Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఆయిలీ స్కిన్ ఇబ్బందిపెడుతోందా ? డోంట్ వర్రీ..
ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ల బాధలు వర్ణించలేం. క్రీముల రాసిన వెంటనే జిడ్డుకారడం, ముఖం కడిగిన మూడు నిమిషాల జిడ్డు తేలడం, బయటకు వెళ్లిన రెండు నిమిషాలకే జిడ్డు కనిపించడం వంటి సమస్యలు వేధిస్తుంటాయి. జిడ్డు చర్మానికి స్వస్తి చెప్పడానికి రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఏం చేసినా.. తాత్కాలికంగా ఫలితాలు కనిపించినా.. మళ్లీ షరామామూలే అవుతుంది. ఇలాంటి సమస్య మిమ్మల్ని కూడా ఇబ్బందిపెడుతోందా ? ఐతే డోంట్ వర్రీ.. పార్లర్ కి, క్రీములకు డబ్బు ఖర్చుపెట్టకుండా.. కాస్త ఓపిక తెచ్చుకుంటే చాలు. ఆయిల్ ఫ్రీ స్కిన్ మీ సొంతం చేసుకోవచ్చు.
పురుషుల్లో ఆయిల్ స్కిన్ నివారించే హోం మేడ్ ఫేస్ ప్యాక్స్

ఇంట్లో నిత్యం వాడే పాలు, పసుపులతో.. జిడ్డు వదించుకోవడం ఈజీనే. కాచిన పాలలో క్లెన్సింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి కొద్దిగా పాలు తీసుకుని కొంచెం పసుపు కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే.. తేడా మీకే కనిపిస్తుంది. అలాగే పింపుల్స్ వల్ల కూడా జిడ్డుగా ఉంటుంది. కాబట్టి ఈ ప్యాక్ మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను వదిలిస్తుంది.

పూర్వం నుంచి గంధం సౌందర్యసాధనాల్లో మంచి స్థానాన్ని సంపాదించుకుంది. ఇది చర్మాన్ని స్మూత్ గానే కాదు, మొటిమలు, మచ్చలు తొలగించడంలోనూ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. చేయాల్సిందల్లా ఒక్కటే.. కాస్త గంధం పొడి తీసుకుని రోజ్ వాటర్ కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల మీ ముఖంపై పేరుకున్న ఆయిల్ ని తొలగించి ఫ్రెష్ లుక్ తీసుకొస్తుంది.
స్కిన్ అలర్జీ లేదా చర్మం దురదను నివారించే హోం రెమెడీస్

తేనె కూడా జిడ్డు తొలగించడంలో సహజంగా సహాయపడుతుంది. ముల్తానీ మట్టి, తేనె, కొద్దిగా రోజ్ వాటర్ కలిపి.. ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. ఆరిన తర్వాత కడిగేసుకుంటే.. చర్మం తాజాగా కనిపిస్తుంది. ముల్తానీ మట్టి చర్మంపై ఉండే ఆయిల్ ని పీల్చుకుంటుంది. దీన్ని రెగ్యులర్ గా వేసుకోవడం వల్ల క్రమక్రమంగా ఆయిలీ స్కిన్ నుంచి బయటపడవచ్చు.



Click it and Unblock the Notifications