Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
ఎలాంటి చర్మ సమస్యకైనా.. వేప ఒక్కటి చాలు
అందమైన చర్మం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరికి నిర్జీవమైన చర్మం ఇబ్బందిపెడుతుంటే.. మరికొందరు మొటిమలు, మచ్చలతో బాధపడుతుంటారు. కొంతమందికి చాలా జిడ్డు తత్వం కలిగిన చర్మం, ఇంకొంతమందికి చాలా పొడిబారిన చర్మం ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ సమస్య నుంచి బయటపడటానికి చేయని ప్రయత్నమంటూ ఉండదు. కానీ ఫలితం మాత్రం అంతంతమాత్రంగానే ఉంటుంది.
చర్మం సంరక్షణకు న్యాచురల్ రెమిడీస్ ఉపయోగిస్తేనే మంచి ఫలితాలు పొందవచ్చు. ముఖంపై మచ్చలు, మొటిమలు వేధిస్తుంటే.. యాంటీ బయోటిక్ గా పనిచేసే.. వేప ఉపయోగించడం మంచిది. ఇది సహజంగా పనిచేస్తుంది. వేప అనగానే చేదుగా ఉంటుందని చాలా మంది ఇష్టపడరు. కానీ.. చేసే మేలు అంతా ఇంతా కాదు. ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా చాలా పవర్ ఫుల్ గా మనిచేస్తుంది. జుట్టు సంరక్షణలో చక్కగా పనిచేసే వేప.. మొటిమలు, మచ్చలు, బ్లాక్ హెడ్స్ నివారించడంలోనూ.. చక్కగా ఉపయోగపడుతుంది. ఇంతకీ.. వేప చర్మానికి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం..

స్కిన్ టోనర్
కొన్ని వేపాకులు తీసుకుని నీటిలో బాగా మరిగించాలి. నీళ్లు గ్రీన్ కలర్ లోకి మారిన తర్వాత.. ఆ మిశ్రమాన్ని తీసుకుని బాటిల్ లో నిల్వ ఉంచుకోవాలి. రోజూ స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో కొంచెం ఈ మిశ్రమాన్ని కలుపుకోవడం వల్ల చర్మ సమస్యలు, మొటిమలు, వైడ్ హెడ్స్, ముడతలు తగ్గుతాయి. లేదా రాత్రి పడుకునే ముందు ముఖాన్ని ఈ నీటిలో ముంచిన దూదితో తుడుచుకుంటే.. మొటిమలు, మచ్చలు తగ్గుతాయి.

ఫేస్ ప్యాక్
పది వేపాకులు, కొన్ని నారింజ తొక్కలు తీసుకుని నీళ్లు కలిపి మరిగించాలి. పేస్ట్ లా తయారైన తర్వాత తేనె, పెరుగు, సోయా పాటు కలిపి వారానికి మూడుసార్లు ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే.. వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ తగ్గుతాయి.

పొడి చర్మానికి
వేప పొడిలో కొన్ని చుక్కల గ్రేప్ సీడ్ ఆయిల్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి.. 3 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకుంటే.. మంచి ఫలితం ఉంటుంది.

వేప బెరడుతో
వేప బెరడు, వేర్లను ఎండబెట్టి పొడి చేసి.. ఆ పొడిని తలకు పట్టిస్తే.. పేల సమస్య తగ్గిపోతుంది. అలాగే చుండ్రు సమస్య కూడా అదుపులో ఉంటుంది.

వేప నూనె
వేప నూనెను కొన్ని సోప్ లు, షాంపూలు, లోషన్స్, క్రీమ్స్ లలో ఉపయోగిస్తారు. వేపకు చర్మం లోపలి నుంచి క్లీన్ చేసు గుణం ఉంది. కాబట్టి చర్మం కాంతిమంతంగా మారడానికి, జుట్టు మెరిసిపోవడానికి వేప నూనె సహాయపడుతుంది.

పొడవాటి జుట్టుకి
వేప పొడిని తరచూ ఉపయోగించడం వల్ల తలలో ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి. వేప నూనెను తలకు పట్టించడం వల్ల జుట్టు రాలడం తగ్గి.. బలంగా, పొడవుగా పెరుగుతుంది. అలాగే జుట్టు చిట్లిపోకుండా ఉంటుంది.



Click it and Unblock the Notifications
