For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లూజ్ స్కిన్ మరియు ముడుతలను మాయం చేసే హోం మేడ్ యాంటీఏజింగ్ క్రీమ్స్ ...

|

ఏజింగ్ ప్రొసెస్ (వయస్సు పెరగడం)అనేది ఒక నేచురల్ ప్రొసెస్. అదే విధంగా కొన్ని సందర్భాల్లో ముఖంలోనే వయస్సు మీదపడుతున్న లక్షణాలు చాలా త్వరగా...చిన్న వయస్సులోనే కనడుతుంటాయి. అందుకు ముఖ్య కారణం ముఖం డల్ గా, ముడుతలతో కనబడుట ప్రారంభం అవుతుంది కళ్ళ క్రింది మరియు మూతి వద్ద సన్నని లైన్స్ కనబడుతుంటాయి.

కొన్ని సందర్భాల్లో డ్రై స్కిన్ వల్ల, ఎండలో ఎక్కువ తిరగడం, ఎక్కువ సమయం గడపడ వల్ల కూడా ఏజింగ్ లక్షణాలు కనబడుటకు కారణమవుతుంది. శరీరం హైడ్రేషన్ పొందలేనప్పుడు, శరీరం స్ట్రెస్ కు కారణం అవుతుంది. దాంతో డ్రై స్కిన్ ఏజింగ్ లక్షణాలు కనబడుట ప్రారంభం అవుతుంది.

వృద్ధాప్యం ఎదుర్కొనే టాప్ 10 యాంటీ ఏజింగ్ డైట్ టిప్స్

చర్మంలోని నేచురల్ ఎలాసిటి తగ్గినప్పుడు వెంటనే ముఖం సాగినట్లు, మరియు ముడుతలతో కనబడుతుంది. ముడుతలతో పాటు, చర్మం నేచురల్ గ్లోను కూడా తగ్గించి చర్మం చూడటానికి డల్ గా కనబడుతుంది.

జిడ్డు చర్మమా.. యవ్వనంగా కనబడాలా?ఐతే చిట్కాలు మీకోసమే..!

హోం మేడ్ స్కిన్ క్రీమ్ లు చర్మంలోపల నుండి శోషింపబడుతుంది . ఈక్రీమ్స్ చర్మానికి పోషణను అందిస్తుంది మరియు స్కిన్ ఎలాసిటిని పెంచుతుంది. ఇలాంటి హోం మేడ్ క్రీమ్ లు 20 రోజుల్లోనే మంచి ఫలితాన్ని చూపెడుతుంది . ముడుతలు, సాగే చర్మం నివారించడానికి హోం మేడ్ క్రీమ్స్ ను సులభంగా ఎలా తయారుచేయాలో ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకుందాం...

యాంటీ ఏజింగ్ క్రీమ్ కోసం కావల్సిన పదార్థాలు:

యాంటీ ఏజింగ్ క్రీమ్ కోసం కావల్సిన పదార్థాలు:

1tbsp షీ బట్టర్, 1 tbsp జోజోబ ఆయిల్, 1/4బాదం ఆయిల్ , 2tbsp కోకోనట్ ఆయిల్ , 2tbsp బీవాక్స్ , tsp సాండిల్ వుడ్ ఆయిల్ తీసుకోవాలి.

తయారుచేయు విధానం:

తయారుచేయు విధానం:

బీ వ్యాక్స్ ను స్టౌ మీద పెట్టి వేడి చేసుకోవాలి. , తర్వాత అందులో షీ బట్టర్, కోకనట్ ఆయిల్ మరియు బాదం ఆయిల్ వేసి తక్కువ మంట మీద 5 నిముషాలు హీట్ చేసుకోవాలి . ఇలా హీట్ చేయడం వల్ల బీవాక్స్ కరుగుతుంది . తర్వాత ఇందులో జోజోభ ఆయిల్ మరియు సాండిల్ ఉడ్ ఆయిల్ వేసి మొత్తం ను మిక్స్ చేయాలి . చల్లారిన తర్వాత ఈ క్రీమ్ ను ఒక గ్లాస్ జార్లోకి మార్చుకొని నిల్వచేసుకోవాలి. క్రీమ్ కొద్దిగా హార్డ్ గా తయారైన తర్వాత ప్రతి రోజూ ఉదయం మరియు ముఖానికి , చేతులకు అప్లై చేసుకోవాలి.

 కీరదోసకాయ, అలోవెర కోల్డ్ క్రీమ్:

కీరదోసకాయ, అలోవెర కోల్డ్ క్రీమ్:

1/4కప్పు కీరదోసకాయ, 1tbsp షీబట్టర్, 2tbsp కోకోనట్ ఆయిల్, 1/2పెరుగు, 1/2నిమ్మరసం

తయారుచేయు విధానం:

తయారుచేయు విధానం:

కొబ్బరి నూనె మరియు షీబట్టర్ ను తక్కువ మంటలో కరిగించి , బ్లెండర్లో వేసి చిక్కటి పేస్ట్ లా చేసుకోవాలి. తర్వాత కీరదోస రసాన్ని వడగట్టుకొని, దీన్ని పెరుగు మరియు కోకనట్ ఆయిల్ కు జోడించాలి . ఇప్పుడు కొబ్బరి నూనె మరియు షీ బట్టర్ ను కీరదోస, మరియు అలోవెరా జెల్లో మిక్స్ చేయాలి. మొత్తి మిశ్రమాన్ని కలగలుపుకొని, క్రీమ్ చిక్కబడే వరకూ రిఫ్రిజరేటర్లో నిల్వచేసుకోవాలి.

ముడుతను నివారించే అవొకాడో క్రీమ్:

ముడుతను నివారించే అవొకాడో క్రీమ్:

1/2 బాగా పండిన అవొకాడో 1tbsp బీవాక్స్ 1tbsp ఆలివ్ ఆయిల్ 1tbsp వీట్ గ్రాస్ జ్యూస్

తయారుచేయువిధానం:

తయారుచేయువిధానం:

బీవాక్స్ ను తక్కువ మంట లో కరిగించాలి. తర్వాత అందులో అవొకాడో పేస్ట్, మరియు ఇతర పదార్థాలన్నింటి వేసి మిక్స్చేయాలి. మొత్తం స్మూత్ గా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. . ఈ క్రీమ్ ను నిద్రించడానికి ముందు ముఖానికి అప్లై చేసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.

చిట్కాలు:

చిట్కాలు:

ఈ హోం మేడ్ క్రీమ్స్ అప్లై చేసేటప్పుడు ఫింగర్ టిప్స్ తో మసాజ్ చేయాలి . అలాగే మసాజ్ చేసే సమయంలో ఈ క్రీమ్స్ లో కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేయడం వల్ల స్కిన్ కు మంచి గ్లో వస్తుంది. కెమికల్స్ క్రీమ్స్ కు బదులుగా ఈ హోం మేడ్ క్రీమ్స్ ను అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కేవలం 20 డేస్ లో మీ స్కిన్ యంగ్ అండ్ గ్లో గా కనబడుతుంది.

English summary

Homemade Anti Ageing Cream To Treat Loose Skin And Wrinkles

Ageing is a natural process; however, sometimes, our face can show up some of the ageing signs very early in life. The skin of the face gets dull, wrinkles start to appear along with fine lines under the eyes and mouth.
Story first published: Tuesday, February 2, 2016, 12:14 [IST]
Desktop Bottom Promotion