Latest Updates
-
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్‌ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ!
ఆశ్చర్యం: చర్మ సౌందర్యాన్నిమెరుగుపరిచే ఎగ్ షెల్స్
గుడ్డు మన చర్మానికి చాలా మంచి చేస్తుందని మనకు తెలిసిన విషయమే. గుడ్డు తెల్లసొన చర్మానికి సహాయపడుతుంది. అలాగే గుడ్డు పెంకులు కూడా సహాయపడతాయా? చర్మ సమస్యలకు గుడ్డు పెంకులను ఉపయోగించవచ్చా? నిపుణులు గుడ్డు పెంకులు చర్మ చికిత్సలో సహయపడతాయని అంటున్నారు.
గుడ్డు పెంకులో ఉన్న లక్షణాలు చర్మాన్ని శుభ్రం చేయటానికి మరియు సహజ మెరుపుకు సహాయపడుతుంది. చర్మానికి గుడ్డు పెంకులను ఎలా ఉపయోగించాలో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. గుడ్డు పెంకులను ఎండబెట్టి పొడి చేయాలి. ఈ పొడిలో కొన్ని పదార్దాలను కలిపి చర్మం మీద రాయాలి. ఉదాహరణకు స్పష్టమైన చర్మం కోసం గుడ్డు పెంకు పొడిలో వెనిగర్ కలపాలి.
ఇంకా మంచి పలితం రావాలంటే మసాజ్ చేయాలి. కాబట్టి ఇక్కడ గుడ్డు పెంకులతో అందానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. గుడ్డు పెంకుల పొడిని ముఖానికి రాసుకున్నాక ముఖం శుభ్రం చేయటం మర్చిపోకండి. అయితే పచ్చ సొనను మాత్రం ఉపయోగించకూడదు.

1. ఇన్ ఫెక్షన్స్ నయం చేస్తుంది
కొన్ని గుడ్డు పెంకులను తీసుకోని పొడిగా చేయాలి. ఒక కప్పు ఆపిల్ సైడర్ వెనిగర్ లో ఈ పొడిని వేసి కొన్ని గంటల పాటు నానబెట్టాలి. ఈ మిశ్రమాన్ని చర్మం పై దురదలు,కోతలు,గాయాలు ఉన్న ప్రదేశంలో రాయాలి . కొన్ని నిమిషాల్లోనే గాయాలు నయం కావటం గమనించవచ్చు.

2. చర్మాన్ని శుభ్రం చేస్తుంది
మూడు స్పూన్ల గుడ్డు పెంకుల పొడిలో ఒక స్పూన్ తేనే కలపాలి. ఈ మిశ్రమాన్ని చర్మంపై ఉన్న మచ్చలు మరియు గీతల మీద రాయాలి. ఈ విధంగా వారం రోజుల పాటు చేస్తే మంచి పలితం కనపడుతుంది.

3. చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది
గుడ్డు పెంకుల పొడి,గుడ్డు తెల్లసొన కలపాలి. ముఖాన్ని శుభ్రంగా కడిగి ఆరిన తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. ఇది చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది.

4. గుడ్డు పెంకుల మాస్క్
ఒక గుడ్డు తెల్ల సోనలో ఒక స్పూన్ పంచదార కలపాలి. ఆ తర్వాత దీనికి గుడ్డు పెంకుల పొడిని కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

5. చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది
చర్మం యవ్వనంగా మారాలంటే ఈ ఇంటి చిట్కాను ఫాలో అవ్వండి. ఒక బౌల్ లో ఒక స్పూన్ గుడ్డు తెల్లసొన,ఒక స్పూన్ బెల్లం,ఒక గుడ్డు పెంకుల పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముడతలు,మచ్చలు ఉన్న ప్రదేశంలో రాయాలి.

6. పళ్ళను తెల్లగా చేస్తుంది
బొగ్గు పొడి,గుడ్డు పెంకుల పొడిని కలిపి వారంలో రెండు సార్లు దంతాలను బ్రష్ చేయాలి. ఈ పొడి దంతాల మెరుపు మరియు గమ్ వ్యాధులను తగ్గించటంలో సహాయపడుతుంది.

7. నిగనిగలాడే చర్మం
గుడ్డు తెల్ల పొడిలో కలబంద జెల్ కలిపి ముఖానికి మసాజ్ చేయాలి. ఈ విధంగా మసాజ్ చేయటం వలన రక్త ప్రసరణ పెరుగుతుంది. మృత కణాలు తొలగిపోయి చర్మం నిగనిగలాడుతూ ఉంటుంది.



Click it and Unblock the Notifications
