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మాన్ని లైట్ గా మార్చుతుంది.

జీలకర్ర:
ఒక చెంచా జీలకర్రను మరిగించి, ఆ నీటితో మీ ముఖాన్ని ప్రతి రోజూ శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

క్యారెట్ మరియు అవొకాడో:
అవొకాడో, క్యారెట్, తేనె మరియు ఎగ్ వైట్ ను మిక్స్ చేసి ముఖం మరియు మెడకు అప్లై చేసి 20నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే 15రోజుల్లో మంచి ఫలితం ఉంటుంది.



Click it and Unblock the Notifications