Latest Updates
-
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.?
మొటిమలను పూర్తీగా నివారించే అద్భుత ఔషధం..! వేప..!!
మీ ముఖంపై మొటిమలు వేధిస్తున్నాయా ? ఎన్ని రకాలుగా ప్రయత్నించినా.. మొటిమలు మాత్రం తగ్గడం లేదా ? హోం రెమిడీస్, న్యాచురల్ రెమిడీస్ ట్రై చేసి, చేసి విసిగిపోయి ఉంటే.. ఈ పవర్ ఫుల్ అండ్ ఎఫెక్టివ్ పదార్థాన్ని ఒక్కసారి ప్రయత్నించి చూడండి.. మీ ముఖంపై మొటిమలు పర్మనెంట్ గా మాయమవుతాయి.
వేప నూనెలోని సొగసు చిట్కాలు తెలుసా ?
వేప పురాతన కాలం నుంచి న్యాచురల్ మెడిసిన్ లా ఉపయోగపడుతోంది. ఎలాంటి చర్మ సమస్యలనైనా నివారించడనాకి ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అలాగే ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి అంతర్గత సమస్యనైనా నివారిస్తుంది. ఇక వేప నూనెను కూడా రకరకాల చర్మ సమస్యలు, జుట్టు సమస్యలు అరికట్టడానికి ఉపయోగిస్తారు.
జుట్టుురాలడం నుండి అనేక హెయిర్ ప్రాబ్లెమ్స్ నివారించే ఆయుర్వేదిక్ రెమెడీ వేప
వేప ఆయిల్ ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. లేదా మార్కెట్ లో కొనుక్కోవచ్చు. దీని వాసన కాస్త విభిన్నంగా ఉన్నప్పటికీ.. ఇది సమస్య సమస్యలపై ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మొటిమలు కనిపించకుండా చేస్తుంది. కాబట్టి.. మీ ముఖ సౌందర్యాన్ని దెబ్బతీస్తున్న మొటిమలను పర్మనెంట్ గా నివారించడానికి వేపను ఎలా ఉపయోగించాలో చూద్దాం..

వేప నూనె
టీ స్పూన్ వేప నూనెను ఒక గిన్నెలో తీసుకోవాలి. కాస్త వేడి చేసి.. మొటిమపై రాసుకోవాలి. రాత్రంతా అలానే ఉంచి ఉదయాన్నే శుభ్రం చేసుకోవాలి. వారంపాటు ఈ చిట్కా పాటించి చూడండి.

వేప, పసుపు
వేపతోపాటు, పసుపుని మిక్స్ చేసి రాస్తే అద్భుతంగా పనిచేస్తుంది. ఈ రెండింటి మిశ్రమాన్ని మొటిమలపై అప్లై చేసి ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. పసుపులో ఉన్న యాంటీ సెప్టిక్ గుణాలు.. మొటిమలను పర్మనెంట్ గా నివారిస్తాయి. అలాగే.. మొటిమల పక్కన ఇన్ఫెక్షన్ కాకుండా నివారిస్తుంది.

వేప
మీ చర్మంపై మొటిమలు తొలగిపోయి.. మెరిసే చర్మాన్ని పొందాలంటే.. వేపాకు పేస్ట్ ని వారానికి ఒకసారి అప్లై చేస్తూ ఉండాలి. కాస్త ఇబ్బందిగా ఉన్నప్పటికీ.. మొటిమలు, మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలు తొలగిపోతాయి.

వేప, దాల్చిన చెక్క
ఒక టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, రెండు టేబుల్ స్పూన్ వేప ఆకు పేస్ట్ తీసుకుని బాగా మిక్స్ చేసి.. మొటిమలపై రాసుకోవాలి. ఈ రెండింటిలో ఉండే గుణాలు.. మొటిమలు నివారిస్తాయి.

వేప రసం
తాజా వేపాకు రసంతో.. రోజుకి రెండుసార్లు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ రసం చర్మానికి క్లెన్సింగ్ లా పనిచేస్తుంది. మొటిమలు ఎక్కువ కాకుండా, పెద్దగా మారకుండా నివారిస్తుంది. అలానే ట్యాన్ ని నివారిస్తుంది.

వేప పొడి
వేపాకు పొడికి, పాలు కలిపి పేస్ట్ తయారు చేసి ఫేస్ కి అప్లై చేయాలి. కొంతమంది అమ్మాయిలను వేధించే పీరియడ్ పింపుల్స్ ని కూడా.. ఈ ఫేస్ ప్యాక్ తగ్గిస్తుంది. ఈ ప్యాక్ ని రెండు మూడు రోజులకు ఒకసారి మీ పీరియడ్ డేట్ కి ముందు అప్లై చేస్తే.. మంచి ఫలితం ఉంటుంది.

వేప సోప్
ఈ ఫేస్ ప్యాక్స్, ఫేస్ వాష్ లు అప్లై చేయడానికి లేజీగా ఫీలవుతుంటే.. మార్కెట్ లో లభించే నీమ్ సోప్ లేదా వేప సోప్ ని ఉపయోగించవచ్చు. ఇది మొటిమలు రాకుండా నివారించడంతో పాటు.. ఫ్రెష్ లుక్ ని అందిస్తుంది.



Click it and Unblock the Notifications