ముఖంలో మార్క్స్, మచ్చలు, మాయం చేసే హోం మేడ్ క్రీమ్స్

స్కిన్ ఎంత హెల్తీగా ఉన్నా ...మొటిమలు, మచ్చలు, బర్న్, కట్స్ లేద చిన్న చిన్న గాయల వల్ల చర్మం మీద ఏర్పడే ముఖ్యంగా ఫేస్ స్కిన్ లో ఏర్పడే మార్క్స్, స్కార్స్ చర్మం యొక్క బ్యూటీని పాడుచేస్తుంది .

చర్మ సంరక్షణలో, చర్మ మీద ఏర్పడ్డ మచ్చలు, గాయాల మార్క్స్, లేదా స్కార్స్ తొలగించడం చాలా కష్టం. ఎందుకంటే ఇది చర్మం మీద ఏర్పడ్డ స్కార్స్ నయం అవ్వడానికి కొన్ని రోజులు పడుతుంది. అదేవిధంగా స్కార్ మార్క్ ను వంటింటి చిట్కాలతో గ్రేట్ గా మాయం చేసుకోవచ్చు . ఇంట్లోనే కొన్ని హోం మేడ్ క్రీమ్స్ ను తయారుచేసుకోవచ్చు.

మార్కెట్లో లభించే వివిధ రకాల క్రీములు, ట్రీట్మెంట్స్ తో ఎలాంటి ప్రయోజనం ఉండదు. మరియు స్కిన్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ,నేచురల్ హోం మేడ్ క్రీమ్స్ చాలా గ్రేట్ గా సహాయపడుతాయి. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మరియు ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. కొన్ని హోం మేడ్ క్రీమ్స్ ను ఈ క్రిందిలిస్ట్ లో అందివ్వడం జరిగింది. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, మరియు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయ.

అంతే కాదు, ఈ హోం మేడ్ క్రీమ్స్ స్కిన్ మాయిశ్చరైజర్ గా పనిచేయడంతో పాటు చర్మానికి పోషణను అందిస్తుంది . చర్మంలో రేడియంట్ గ్లోను తీసుకొస్తుంది . మరి చర్మంలో ఏలాంటి స్కార్స్ అయినా, మచ్చలనైనా 2వారాల్లో మాయం చేసే హోం మేడ్ క్రీమ్స్ ఏంటో ఒకసారి చూద్దాం...

1.హోం మేడ్ క్రీమ్ 1:

1.హోం మేడ్ క్రీమ్ 1:

అరకప్పు సీబట్టర్, 3 విటమిన్ ఇ సాఫ్ట్ క్యాప్య్యూల్స్ మరియు 2చెంచాలా ఫ్రెష్ లెమన్ జ్యూస్ మిక్స్ చేయాలి. షీబట్టర్ ను లైట్ గా వేడి చేసి అందులో నిమ్మరసం, ఇతర పదార్థాలను మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని గాజుబాటిల్లో నిల్వచేసుకొని రోజుకు రెండు సార్లు ప్రయత్నిస్తే మంచి ఫలితం ఉంటుంది.

2.హోం మేడ్ క్రీమ్ 2:

2.హోం మేడ్ క్రీమ్ 2:

1చెంచా తేనె, 2చెంచా ఆలివ్ ఆయిల్ 4 చుక్కల ల్యావెండర్ ఆయిల్ మరియు 1/4కప్పు కోకబట్టర్ మిక్స్ తీసుకోవాలి. కోకబట్టర్ ను కరిగించి అందులో ఆలివ్ ఆయిల్, తేనె మరియు లావెండర్ ఆయిల్ వేసి మిక్స్ చేయాలి. బాగా చల్లారిన తర్వాత గ్లాస్ బాటిల్లో నిల్వచేసుకొని ముఖం మీద ఏర్పడ్డ స్కార్స్ మీద రాత్రిళ్ళు మరియు ఉదయం అప్లై చేసుకోవాలి.

3.హోం మేడ్ క్రీమ్ 3:

3.హోం మేడ్ క్రీమ్ 3:

నిమ్మరం 1చెంచా, ఎగ్ వైట్ 1చెంచా, తేనె 1 చెంచా. ఈ మూడింటిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసి మిక్స్ చేయాలి . ఈ మిశ్రమాన్ని స్కార్స్ మీద అప్లై చేయాలి . సున్నితంగా మసాజ్ చేసి 15 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

4.హోం మేడ్ క్రీమ్ 4:

4.హోం మేడ్ క్రీమ్ 4:

కీరదోసజ్యూస్ 3చెంచాలు, 10 చుక్కల ల్యావెండర్ ఆయిల్, 4 చెంచాల కొబ్బరి నూనె, 2 చెంచాలా బీవాక్స్ తీసుకోవాలి. బీవాక్స్ ను సన్నని మంట మీద కరిగించి అందులో కీరదోస జ్యూస్, లావెండర్ ఆయిల్ మరియు కొబ్బరి నూనె వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని స్కార్స్ మీద అప్లై చేసి మసాజ్ చేయాలి.

5.హోం మేడ్ క్రీమ్ 5:

5.హోం మేడ్ క్రీమ్ 5:

1చెంచా ఆపిల్ సైడర్ వెనిగర్, 1 చెంచాకోకబట్టర్, 2 చెంచాల బేకింగ్ సోడ, 2 చెంచాల కాడ్ లివర్ ఆయిల్ మరియు 2చెంచాలా గార్లిక్ ఆయిల్ తీసుకోవాలి. కోకబట్టర్ ను కరిగించి అందులో మిగిలిన పదార్థాలన్నింటిని చేర్చి మిక్స్ చేసి, నిల్వచేసుకోవాలి. ఈ క్రీమ్ ను రోజుకు రెండు సార్లు అప్లై చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

6.హోం మేడ్ క్రీమ్ 6:

6.హోం మేడ్ క్రీమ్ 6:

2ఆస్పిరిన్ మాత్రలు పొడి చేసుకోవాలి, విటమిన్ ఇ ఆయిల్ (క్యాప్య్యూల్ నుండి వేరుచేసుకోవాలి), కోకాబట్టర్ 1చెంచా, 2 చెంచాల ఆలివ్ ఆయిల్ తీసుకోవాలి. కోకబట్టర్ ను కరిగించి అందులో ఇతర పదార్థాలన్నీ వేసి మిక్స్ చేసి స్కార్స్ మీద అప్లై చేయాలి. మసాజ్ చేసి 15 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

7.హోం మేడ్ క్రీమ్ 7:

7.హోం మేడ్ క్రీమ్ 7:

1చెంచా చమోమెలీ టీ, 1 చెంచా పెరుగు, 2 చెంచాలా బీవాక్స్, 1 చెంచా టీట్రీ ఆయిల్ మరియు 1చెంచా ఆలివ్ ఆయిల్ తీసుకోవాలి. బీవాక్స్ ను కరిగించి అందులో మిగిలిన పదార్థాలన్నింటి వేసి మిక్స్ చేయాలి. దీన్ని ఫేస్ మాస్క్ గా అప్లై చేసి మసాజ్ చేసి శుభ్రం చేసుకోవాలి.

Story first published: Thursday, January 7, 2016, 11:51 [IST]
Desktop Bottom Promotion