Latest Updates
-
హనుమాన్ జయంతి వేడుకలు: మాల విరమణకు సిద్ధమవుతున్నారా? భక్తులు తప్పక తెలుసుకోవాల్సిన ఆసక్తికర విషయాలివే! -
శని దేవుడి కరుణ: ఈ రాశుల వారికి నేడు అదృష్టం, మరికొందరికి కఠిన పరీక్ష! -
వృషభం, సింహం, కుంభ రాశుల వారికి ఈ వారం ధన యోగం.. మీ రాశి ఉందా? - 03 నుండి 09 మే 2026 వరకు -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి ఆదివారం అదృష్ట యోగం..! - ఆదివారం, 03 మే 2026 -
వేసవి స్పెషల్.. ఎవరూ ఊహించని పుచ్చకాయ తొక్క హల్వా.. వావ్ అనాల్సిందే! -
రొటీన్ మామిడికాయ పచ్చళ్లతో బోర్ కొట్టిందా? అయితే క్యారెట్ మామిడి పచ్చడి ట్రై చేయండి..వేడి అన్నంలోకి నెయ్యితో.. -
నీట్ పరీక్ష రోజు పీరియడ్స్ వస్తున్నాయా? కంగారు వద్దు.. ఈ చిట్కాలు మీకోసమే! -
తెలంగాణలో మండుతున్న ఎండలు: గర్భిణులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
పొయ్యి వెలిగించే పనే లేదు.. నోట్లో వెన్నలా కరిగిపోయే పచ్చి కొబ్బరి పాయసం -
భార్య వేధింపులు భరించలేక టెక్కీ ఆత్మహత్య: అసలేం జరిగింది?
పసుపు ఫేస్ ప్యాక్ తో పొందే 12 అద్భుతమైన ప్రయోజనాలు..!!
పసుపు గురించి మనందరికీ తెలిసందే..పసుపులో అద్భుతమైన ఔషధగుణాలున్నాయి. భారతీయ వంటల్లో పసుపు తప్పనిసరిగా ఉంటుంది. ఆహారాలకు ఫ్లేవర్ తో, కలర్ కూడా అందిస్తుంది. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నటం వల్ల ఇది గాయాలను మాన్పడంలో గొప్పగా సహాయపడుతుంది. దీన్ని వంటల్లో చేర్చడం వల్ల జీర్ణ శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే యాంటీసెప్టిక్ లక్షణాలు, చర్మసంరక్షణకు గొప్పగా సహాయపడుతాయి. ముఖ్యంగా పసుపు ప్యాక్స్ అన్ని రకాల చర్మ సమస్యలను నివారిస్తాయి.
పసుపును ఇంట్లో ఉండే ఇతర పదార్తాలతో జోడించి ప్యాక్ వేసుకోవడం వల్ల వివిధ రకాలుగా స్కిన్ బెనిఫిట్స్ పొందుతారు. ఒక మన్నికైన ఫేస్ ప్యాక్ ను తయారుచేయడానికి సహజంగా మనకు అందుబాటులో ఉండే పదార్థాలను జోడించాలి. చర్మ సంరక్షణలో ఉపయోగించే ఉత్సత్తుల్లో పసుపు ఒక గ్రేట్ రెమెడీ.
పసుపును ఫేస్ ప్యాక్ గా ఉపయోగిస్తే బెనిఫిట్స్ మరిన్ని ఎక్కువగా ఉంటాయి. ఇది స్కిన్ కంప్లెక్స్ ను పెంచుతుంది . అందమైన చర్మ సౌందర్యాన్ని అందిస్తుంది.
పసుపులో శెనగపిండి, పాలు, రోజ్ వాటర్ , గంధం వంటివి ఉపయోగించి, వెడ్డింగ్ సెర్మనీకి ఉపయోగిస్తుంటారు. ఈ పదార్థాలన్నీ కూడా చర్మానికి గొప్ప ప్రయోజనాలను అందిస్తాయి.
చర్మ సంరక్షణ కోసం వివిధ రకాలుగా ఎలా ఉపయోగించుకోవాలని, ఈ క్రింది విధంగా తెలపడం జరిగింది. ఈ ఫేస్ ప్యాక్స్ అన్నీ కూడా చాలా సులభం. పసుపు వివిధ రకాలుగా ఎటువంటి ప్రయోజనాలను అందిస్తుందో తెలుసుకుందాం..

