పురుషుల్లో ఆయిల్ స్కిన్ నివారించే హోం మేడ్ ఫేస్ ప్యాక్స్

యవ్వనంలో ఉండే చాలా మంది స్త్రీ, పురుషులు ఆయిల్ స్కిన్ తో బాధపడుతుంటారు.ఎక్కువగా, చర్మం క్రింద ఉండే తైల గ్రంథులు టీనేజ్ వయస్సులో ఉండే వారిలో చాలా ఎక్కువగా ఉండి మొటిమలు మరియు బ్లాక్ హెడ్స్ సమస్యలకు దారితీస్తుంది. ఇది వయ్వనంలో ఉండే
వారిలో సాధారణంగాకనిపించే ఒక సహజ సమస్య.

ముక్కు ఆయిలీగా, జిడ్డుగా కనబడుతుంటే వీటిని అప్లై చేయండి...

అందుకోసం వివిధ రకాల మాయిశ్చరైజర్స్ మరియు వివిధ రకాల క్రీములు ఉపయోగిస్తున్నారు. అయినా కూడా ఎలాంటి ఫలితం ఉండదు . కొన్ని సందర్భాల్లో చర్మ సంరక్షణ, ఆయిల్ స్కిన్ నివారణ కోసం స్పెషల్ ఫేషియల్స్ చేసుకోవడం మరియు స్పాలకు వెల్లి ట్రీట్మెంట్స్ తీసుకుంటుంటారు. ఇవి అనుకున్నంత ఫలితం ఇవ్వకపోవగా తాత్కలిక ఫలితాలను మాత్రమే అందిస్తాయి .

ఇండియన్ ఛర్మ ఛాయను ఫెయిర్ గా మార్చే నేచురల్ ఫేస్ ప్యాక్స్

ముఖ్యంగా పురుషులు వారి చర్మ సంరక్షణ గురించి తగిన జాగ్రత్తలు తీసుకోరు. అయితే కొద్దిగా శ్రద్ద పెడితే మాత్రం ఆయిల్ స్కిన్ నివారించుకోవడంతో పాటు కాంతివంతమైన చర్మాన్ని పొందుతారు. క్లియర్ గా, ఆయిల్ ఫ్రీ స్కిన్ పొందడానికి హోం మేడ్ ఫేస్ మాస్క్ రిసిపిలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. మరి ఈసింపుల్ ఫేస్ మాస్క్ రిసిపిలను ఎలా ఉపయోగించాలో చూద్దాం...

కీరదోసకాయ:

కీరదోసకాయ:

కీరదోసకాయ బెస్ట్ హోం రెమెడీ. ఇది డెడ్ స్కిన్ సెల్స్ తొలగిస్తుంది మరియు చర్మం నిర్జీవంగా కనబడేలా చేస్తుంది . ఈ వెజిటేబుల్ చర్మాన్ని మాయిశ్చరైజింగ్ గా ఉంచుతుంది . కీరదోస మరియు పెరుగు లేదా తేనెను మిక్స్ చేసి ఈ మూడింటి మిశ్రమాన్ని ముఖం మరియు మెడకు అప్లై చేసి 15నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. చల్లటి నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల ఆయిల్ స్కిన్ నివారించబడుతుంది . ఈ ఫేస్ ప్యాక్ ను వారంలో రెండు సార్లు అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

హనీ మాస్క్:

హనీ మాస్క్:

తేనె మరియు పెరుగు, గుడ్డు లేదా ఆపిల్ పేస్ట్ మిక్స్ చేయాలి . తేనె ఒక నేచురల్ యాంటీఆక్సిడెంట్స్ ఇది చర్మాన్ని శుభ్రపరుస్తుంది మరియు చర్మంలోని అదనపు సెబమ్ ను నిరోధిస్తుంది. తెరచుకొన్న చర్మ రంద్రాలను మూసుకొనేలా చేస్తుంది . ఆపిల్ పేస్ట్ కు కొన్ని చుక్కల తేనె మిక్స్ చేసి ముఖానికి పట్టించి 20నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

బాగా పండిన టమోటో:

బాగా పండిన టమోటో:

టమోటో నేచురల్ స్కిన్ టోనర్. దీన్ని సింపుల్ హోం మేడ్ ఫేస్ మాస్క్ గా ఉపయోగించుకోవచ్చు. ఇది ఆయిల్ స్కిన్ నివారించడంలో చాలా గ్రేట్ గా సహాయపడుతుంది . టమోటోను మెత్తగా మ్యాష్ చేసి తర్వాత ముఖానికి పట్టించాలి. బాగా పండిన టమోటోను పాలతో మిక్స్ చేసి ఫేస్ కు ప్యాక్ లా వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆయిల్ స్కిన్ నివారించడబడుతుంది.

వేప :

వేప :

ఆయిల్ స్కిన్ నివారించడంలో ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది . ఇది చర్మ రంద్రాలను తెరచుకొనేలా చేస్తుంది. తర్వాత చర్మ రంధ్రాలను శుభ్రం చేస్తుంది. మొటిమలు మరియు మచ్చలను నివారిస్తుంది. వేపాకులను గోరువెచ్చని నీటితో రాత్రంతా నానబెట్టాలి . తర్వాత రోజు ఉదయం వేపాకులను మెత్తగా పేస్ట్ చేయాలి . తర్వాత అందులో కొద్దిగా పాలు పోసి మిక్స్ చేసి మెడకు మరియు ముఖానికి పట్టించాలి. 20 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి . ఇది ఒక సింపుల్ హోం మేడ్ ఫేస్ మాస్క్.

పుదీనా :

పుదీనా :

పుదీనా చాలా వండర్ ఫుల్ గా వర్కౌతుంది . ఇది ఒక గొప్ప ఆస్ట్రిజెంట్ గా పనిచేస్తుంది. మరియు చర్మంలోని డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. పుదీనా ఆకులను హాట్ వాటర్లో మిక్స్ చేసి , ఈ నీటిని చల్లారనివ్వాలి. తర్వాత ఈ నీటిని ఉపయోగించి అప్పుడప్పుడు ముఖం శుభ్రం చేసుకుంటుండాలి.

అలోవెర:

అలోవెర:

కలబంద ఇది మాయిశ్చరైజర్ గా మాత్రమే కాదు, స్కిన్ స్మూతినెంగ్ ఏజెంట్ గా పనిస్తుంది. ఇది చర్మానికి గ్రేట్ టోనర్. కొద్దిగా అలోవెరా జ్యూస్ ను తీసి నేరులా ముఖానికి అప్లై చేసి కొద్దిసేపటి తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇది చాలా సున్నితమైన స్వభావం కలిగి ఉంటుంది . కాబట్టి చాలా ఎఫెక్టివ్ గా సన్ బర్న్, రాషెష్ ను నివారిస్తుంది.

నిమ్మరసం, పుదీన :

నిమ్మరసం, పుదీన :

ఒక చెంచా నిమ్మరసం, ఒక మింట్ టీ బ్యాగ్, రెండు చెంచాల హాజల్ తీసుకొని వేడి నీళ్ళలో వేసి మిక్స్ చేసి ఉడికించాలి. మొదట టీ బ్యాగ్ ను వేడి నీళ్ళలో వేసి కొద్దిసేపు బాయిల్ చేయాలి . టీబ్యాగ్ ను తొలగించి తర్వాత నిమ్మరసం మరియు హాజల్ ను మిక్స్ చేసి నీటిని మరిగించాలి . మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేసి తర్వాత చల్లార్చి అందులో కాటన్ బాల్ డిప్ చేసి ముఖం మరియు మెడను శుభ్రం చేసుకోవాలి.

తులసి టోనర్:

తులసి టోనర్:

తులసి ఆకులను మెత్తగా చేసి, పేస్ట్ ను అరకప్పు వేడి నీటిలో వేసి, బాగా మిక్స్ చేసి ఫిల్టర్ చేసుకోవాలి. ఈ నీటికి ఒక చెంచా అలోవెర జెల్ మిక్స్ చేయాలి . తర్వాత ఈ నీటిని ముఖానికి పట్టించవచ్చు లేదా నేరుగా త్రాగవచ్చు. ఈ నేచురల్ హోం మేడ్ టోనర్ మొటిమలును మరియు మచ్చలను నివారిస్తుంది.

పెరుగు

పెరుగు

పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంది. ఇది చర్మానికి చాలా అద్భుతంగా ఎక్స్ ఫ్లోయేట్ చేస్తుంది. చర్మంలో ఉండే అదనపు జిడ్డు,నూనెతో ఎఫెక్టివ్ గా తొలగిస్తుంది. *ఒక చెంచా సాదా పెరుగు ను మీ ముఖం మీద అప్లై చేసి 15నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతి రోజూ ఒక సారి చేసుకుంటే, ఆయిల్ స్కిన్ శాశ్వతంగా పరిష్కరించుకోవచ్చు.

గుడ్డు:

గుడ్డు:

ఎగ్ వైట్ చర్మంలోని నూనెను కంట్రోల్ చేస్తుంది. ముఖం మీద ఎగ్ వైట్ ను వేసి ముఖం అంతా అప్లై చేయాలి. మీరు ఇంకా కొన్ని చుక్కల నిమ్మరసంను కూడా అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

Story first published: Thursday, January 14, 2016, 11:22 [IST]
Desktop Bottom Promotion