Latest Updates
-
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.?
మొటిమలు రావడానికి అనారోగ్య సమస్యలు కారణమా ?
చర్మం ఎంత అందంగా.. ఎంత కాంతివంతంగా ఉన్నా.. చిన్న మొటిమ చాలు.. ఎట్రాక్షన్ తగ్గిపోవడానికి. అందుకే ఏ చిన్న మొటిమ కనపడినా హైరానా పడిపోతుంటారు యువకులు. అయితే ముఖంపై మొటిమలు ఏ భాగంలో ఎప్పుడు.. ఎందుకు వస్తాయో తెలుసుకుంటే.. అవి రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవచ్చు.
మనం తీసుకునే ఆహారాన్ని బట్టే చర్మ సౌందర్యం ఆధారపడి ఉంటుంది. సరైన సమయానికి.. సరైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. అలాగే చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు.. ఎక్కువ మోతాదులో మంచినీళ్లు తాగడం వల్ల చర్మంపై ఎలాంటి సమస్య ఉండదు. అయితే.. ముఖంపై ఏ భాగంలో మొటిమలు వస్తే.. ఎలాంటి సమస్య ఉంటుందో తెలుసుకుందాం...

నుదురు
మొటిమలు, చిన్న చిన్న గుళ్లలు ఎక్కువగా నుదిటి భాగంలో కనిపిస్తుంటాయి. ఈ భాగంలో యువకులకే కాదు.. పెద్దవాళ్లలోనూ మొటిమల సమస్య ఉంటుంది. నిత్యం ఎక్కువ నీళ్లు తాగటం వల్ల.. ఇక్కడ మొటిమలు రావు. నుదురుపై మొటిమలు రావడానికి అజీర్తి, డీహైడ్రేషన్ కూడా కారణం. వేళకు ఆహారం తీసుకోవడం, పౌష్టికాహారం ఉండేలా చూసుకోవడం వల్ల మొటిమలకు చెక్ పెట్టవచ్చు.

బుగ్గలు
చూడగానే ఎట్రాక్ట్ చేసే బుగ్గల అందం.. మగువ అందాన్ని రెట్టింపు చేస్తుంది. కానీ.. చాలామందిని బుగ్గలపై మొటిమలు వేధిస్తుంటాయి. స్మోకింగ్, పొల్యూషన్ కారణంగా బుగ్గలపై మొటిమలు వస్తుంటాయి. కాలుష్యంలో ఎక్కువగా తిరగడం వల్ల ముఖంపై గాలి, దుమ్ము చేరుకుని.. మొటిమలకు కారణమవుతుంది. కాబట్టి బయటకు వెళ్లినప్పుడు ముఖానికి ప్రొటెక్టివ్ లోషన్ రాసుకోవడం మంచిది. అలాగే.. దిండు కవర్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి.

చిన్
గడ్డం దగ్గర మొటిమలు ఉన్నాయంటే చాలా అలర్ట్ గా ఉండాలి. చిన్న ప్రేగులో సమస్య ఉన్నప్పుడే ఇక్కడ మొటిమలు మొదలవుతాయి. అలాగే.. ఆలోచనలో ఉన్నప్పుడు.. బోర్ కొట్టినప్పుడు కొంతమంది గడ్డం కింద చేయి పెట్టుకుని కూర్చుంటారు. దీనివల్ల చేతిలో ఉండే బ్యాక్టీరియా.. చర్మానికి అంటుకోవడం వల్ల మొటిమలు వస్తుంటాయి.

చెవులు
కిడ్నీలో సమస్యలతో పాటు.. డీహైడ్రేషన్ అవుతుందంటే.. చెవి భాగంలో మొటిమలు వస్తుంటాయి. ఉప్పు కూడా మీరు ఎక్కువ తీసుకుంటున్నారడనడానికి ఇది సంకేతం. తలస్నానం చేసేప్పుడు కండిషనర్, నూనెను శుభ్రంగా క్లీన్ చేసుకోకపోయినా.. ఈ భాగంలో మొటిమలు మొదలవుతాయి.

నోటి చుట్టూ
దంత సమస్యలు వేధిస్తున్న వాళ్లకు.. నోటి చుట్టూ మొటిమలు కూడా ఎక్కువగా బాధిస్తుంటాయి. టీ, కాఫీలు తీసుకోవడం తగ్గించడంతోపాటు.. తీపి పదార్థాలు తగ్గించాలి. రోజుకి రెండుసార్లు బ్రష్ చేసుకోవడం కూడా మంచిది.

టీ జోన్
ముక్కు, నుదురు భాగాల్లో మొటిమల సమస్య ఎక్కువగా టీనేజర్లను వేధిస్తుంటాయి. ఈ భాగాల్లో మొటిమలు మొదలయ్యాయంటే.. కాలేయానికి సంబంధించిన సమస్య ఉందని గ్రహించాలి. కాబట్టి ఫ్యాట్ ఫుడ్, జిగురు పదార్థాలు ఆహారంలో లేకుండా చూసుకోవాలి.



Click it and Unblock the Notifications