1. మొటిమలను నివారిస్తుంది:
పాలలో పసుపును మిక్స్ చేసి, ముఖం మొత్తం అప్లై చేయాలి. పసుపులో ఉండే యాంటీఇన్ఫ్లమేటీరీ లక్షణాలు, మొటిమలను కంట్రోల్ చేసి, చర్మంను స్మూత్ గా మార్చుతుంది

2. ఫెయిన్ స్కిన్ :
పసుపులో కొద్దిగా పెరుగు మిక్స్ చేసి పేస్ట్ లా అయిన తర్వాత ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. పెరుగులో ఉండే ల్యాక్టిక్ యాసిడ్ స్కిన్ కంప్లెక్షన్స్ పెంచడంలో గొప్పగా సహాయపడుతుంది.

3.ఫేషియల్ హెయిర్ ను నివారిస్తుంది:
బొప్పాయిని మెత్తగా పేస్ట్ చేసి, అందులో పసుపు మిక్స్ చేసి కలపాలి. ఈ పేస్ట్ ను ముఖానికి లేపనంగా రాసుకోవాలి. బొప్పాయిలో ఉండే నేచురల్ ఎంజైమ్స్ హెయిర్ ఫోలిస్స్ ను విఛ్ఛిన్నం చేస్తాయి. దాంతో ముఖంలో అవాంఛిత రోమాలు మెలవకుండా ఉంటుంది.

4. డార్క్ స్పాట్స్ తగ్గిస్తుంది:
పసుపులో తేనె మిక్స్ చేసి, పేస్ట్ లా అయిన తర్వాత దీన్ని స్పాట్ ట్రీట్మెంట్ గా ఉపయోగించాలి. కాటన్ తో నల్ల మచ్చల మీద మర్దన చేసి, అరగంట తర్వాత శుభ్రం చేసుకుంటే మచ్చలు మాయం అవుతాయి.

5. పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది:
ముఖంలో ప్యాచ్ స్కిన్ చాలా అసహ్యంగా కనబడుతుంది. పసుపు, పాలు, తేనె మిశ్రమంతో ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల స్కిన్ పిగ్మెంటేషన్ తగ్గుతుంది.

6. చర్మంలో రేడియన్స్ పెరుగుతుంది:
పసుపు, శెనగపిండి, రోజ్ వాటర్ సమంగా తీసుకుని పేస్ట్ చేసి, ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. 20 నిముషాల తర్వాత శుభ్రం చేసుకుంటే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.

7. టోనింగ్ స్కిన్ :
పసుపులో కొద్దిగా పాలు మాత్రమే మిక్స్ చేసి ముఖానికి మెడకు ప్యాక్ వేసుకోవడం వల్ల స్కిన్ టోన్ పెరుగుతుంది. చర్మం తెల్లగా ప్రకాశవంతంగా మెరుస్తుంటుంది. వారానికొకసారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

8. ఫేషియల్ రెడ్ నెస్ తగ్గిస్తుంది:
స్కిన్ సెన్సిటివిటి వల్ల ముఖంలో రెడ్ నెస్ పెరుగుతుంది. ఇటువంటి రెడ్ స్కిన్ నివారించడంలో టర్మరిక్ గ్రేట్ గా సహాయపడుతుంది. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉండటం వల్ల ఇది ఫేషియల్ రెడ్ నెస్ తగ్గిస్తుంది.

9.చర్మంలో ఆయిల్ ను బ్యాలెన్స్ చేస్తుంది:
ముఖంలో ఎక్సెసివ్ ఆయిల్ ను గ్రహిస్తుంది. ముఖంలో జిడ్డును తగ్గిస్తుంది . చర్మంలో ఆయిల్ నెస్ ను బ్యాలెన్స్ చేస్తుంది. పసుపులో వేప, ముల్తానీ మంట్టి పౌడర్, పసుపు మిక్స్ చేసి ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖంలో ఆయిల్ కంట్రోల్ అవుతుంది.

10. రాషెస్ నివారిస్తుంది:
పసుపులో స్కిన్ బెనిఫిట్స్ గొప్పగా ఉన్నాయి. పసుపును పెరుగుతో మిక్స్ చేసి, ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖంలో రాషెస్ తొలగిపోతాయి. పసుపులో కొద్దిగా కొబ్బరి నూనె మిక్స్ చేసి ప్యాక్ వేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. స్కిన్ రాషెస్ తొలగిపోతాయి.

11. క్లియర్ స్కిన్ :
పసుపు, పాలు, శెనగపిండి, గంధం పౌడర్ ను మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. పసుపులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు క్లియర్ స్కిన్ పొందడానికి గ్రేట్ గా సహాయపడుతుంది.

12. సన్ బర్న్ నివారిస్తుంది:
పసుపులో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి, ముఖానికి, మెడకు అప్లై చేస్తే సన్ డ్యామేజ్ , సన్ బర్న్ నివారస్తుంది. సన్ బర్న్ వల్ల నల్లగా మారిన చర్మాన్ని తెల్లగా మార్చుతుంది. స్కిన్ సమస్యలను నివారిస్తుంది.



Click it and Unblock the Notifications