Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
చర్మ సంరక్షణకు పవర్ ఫుల్ లావెండర్ థైమ్ ఆయిల్స్
ఆరోగ్యం, అందం విషయంలో కొన్ని శతాబ్దాల కాలం నుండి భారతదేశంలో మూలికలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మూలికలు చాలా ఎఫెక్టివ్ గా మరియు సురక్షితంగా పనిచేస్తాయి. ఈ మూలికలు, చర్మ, జుట్టు సమస్యలను తగ్గించడంతో పాటు, ఒత్తిడి నుండి ఉపశమనం కలిగిస్తాయి
కొన్ని మూలికలు ఆరోమా వాసన కలిగి ఉంటాయి. వీటిని స్నానం చేయడానికి లేదా ఆరోమా థెరఫీలలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.
చర్మ సమస్యలను నివారించుకోవడం కోసం పసుపు మరియు కాలెండుల అనే రెండు మూలికలను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. టర్మరిక్ మరియు కాలెండుల రెండింటి కాంబినేషన్లో ఇంట్లోనే మీరు స్వయంగా ఫేస్ మాస్క్, స్కిన్ లోషన్ మరియు క్రీమ్స్ ను తయారుచేసుకోవచ్చు.
ఇంకా పసుపును చర్మం మీద ఉండే నల్ల మచ్చలను తొలగించడాని ఉపయోగిస్తుంటారు. కాలెండులా, మొటిమలను నివారణకు, వాటితో వచ్చే మచ్చలను నివారించడానికి , గాయాలను మాన్పుకోవడానికి నేచురల్ గా ఉపయోగిస్తుంటారు.

క్యాలెండులా లో యాంటీ సెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . స్కిన్ ఇన్ఫెక్షన్స్ తొలగించడానికి దీంతో ఇంట్లోనే ముఖానికి లేపనాన్ని తయారుచేసుకోవచ్చు. వీటికి ఇరత పదార్థాలను జోడించడం వల్ల మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. నూనెలు, పసుపు, క్యాలెండుల కాంబినేషన్ లో తయారుచేసే లేపనం అందం మెరుగుపరుచుకోవడంలో పవర్ ఫుల్ రెమెడీ
ఆపిల్ సైడర్ వెనిగర్ ఇది హెర్బ్ కాకపోయినా, జుట్టును నల్లగా నిగనిగలాడేలా చేయడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అదే విధంగా ఆపిల్ వెనిగర్ మరియు హాట్ వైట్ టీ చర్మంలో జిడ్డు, మొటిమలు, మచ్చలు నివారించడానికి సహాయపడుతాయి.
ఈ రెండు మూలికలు అందరికి బాగా తెలిసినవే అయాని వీటిని ఉపయోగించడం చాలా అరుదు.
ల్యావెండర్ మరియు థైమ్ వంటి మూలికల్లో కూడా సహజ శక్తి సార్థ్యాలు కలిగి ఉన్నాయి . చర్మ సమస్యలను నివారించడంలో చాలా గొప్పగా పనిచేస్తాయి. చర్మానికి ప్రకాశించే గుణాలను అందిస్తాయి .

ల్యావెండర్ : ల్యావెండర్ ఆయిల్ మంచి సువాసన కలిగి ఉంటుంది. దీని గురించి మనందరిక తెలుసు మరియు మనందరికి ఇష్టమైనది .! చర్మకణాల మీద లావెండర్ ఆయిల్ చాలా ప్రభావితంగా పనిచేసి , చర్మాన్ని మరింత ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది.
లావెండర్ ఆయిల్ ను నేరుగా ఒక్కదాన్నే ఉపయోగించుకోవచ్చు లేదా ఇతర పదార్థాలు జోడించి ఉపయోగించుకోవచ్చు. లావెండర్ ఆయిల్ ను చర్మానికి ఉపయోగించడం వల్ల ఇది ముఖంలో ముడుతలను నివారించి, నయం చేసే గుణాలను మెరుగుపరుస్తుంది . మరియు మొటిలను రాకుండా పోరాడుతుంది. లావెండర్, కోకనట్ ఆయిల్ మరియు సాల్ట్ తో స్క్రబ్ తయారుచేసుకోవచ్చు.

కావల్సినవి
కొబ్బరి నూనె 1 టేబుల్ స్పూన్
ఎస్సమ్ సాల్ట్ 1/2 కప్పు
లావెండర్ ఆయిల్ 10 చుక్కలు
తయారీ
పైన సూచించన పదార్థాలన్నింటిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసి బాగా మిక్స్ చేసి, మూత గట్టిగా ఉండే డబ్బాలో వేసి నిల్వ చేసుకోవాలి.
అవసరమైనప్పుడు ఉపయోగించుకోవాలి.

థైమ్: మధ్యయుగనాటి కాలంలో థైమ్ బాగా ప్రసిద్ది చెందిన మూలిక. ఇది మొటిమలను నివారిచండంలో గొప్పగా పనిచేస్తుంది . థైమ్ ఆయిల్ ను స్త్రీ, పురుషులిద్దరిలోనూ జుట్టు రాలడం నివారించడం కోసం ఉపయోగించుకోవచ్చు . అలాగే చండ్రు , ఇతర జుట్టు సమస్యల నివారణకు కూడా దీన్ని ఉపయోగించవచ్చు
థైమ్ ఆయిల్ ను నేరుగా తలకు పట్టించి మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల నిధానంగా జుట్టు రాలడం నివారించబడుతుంది . అలాగే థైమ్ ఆయిల్ మొటిమలను నివారించడానికి కూడా పనిచేస్తుంది.
కావల్సినవి
బేకింగ్ సోడా 2 టీస్పూన్లు
థైమ్ ఆయిల్ 2 చుక్కలు
జోజోబా ఆయిల్ 1 టీస్పూన్
దానిమ్మ నూనె 3 చుక్కలు
తయారీ:
ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో థైమ్ ఆయిల్ , జోజోబా ఆయిల్, దానిమ్మ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి.
అందులోనే బేకింగ్ సోడా వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి. దీన్ని ఒక చల్లటి వాతావరణంలో నిల్వచేయాలి . అవసరమయినప్పుడు ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతంలో లేపనంగా రాసుకోవాలి. ముఖం మొత్తం రాసుకోకూడదు .
సున్నిత చర్మ తత్వం ఉన్నవారు దీన్ని వేసుకోకూడుదు. వీరికి బేకింగ్ సోడా చర్మానికి హాని కలిగిస్తుంది.



Click it and Unblock the Notifications
