Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
బ్లాక్ జీలకరలోని బ్యూటీ సీక్రెట్స్
జీలకర్ర ఒక ఉత్తమ ఆరోమాటిక్ మసాల దినుసు. ఈ మసాల దినుసు వంటలను ఫ్లేవర్ ఫుల్ గా మార్చుతుంది . అంతే కాదు మన ఇండియన్ ట్రెడిషన్స్ లో తప్పనిసరిగా ఉపయోగించే ఒక ముఖ్యమైన మసాలా దినుసు. అంతే కాదు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్న ట్రెడిషినల్ మసాల దినుసు . ఆరోగ్యం పరంగా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, వ్యాధినిరోధకతను పెంచుతుంది మరియు యాంటీ క్యాన్సర్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.
ఇంకా జీలకర్రలో విటమిన్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, మినిరల్స్ మరియు ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి .ఇవి ఆరోగ్యానికి మాత్రమే కాదు, అందానికి కూడా గ్రేట్ గా సహాయపడుతాయి. చర్మ, కేశసంరక్షణలో చాలా గ్రేట్ . ఈ జీలకర్ర స్కిన్ స్ట్రక్చర్ ను రీజనరేట్ చేస్తాయి . చర్మాన్ని రేడియంట్ గా మరియు మెరుస్తూ ప్రకాశవంతంగా ఉంచుకోవాలంటే ఈ జీలకర్రను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాల్సిందే.
డైలీ డైట్ లో జీలకర్రను చేర్చడం వల్ల అనేక చర్మ మరియు జుట్టు సమస్యలను నివారించుకోవచ్చు. జీలకర్రతో చేసే పేస్ట్ ను అనేక చర్మ సమస్యలను నివారిస్తుంది. బ్లాక్ కుమ్మిన్ (నల్ల జీలకర్ర)అన్ని రకాల న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి హెయిర్ గ్రోత్ ను చాలా గ్రేట్ గా పెంచుతాయి . జీలకర్రలో ఉండే విటమిన్స్ రాలిపోయిన జుట్టును తిరిగి పెరిగేలా చేస్తుంది మరియు హెల్తీగా పెరగడానికి సహాయపడుతుంది.
మరి బ్లాక్ కుమ్మిన్ సీడ్స్ లో దాగి ఉన్న కొన్ని బ్యూటీ సీక్రెట్స్ ను ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకుందాం...

జుట్టుకు మంచిది :
బ్లాక్ కుమ్మిన్ సీడ్స్ జుట్టు రాలడాన్ని నివారిస్తుంది . దాంతో జుట్టు పల్చగా మారడం, లేదా బట్టతల సమస్య ఉండదు. జీలకరతో తయారుచేసిన నూనె మరియు ఆలివ్ ఆయిల్ ను సమంగా తీసుకొని మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి మసాజ్ చేయాలి. 20 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

షైనీ హెయిర్:
జీలకర్ర నూనె జుట్టు రాలడం అరికట్టడం మాత్రమే కాదు . డ్రై హెయిర్ ను కూడా నివారిస్తుంది. ఇది కండీషనర్ లా పనిచేస్తుంది. జుట్టు కోల్పోయిన కలర్ ను తిరిగి తీసుకొస్తుంది. కుమ్మిన్ ఆయిల్ అన్ని రకాల జుట్టు సమస్యలకు ఒక గ్రేట్ రెమెడీ.

చుండ్రును నివారిస్తుంది:
కుమిన్ నుండి తీసిని ఆయిల్ ను చుండ్రు నివారించడంలో ఒక ఎక్సలెంట్ హోం రెమెడీ . ఈ నూనెను ఆరోమా థెరఫీలో కూడా గ్రేట్ గా ఉపయోగిస్తుంటారు . కుమ్మిన్ ఆయిల్ ను తలకు పట్టించి మసాజ్ చేసి 2 గంటల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

యాంటీఏజింగ్ లా పనిచేస్తుంది:
జీలకర్రలో ఉండే విటమిన్ ఇ చర్మం సాగే గుణాన్ని మరియు ఫైన్ లైన్స్ నివారిస్తుంది. ఇది యాంటీఆక్సిడెంట్స్ మరియు ఫ్రీరాడికల్స్ మీద పనిచేస్తుంది. దాంతో ఏజ్ స్పాట్స్, సాగే చర్మం నివారించబడుతుంది.

మొటిమలను నివారిస్తుంది:
మొటిమలు చర్మం మీద టాక్సిన్స్ పేరుకొన్నాయన్న హెచ్చరిక మొటిమలు . జీలకర్ర పొడిని వెనిగర్ తో మిక్స్ చేసి మొటిమల మీద ప్యాక్ లా వేయాలి.ఇవి ఇతర ఇన్ఫెక్షన్స్ నివారించడంతో పాటు, చర్మాన్ని డిటాక్సిఫై చేస్తుంది. వీటిని రెగ్యులర్ గా తిన్నా కూడా శరీరం శుభ్రపడుతుంది.

స్కిన్ డిజార్డ్స్ ను క్యూర్ చేస్తుంది:
జీలకర్రలో ఉండే విటమిన్ ఇ చర్మం హెల్తాగా మరియు కాంతివంతంగా ఉంచుతుంది. ఇందులో ఉండే యాంటీ ఫంగల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అందుకు గ్రేట్ గా సహాయపడుతాయి . ఈ లక్షణాలు ఫంగల్ మరియు మైక్రోబయల్ ఇన్ఫెక్షన్స్ నుండి రక్షణ కల్పిస్తుంది. జీలకర్రపొడిచేసి, కొద్దిగా పెరుగు లేదా పాలుతోటి పేస్ట్ ను ముఖానికి పట్టించడం వల్ల మొటిమలు , దురద పోరియోసిస్ వంటి లక్షణాలను త్వరగా నివారిస్తుంది.

చర్మ కాంతివంతంగా ఉంటుంది:
చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో జీలకర్ర గ్రేట్ గా సహాయపడుతుంది . జీలకర్ర పొడిలో కొద్దిగా పసుపు వేసి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమంలో తేనె వేసి మిక్స్ చేసి కొద్దిసమయం అలాగే వదిలేసి తర్వాత శుభ్రం చేసుకోవాలి.



Click it and Unblock the Notifications











