Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
అరటిపండుతో అరనిమిషంలో అందమైన చర్మం
అరటిపండు తినడానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. అలాగే ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది. అందుబాటు ధరలోనూ ఉంటుంది. అరటిపండులోని పోషక విలువలు కూడా అమోఘమైనవే. వీటిని తినడం వల్ల అన్ని వయసుల వాళ్లకు అనేక రకాల అనారోగ్య సమస్యలు నివారించవచ్చు.
అయితే అరటిపండు ఆరోగ్యానికే కాదు.. అందమైన చర్మానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో పోషకాలు ఎక్కువ. ఈజీగా ఇంట్లో తయారు చేసుకునే అరటిపండు ఫేస్‌ప్యాక్స్.. ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఇస్తాయి. అరటిపండు ప్యాక్స్ తో.. ముఖం, మెడ నలుపుదనం పోయి.. నిగారింపు పొందవచ్చు. బనానా ఫేస్ట్ ప్యాక్స్ ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం..

బ్యూటిఫుల్ చర్మానికి అరటిపండు ప్యాక్స్
అరటిపండు గుజ్జును ముఖం, మెడకు అప్లై చేయాలి. అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం మెరిసిపోతుంది.

బ్యూటిఫుల్ చర్మానికి అరటిపండు ప్యాక్స్
సగం అరటిపండును, సగం అవకాడోను కలిపి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఇరవై నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

బ్యూటిఫుల్ చర్మానికి అరటిపండు ప్యాక్స్
సగం అరటిపండు పేస్ట్ కు, టేబుల్‌స్పూన్ తేనె మిక్స్ చేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుంటే మచ్చలు తగ్గిపోతాయి.

బ్యూటిఫుల్ చర్మానికి అరటిపండు ప్యాక్స్
తేనె, నిమ్మరసంను ఒక్కొక్కటి టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఇందులో సగం అరటిపండు కలపాలి. బాగా మిక్స్ చేసి.. ముఖానికి పట్టిస్తే చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.

బ్యూటిఫుల్ చర్మానికి అరటిపండు ప్యాక్స్
సగం అరటిపండుకు తేనె, పెరుగు ఒక్కో టేబుల్‌స్పూన్ కలుపుకుని మిశ్రమం తయారు చేసుకోవాలి. ఈ ప్యాక్ ని ముఖానికి అప్లై చేస్తే క్షణాల్లో గ్లోయింగ్ స్కిన్ మీ సొంతమవుతుంది.

బ్యూటిఫుల్ చర్మానికి అరటిపండు ప్యాక్స్
ముఖచర్మంపై మృతకణాల్ని పోగొట్టాలంటే అరటిపండు, టేబుల్‌స్పూన్ తేనె, కోడిగుడ్డు పచ్చసొన కలిపి ప్యాక్‌లా వేసుకోవాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి.



Click it and Unblock the Notifications