Latest Updates
-
నేడు వ్యతీపాత యోగం: ఈ తప్పులు చేస్తే భారీ నష్టాలు తప్పవు.. జాగ్రత్త! -
లలితా సహస్రనామం స్త్రీలు ఎందుకు ఈ పారాయణం చేయాలి? శుక్రవారం మహత్యం -
చంద్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం: ఈ రాశుల వారికి క్రమశిక్షణతో పాటు అదృష్టం, సంపద రెట్టింపు! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి ఈ వారం అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - 21 నుండి 27 జూన్ 2026 వరకు -
మేషం, సింహం, ధనస్సు రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. భారీ లాభాలు! - ఆదివారం, 21 జూన్ 2026 -
ఫాదర్స్ డే స్పెషల్.. నాన్న కోసం లక్నో నవాబీ స్టైల్ కిమామి సేమియా'.. ఈ రుచి అస్సలు మర్చిపోరు! -
Chanakya niti: స్త్రీకి ఈ 4 గుణాలు ఉంటే ఇల్లు స్వర్గమే! -
మీ నాన్న ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఈ 3 రకాల గింజలు ఇవ్వండి -
ఓంకారం జపిస్తే ఏమవుతుంది? శాస్త్రాలు చెప్పిన ఆశ్చరికకర విషయాలు -
Father's day 2026: ఈ ఫాదర్స్ డే నాడు పిల్లల నుండి తండ్రులు నేర్చుకోవాల్సిన విషయాలు..
మగవాళ్ల చర్మం నిర్జీవంగా కనిపించడానికి కారణాలు..!
మీరు పార్టీకి వెళ్లలేదు, కంటినిండా నిద్రపోయారు కానీ కళ్లు చూస్తే వాడిపోయిట్టు ఉన్నాయి, చర్మం డల్ గా మారిపోయింది, కళ్లు ఎర్రగా కనిపిస్తున్నాయి, ఎందుకు ? ఇలాంటి లక్షణాలన్నీ మీలో కూడా కనిపిస్తున్నాయా ? ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి మీకూ ఎదురైందా ? అయితే మీరు మీ శరీరంపై తీసుకుంటున్న శ్రద్ధ సరైన పద్ధతిలో లేదు.
అబ్బాయిలు వాళ్ల జుట్టు విషయంలో చేసే కామన్ మిస్టేక్స్..!
మీరు మీ చర్మానికి అప్లై చేస్తున్న క్రీములు, మాయిశ్చరైజర్లు, ఫేస్ వాష్ లతో పాటు మరికొన్ని అలవాట్లు కూడా మీరు డల్ గా, మీ చర్మం నిర్జీవంగా కనిపించడానికి కారణమవుతాయి. మీరు డల్ గా కనిపించడానికి మరిన్ని కారణాలున్నాయి. మీ రెగ్యులర్ గా ఫాలో అయ్యే హ్యాబిట్సే దీనికి కారణం. కాబట్టి అవేంటో తెలుసుకుని, వాటికి పరిష్కారాలు కూడా తెలుసుకోండి..

పొట్టపై పడుకోవడం
నిద్రపోయేటప్పుడు శరీరం ఫ్లూయిడ్స్ ని విడుదల చేసి, రక్తప్రసరణను అందిస్తుంది. ఫేస్ కి ఫ్లూయిడ్స్, రక్తాన్ని సరఫరా చేసే పనిలో ఉంటుంది బాడీ. ఈ ఫ్లూయిడ్స్ కళ్ల చుట్టూ పేరుకుపోతే.. కళ్లకింద క్యారీ బ్యాగ్ లు ఏర్పడతాయి. దీనివల్ల ముఖం నిర్జీవంగా కనిపిస్తుంది.

పరిష్కారం
నిద్రపోయేటప్పుడు తలను ఒకటి లేదా రెండు దిండులపై పెట్టుకోవాలి. అప్పుడు ఫ్లూయిడ్స్ ఫేస్ లో చేరకుండా.. శరీరమంతా వ్యాపిస్తాయి.

ప్రాసెస్డ్ ఫుడ్
ప్రొసెస్డ్ ఫుడ్ లో రిఫైన్డ్ షుగర్, ప్రాసెస్డ్ కార్బ్స్ ఉంటాయి. ఇవి మిమ్మల్ని ఫ్యాట్ గా మాత్రమే కాదు, మీ చర్మాన్ని అందవిహీనంగా మారుస్తాయి. అలాగే ఇన్ల్ఫమేషన్, ముడతలకు కారణమవుతాయి. వ్యాధినిరోధక వ్యవస్థపైనా ప్రభావం చూపుతాయి.

పరిష్కారం
చేయాల్సిందల్లా ఒక్కటే.. ప్రాసెస్డ్ ఫుడ్ తినడం మానేయడం. మైదా, హైడ్రోజెనరేటెడ్ ఆయిల్స్, హై ఫక్టోజ్ లకు దూరంగా ఉండాలి. ఇవి ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్ లో ఉంటాయి.

ఎలర్జీలు
తుమ్ములు, దగ్గు, జ్వరం, గొంతులో ఇన్ఫెక్షన్ వంటి సీజనల్ ఎలర్జీలు కూడా కళ్ల కింద డార్క్ సర్కిల్స్ క్రియేట్ చేస్తాయి. బ్లడ్ ఫ్లో ఎక్కువ అవడం వల్ల కళ్లకింద సర్కిల్స్ ఏర్పడతాయి.

పరిష్కారం
ఎలర్జీ లక్షణాలు కనిపించిన వెంటనే పరిష్కారం కోసం ప్రయత్నించాలి. అలాగే ముందుగానే ఎలర్జీలను ఎదుర్కొనే మందులు ఉపయోగిస్తే.. వాటికి దూరంగా ఉండవచ్చు.

గాలి
ఇంట్లో ఉండే గాలి కళ్ల కింద ఉండే మాయిశ్చరైజర్ ని పీల్చేసుకోవచ్చు. దీనివల్ల నిద్రలేవగానే ఎర్రగామారినట్లు కళ్లు కనిపిస్తాయి. అలాగే ఈ గాలి కారణంగా.. కళ్ల చుట్టు నల్లటి వలయాలు ఏర్పడతాయి.

పరిష్కారం
చల్లటి ఐ మాస్క్ లేదా జెల్ ని రెగ్యులర్ గా అప్లై చేయడం వల్ల మీ కళ్లు హెల్తీగా మారతాయి.

కెఫీన్
ఉదయం నిద్రలేవగానే ఒక కప్పు కాఫీ కంపల్సరీ ఉండాల్సిందే. కానీ ఇది మీ చర్మాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. దీనివల్ల చర్మంపై ముడతలు రావడం, చర్మం డల్ గా మారడం, చర్మం పొడిబారడం జరుగుతుంది. రోజుకి చిన్న సైజులో ఉండే నాలుగు కప్పుల కంటే ఎక్కువ తీసుకోవద్దు. అలాగే స్కిన్ ఎలాస్టిన్ కి సహాయపడే యాంటీ ఆక్సిడెంట్స్ ని నాశనం చేస్తుంది. వీటన్నింటి వల్ల చర్మం డల్ గా మారిపోతుంది.

పరిష్కారం
గ్రీ టీ తాగడం మంచిది. ఇందులో కెఫీన్ తక్కువగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి.



Click it and Unblock the Notifications