Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
చర్మానికి స్క్రబ్బింగ్ వల్ల కలిగే 10 అద్భుతమైన ప్రయోజనాలు
క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ లాగే స్క్రబ్బింగ్ కూడా మన చర్మాన్ని శుభ్రపరచడంలో ముఖ్య భూమిక పోషిస్తుంది.స్క్రబ్బింగ్ వల్ల చాలా రకాల చర్మ సమస్యలని నివారించవచ్చు.మార్కెట్లో రకరకాల బాడీ మరియూ ఫేషియల్ స్క్రబ్స్ దొరుకుతున్నప్పుడు మృత కణాలని తొలగించుకోవడం పెద్ద సమస్య కాదు.ఇవే కాకుండా మీరే సొంతంగా కొన్ని స్క్రబ్స్ ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు కూడా.మీ చర్మ తత్వానికి సరిపడే స్క్రబ్ ఎంచుకుంటే చాలు.ఏ స్క్రబ్ వాడీనా కానీ చిన్నగా వలయాకారాల్లో రుద్దుతూ చూడండి, స్క్రబ్ చ్దేసే అధ్భుతాలు మీరే చూస్తారు.
అసలు ఈ స్క్రబ్బింగ్ ఎలా పనిచేస్తుంది??దీని వల్ల లాభాలేమిటి??ఈ ఆర్టికిల్ ద్వరా ఈ ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి.అసలు మృత కణాలు ఎందుకు తొలగించుకోవాలో మీకు కనుక తెలియకపోతే మేము క్రింద పేర్కొన్న 10 కారణాలు చూస్తే మీకే అర్ధమవుతుంది. అవేమిటో చూద్దామా..

1.అధ్భుతమైన చర్మం కోసం:
స్క్రబ్బింగ్ వల్ల మీ చర్మంలో పేరుకుపోయిన మురికి,నూనెలు,చెమట తొలగించబడి చర్మం ఒక క్రొత్త రూపు సంతరించుకుంటుంది.బయట దొరికే క్లెన్సింగ్ మిల్క్, ఫేస్ వాష్ తదితర ఫేస్ క్లీనర్లు ఏవీ కూడా మీ చర్మ రంధ్రాల్లో పేరుకుపోయిన మురికిని పూర్తిగా తొలగించలేవు.స్క్రబ్బింగ్ తోనే ఇది సాధ్యం.కాస్త బ్రౌన్ షుగర్లో తేనె కలిపి ఒక స్క్రబ్ తయారు చేసుకుని వారానికి రెండూ సార్లు ఉపయోగిస్తే మీరే తేడాని గమనించవచ్చు.

2.చర్మం పొట్టురాలడాన్ని అరికడుతుంది:
చర్మం నుండి పొట్టు రాలుతోంటే చూడటానికి చాలా వికారంగా ఉంటుంది.ఇలా అవుతోందంటే మీ చర్మానికి మీరు తగినంత జాగ్రత్త తీసుకోవట్లేదనే అర్ధం.ఇలాగే వదిలిస్తే డ్రై స్కిన్ ప్యాచెస్ వచ్చెస్తాయి పైగా మృతకణాలు కూడా పేరుకుపోతాయి.స్క్రబ్బింగ్ వల్ల వీటన్నింటినీ నివారించవచ్చు.

3.మృతకణాల తొలగింపు:
మృతకణాలవల్ల మీ చర్మం నిర్జీవంగా కనపడుతుంది. మృతకణాలని అలా మీ చర్మంలో పేరుకుపోనీయడమెందుకు?? స్క్రబ్ చేసి వాటిని తీసెయ్యండి.

4.చర్మానికి మెరుపు వస్తుంది:
స్క్రబ్బింగ్ వల్ల మీ చర్మం ఒక క్రొత్త మెరుపుని సంతరించుకుంటుంది.పాలల్లో కాసిని బియ్యాన్ని రెండు గంటలపాటు నానబెట్టి ఈ మిశ్రమాన్ని రుబ్బి స్క్రబ్ లాగ వాడుకుంటే మీ చర్మం మెరిసిపోవడం ఖాయం.

5.డార్క్ ప్యాచెస్ నివారణ:
స్క్రబ్బింగ్ వల్ల డార్క్ ప్యాచెస్ని పోగొట్టవచ్చని మీకు తెలుసా??కొన్ని బాదం గింజలని పొడి చసి దానిలో పెరుగు కలిపి వేళ్ళ కణుపులు,మోకాళ్ళూ, మోచేతులమీద స్క్రబ్ చేస్తూ ఉంటే కొన్ని రోజులలోనే మంచి ఫలితాన్ని పొందవచ్చు.

6.ఆక్నే మచ్చల నివారణ:
మృత కణాలని తొలగించే స్క్రబ్బింగ్ వల్ల ఆక్నే మిగిల్చిన మచ్చలని కూడా పోగొట్టవచ్చు. ఒక రెండు స్పూన్ల బేకింగ్ సోడాకి ఒక స్పూన్ నీళ్ళు కలిపి చర్మాన్ని స్క్రబ్ చేసుకుంటే ఆక్నే వల్ల చర్మమ మీద ఏర్పడ్డ మచ్చలని సులభంగానే తొలగించవచ్చు.

7.అంతర్లీనంగా పెరిగే జుట్టు నివారణ:
చర్మంలో అంతర్గతంగా పెరిగే జుట్టు ఒక సమస్య అయితే దానికి పరిష్కారం స్క్రబ్బింగ్.రెండు నిమ్మకాయల రసం తీసుకుని దానికి కప్పుడు పంచదార, నీళ్ళూ కలిపి చర్మం మీద స్క్రబ్ చేసుకుంటే లోపల పెరిగే జుట్టుని నివారించవచ్చు.ఈ మిశ్రమంలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలున్న రెండు మూడు చుక్కల టీ ట్రీ ఆయిల్ కూడా కలపవచ్చు. మీరు వ్యాక్సింగ్ చేయించుకున్న రెండు మూడు రోజుల తరువాత ఈ స్క్రబ్ వాడితే మంచి ఫలితాలుంటాయి.

8.కోమలమైన చర్మం:
మీ అందంలో కోమలమైన చర్మం ముఖ్య పాత్ర పోషిస్తుంది.ఒక కప్పుడు బాదం గింజలు,రెండు స్పూన్ల తేనే మరియూ పాలు కలిపి స్క్రబ్ చేసుకుంటే చర్మం కోమలంగా తయారవ్వడమే కాకుండా తేమని కూడా సంతరించుకుంటుంది.

9.చర్మం మృదుత్వాన్ని సంతరించుకుంటుంది.
స్క్రబ్బింగ్ వల్ల మీ చర్మం శుభ్రపడి మృదుత్వాన్ని సంతరించుకుంటుంది.

10.చర్మ కాంతి మెరుగవుతుంది:
చర్మం మీద ఉన్న మృత కణాలు,మచ్చలు, చర్మమలో పేరుకుపోయిన వ్యర్ధాలు తొలగించబడ్డాకా ఏమవుతుంది??చర్మ కాంతి మెరుగవుతుంది.మీరు ఉపయోగించే స్క్రబ్‌లో కనుక సహజ సిద్ధమైన పదార్ధాలుండి అవి చర్మాన్ని తెల్లబరిచేవి అయితే కనుక మీ మేని కాంతి మరింత మెరుగవ్వడం ఖాయం.



Click it and Unblock the Notifications