Latest Updates
-
వంకాయతో ఇలా పకోడీ చేస్తే ప్లేట్ క్షణాల్లో ఖాళీ అవ్వాల్సిందే! -
వర్షాకాలం.. జంటలకు రొమాంటిక్ సీజన్.. ఈ డేటింగ్ టిప్స్‌తో మరింత మధురం.! -
ప్రేమ జీవితంలో ఒక్కసారే వస్తుందా? క్రియేటివ్ వ్యక్తులు మళ్లీ మళ్లీ ప్రేమలో ఎందుకు పడతారు? -
పోషకాలు పుష్కలంగా సూపర్ టేస్టీ మునగాకు చట్నీ..ఇడ్లీ, దోశ, అన్నం ఎందులోకైనా పర్ఫెక్ట్.. నెలల తరబడి నిల్వ -
ఉదయం పూట అమృతమే.. కానీ రాత్రి వీటిని తింటే ఎంత డేంజర్ తెలుసా.? -
కోరిన వరాలిచ్చే కరుణామయి..2026 వరలక్ష్మీ వ్రతం తేదీ, శుభ ముహూర్తం, పూజా విధానం, ప్రాముఖ్యత, వ్రత కథ -
ఈ ఒక్క గింజలతో మూడు రకాల టిఫిన్స్.. పోషకాలు పుష్కలం, ప్రయోజనాలు మెండు.! -
అరటిపండు ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఈ సమయంలో తింటే మాత్రం గుండెకే ప్రమాదం! -
ఐరన్, ఫైబర్ పుష్కలం..పిండి రుబ్బే పనిలేకుండా 10 నిమిషాల్లోనే క్రిస్పీ రాగి బీట్ రూట్ దోశ.. -
మహారాష్ట్ర స్టైల్ గుత్తి వంకాయ కూర..ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు!
చిన్న బెల్లం ముక్క చాలు... అందం రెట్టింపు చేయడానికి..
బెల్లం స్వీట్ గానే కాదు.. స్వీట్ బ్యూటీ సీక్రెట్స్ కూడా దాగున్నాయి. పూర్వం టీ, కాఫీలు కూడా బెల్లంతోనే తీసుకునేవాళ్లు. పంచదారకు బదులు ఇప్పటికీ కొన్ని మారుమూల ప్రాంతాల్లో బెల్లంనే ఉపయోగిస్తాయి. ఇందులో అనేక ఆరోగ్యప్రయోజనాలు దాగి ఉండటమే దీనికి కారణం.
బెల్లం.. ! ఇది కేవలం ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా ఉపయోగపడుతుంది. డైలీ డైట్ లో చిన్న బెల్లం ముక్క చేర్చుకోవడం వల్ల.. చర్మం, జుట్టు ఆరోగ్యంగా, అందంగా ఉంటాయి. బెల్లంలో విటమిన్స్, మినరల్స్, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. ఇది చక్కెర కంటే.. మంచిదని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి.

మొటిమలు
బెల్లంలో విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉండటం వల్ల.. అన్ని రకాల చర్మ సమస్యలను నివారిస్తుంది. రెగ్యులర్ గా బెల్లం తినడం వల్ల.. యాక్నె, మొటిమలు, మచ్చలు, ముఖంపై ఏర్పడిన మొటిమల తాలుకూ గుంతలను తొలగిస్తుంది. అలాగే చర్మం గ్లోయింగ్ గా మారుతుంది.

గ్లోయింగ్ స్కిన్
చర్మానికి సహజ మెరుపు అందివ్వడంలో బెల్లం పవర్ ఫుల్ గా పనిచేస్తుంది. రోజూ కొద్దిగా బెల్లం తీసుకోవడం వల్ల అన్ని రకాల చర్మ సమస్యలు దూరం కావడమే కాదు.. న్యాచురల్ గ్లోయింగ్ అందిస్తుంది.

ముడతలు
ప్రీమెచ్యూర్ ఏజింగ్, ముడతలు వంటి సమస్యలకు బెల్లం చక్కటి పరిష్కారం. దీనికోసం నువ్వులు, బెల్లం కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. లేదా ఈ రెండింటి మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసినా అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది.

జుట్టుకి
మీ జుట్టు న్యాచురల్ లుక్ సొంతం చేసుకోవాలంటే.. బెల్లం ఉపయోగించవచ్చు. బెల్లం, ముల్తానీ మట్టి, పెరుగు అన్నింటినీ బాగా మిక్స్ చేసి జుట్టుకి అప్లై చేయడం వల్ల.. జుట్టు బలంగా, పొడవుగా, నల్లగా నిగనిగలాడుతుంది.

బ్లడ్ ఫ్యూరిఫికేషన్
బెల్లంలో బ్లడ్ ప్యూరిఫై చేసే అద్భుతమైన గుణం దాగుంది. కాబట్టి దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల రక్తం ప్యూరిఫై అయి.. చర్మం ప్రకాశవంతంగా మారడానికి సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications