Latest Updates
-
చుక్క నూనె, ఇసుక లేకుండానే రోస్టెడ్ పల్లీలు.. ఎలా చేసుకోవాలంటే -
వీటిని ఫ్రిజ్లో పెట్టి తింటే క్యాన్సర్ రావడం పక్కా.. పొరపాటున కూడా ఈ పని చేయకండి.! -
అల్లుడిపై ఐదుగురు పిల్లల అత్త వ్యామోహం..కన్న కూతురికే సవతిలా మారి..చివరికి ఏమైందంటే.. -
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్.! -
ఎన్నడూ లేని విధంగా ప్రధాన గ్రహాల సంచారం, అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి సిరిసంపదల వరాలు.! -
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.!
మొటిమలు నివారించడంలో హెర్బల్ టీ చక్కటి పరిష్కారం..!!
మూడు నెలల పాటు రోజుకి రెండు కప్పుల టీ తాగితే మొటిమలు రాకుండా 31 శాతం నివారించొచ్చు అంటోంది ఓ అధ్యయనం. హెర్బల్ టీ తప్పకుండా తాగడం వల్ల మొటిమలు, మొటిమలకు కారణమయ్యే అనే క్రిములను నివారించడంలో ఎఫెక్టివ్ పరిష్కారం అంటున్నాయి అధ్యయనాలు.
యుక్త వయసులోనే కాదు కాస్త పెద్దయ్యాక కూడా ఎంతోమందిని మొటిమలు ఇబ్బందిపెడతాయి. అదీ ఆడవాళ్లలో అయితే 50 శాతం మంది వాళ్ల జీవితంలో ఒక్కసారైనా మొటిమల బారిన పడక తప్పదు అంటోంది ఆ స్టడీ. అలా చూసుకుంటే దాదాపుగా ప్రతి ఒక్కరూ మొటిమల నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తారన్నమాటే కదా. కాబట్టి మొటిమలు నివారించడంలో హెర్బల్ టీ ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం..

హెర్బల్ టీ
హెర్బల్ టీ తాగితే చర్మానికి, శిరోజాలకి మేలనే విషయం తెలిసిందే. అందులో కూడా స్పియర్‌మింట్ టీ అయితే మరీ మంచిది. దీన్ని తాగితే మొండి మొటిమల నుంచి బయటపడొచ్చనేది స్టడీ సారాంశం.

మొటిమల వల్ల ఏర్పడిన గాయాలు
రెండు కప్పుల ఆర్గానిక్ స్పియర్‌మింట్ టీని నెలరోజులు సేవిస్తే 25 శాతం మొటిమల వల్ల గాయాలు కాకుండా నివారించొచ్చు.

గ్రీన్ టీ
రోజుకి 3 నుంచి 4 కప్పుల గ్రీన్ టీ తాగడం వల్ల యాక్నెనీకి కారణమయ్యే హార్మోన్స్‌ని తగ్గించడంలో సహాయపడుతుందని.. స్టడీస్ చెబుతున్నాయి.

యాంటీ-ఇన్‌ఫ్లెమేటరీ గుణాలు
స్పియర్‌మింట్‌లో యాంటీ-ఇన్‌ఫ్లెమేటరీ గుణాలు ఉంటాయి. దానివల్ల చర్మం శుభ్రపడుతుందని స్టడీస్ చెబుతున్నాయి.

జిడ్డు తగ్గుతుంది
స్పియర్‌మింట్ టీ తాగడం వల్ల హార్మోన్ల మీద ప్రభావం పడుతుంది. దానివల్ల చర్మంపైన ఉండే గ్రంధులనుంచి నూనె ఉత్పత్తి తగ్గుతుంది. అలా జిడ్డు తగ్గి మొటిమలు రావడం తగ్గిపోతుంది.

క్లెన్సర్, టోనర్
టీ, పళ్లరసాల వంటివి తాగడం వల్ల ఒరిగే లాభం కొంతమేరకే. అందుకని క్రమం తప్పకుండా మంచి క్లెన్సర్, టోనర్ వాడాలి. ఇలాచేస్తే మొటిమలు రాకుండా నివారించవచ్చు.

బ్యాక్టీరియా
మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను గ్రీన్ టీ నివారిస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల ఇది యాక్నెకి కారణమయ్యే బ్యాక్టీరియాను నివారిస్తుంది.



Click it and Unblock the Notifications
