Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
బ్లాక్ హెడ్స్ తొలగించే దాల్చిన చెక్క-తేనె ఫేస్ మాస్క్
ముఖంలో బ్లాక్ హెడ్స్ బాధిస్తున్నాయా? ముక్కు మరియు గడ్డ మీద కూడా బ్లాక్ హెడ్స్ ఇబ్బంది పెడుతు ఉన్న అందాన్ని పాడుచేస్తున్నాయా?
ముఖాన్ని అందవిహీనంగా మార్చేవాటిలో బ్లాక్‌హెడ్స్ ముఖ్యమైనవి. సెబాషియస్ అనే గ్రంథి నూనె పదార్థాన్ని(సెబమ్) అధికంగా విడుదల చేయడం వల్ల ఇవి ఏర్పడతాయి.
చర్మానికి రంగునిచ్చే పిగ్మెంట్ ఎక్కువైనా బ్లాక్ హెడ్స్ సమస్య వస్తుంది. వాతావరణంలోని కాలుష్యం, దుమ్ముధూళి, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, హార్మోనుల ప్రభావం కూడా ఇందుకు కారణం అవుతాయి.బ్లాక్ హెడ్స్ సమస్యలు స్త్రీ, పురుషులిద్దరూ ఫేస్ చేస్తున్నారు.

బ్లాక్‌హెడ్స్ ను గిల్లడం వల్ల చర్మంపై ఉన్న బ్యాక్టీరియా చర్మంలోపలికి చొచ్చుకుపోయి మరింత హాని చేస్తుంది. ఇన్ఫెక్షన్స్ కు గురిచేస్తుంది. చర్మంలోపల ఇతర ప్రమాదకర చర్మ సమస్యలకు గురిచేస్తుంది.
బ్లాక్ హెడ్స్ కు కారణమేదైనా , వీటిని నివారించుకోవడమే మన పని. బ్లాక్ హెడ్స్ ను వెంటనే తగ్గించుకోకపోతే ముఖంలో మచ్చలను ఏర్పడేలా చేస్తాయి. బ్లాక్ హెడ్స్ ను నివారించుకోవడానికి ఇంట్లో అందుబాటులో ఉండేవాటితో బ్లాక్‌హెడ్స్ ను నివారించవచ్చు.
బ్లాక్ హెడ్స్ ను తొలగించే హోం రెమెడీస్ లో తేనె మరియు దాల్చిన చెక్క చాలా గ్రేట్ గా సహాయపడుతాయి. ఈ రెండు నేచురల్ పదార్థాల్లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి ఈ రెండిటి కాంబినేసన్ చర్మంలోపల నుండి బ్లాక్ హెడ్స్ ను ఎఫెక్టివ్ గా తొలగిస్తాయి. మరియు చర్మరంద్రాలను తెరచుకొనేలా చేస్తాయి.
బ్లాక్ హెడ్స్ ను నివారించే ఈ హోం రెమెడీని ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలో ...ఏవిధంగా ఉపయోగించాలో తెలుసుకుందాం ...

కావల్సిన పదార్థాలు:
1టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పౌడర్
3 టేబుల్ స్పూన్ల తేనె
1 కాటన్ స్ట్రిప్
ఉపయోగించే పద్దతి:
దాల్చిన చెక్కను ను చాలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. దీన్నికి తేనె చేర్చి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేయాలి. బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రదేశంలో కొద్దిగా ఎక్కువ అప్లై చేయాలి. ముక్కు, గడ్డ వంటి ప్రదేశాల్లో కొద్దిగా ఎక్కువగా అప్లై చేయాలి.
అప్లై చేసిన తర్వాత క్లీన్ కాటన్ తో మాస్క్ మీద సున్నితంగా ప్రెస్ చేయాలి. ఈ మాస్క్ ను 10-15నిముషాలు అలాగే వదిలేసి తర్వాత మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా బ్లాక్ హెడ్స్ తొలగిపోయే వరకూ చేస్తుంటే మీరు ఊహించన మార్పును మీ ముఖంలో మీరు గమనిస్తారు.



Click it and Unblock the Notifications
