Latest Updates
-
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి!
బ్లాక్ స్కిన్, చర్మం మీద బ్లాక్ ప్యాచెస్ నివారించే నేచురల్ రెమెడీస్
స్కిన్ పిగ్మెంటేషన్ అంటే చర్మం రంగు మారడం. కొందరికి ఎండలో తిరిగితే వెంటనే చర్మం నల్లబడటం జరుగుతుంటుంది. అంతే కాదు, వాతావరణంలో మార్పుల వల్ల, కాలుష్యం వల్ల కూడా స్కిన్ పిగ్మెంటేషన్ కు కారణం అవుతుంది. చర్మం రంగు అంటే స్వతహాగా చర్మం రంగు మారి దీని వలన అసమానమైన చర్మపు రంగుకు దారి తీయడం. ఈ చర్మపు రంగు మారడానికి అనేక కారణాలు ఉన్నాయి. చర్మపు రంగు జన్యు పరంగా సిద్ధించి ఉండవచ్చు. ఎండలో ఎక్కువగా తిరగడం, ఒత్తిడి, మొటిమల మచ్చలు, హార్మోనుల స్థాయిలోని హెచ్చుతగ్గులు లేదా కాలుష్యం వంటి వాతావరణ మూలకాలు, దీనికి ఇతర కారణాలై ఉండవచ్చు.
చాలామందిని వేధించే చర్మ సమస్యల్లో.. పిగ్మెంటేషన్ ఒకటి. చర్మం రంగు ముదురు చాయలోకి మారినా.. లేదా మెరుపు పూర్తిగా తగ్గి మచ్చలు పడినా తేలిగ్గా తీసుకోకూడదు. దాన్ని పిగ్మెంటేషన్‌గా పరిగణించాలి. ఈ సమస్య ప్రధానంగా మూడు రకాలుగా వేధిస్తుంది.
* చర్మం ముదురు రంగులోకి మారడాన్ని హైపర్ పిగ్మెంటేషన్ అంటారు.
* అక్కడక్కడా తెల్ల మచ్చలు పడితే.. హైపో పిగ్మెంటేషన్‌గా పరిగణిస్తారు.
* పూర్తిగా రంగు తగ్గిపోతే.. అది డీ పిగ్మెంటేషన్‌గా గుర్తించాలి.
ప్రపంచం మొత్తంలో స్కిన్ పిగ్మెంటేషన్ సమస్యను చాలా మంది స్త్రీ , పురుషలు ఎదుర్కొంటున్న బ్యూటీ సమస్య. స్కిన్ పిగ్మెంటేషన్ నివారించుకోవడానికి అనేక మెడికేషన్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. స్కిన్ పిగ్మెంటేషన్ సమస్యను నివారించుకోవడానికి అనేక రకాల ఖరీదైన స్కిన్ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్స్ మరియు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ సమస్యను నివారించుకోవాలంటే నేచురల్ హోం రెమడీస్ అద్భుతంగా సహాయపడుతాయి.

తేనె, పాలు మరియు నిమ్మరసం:
ఒక చెంచా తేనె, పాల పొడి, చెంచా నిమ్మరసం మిక్స్ చేయాలి. తర్వాత తేనె మరియు అరటీస్పూన్ బాదం ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి. చిక్కగా పేస్ట్ చేసి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15నిముషాల తర్వాత శుభ్రం చేసుకుంటే, టానింగ్ ఎఫెక్ట్ లేకుండా, చర్మం ప్రకాశవంతంగా మెరుస్తూ నేచురల్ రేడియన్స్ ను అందిస్తుంది.

పెరుగు, ఓట్ మీల్
మరో ఉత్తమ హోం రెమెడీ. తాజా పెరుగును ఓట్ మీల్ పొడిలో మిక్స్ చేసి చర్మం మీద అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత, చల్లటి నీటితో శుభ్రం చేయాలి . ఇంకా ఈ మిశ్రమంలో కొద్దిగా టమోటో జ్యూస్ కూడా మిక్స్ చేయడం వల్ల చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

పొటాటో
బంగాళదుంపలో నేచురల్ బ్లీచింగ్ లక్షనాలు కలిగి ఉన్నాయి. ఇది చర్మ మీద ఎటువంటి ప్యాచెస్ లేకుండా చేస్తుంది. బంగాళదుంపను స్లైస్ గా చేసి చర్మం నల్లగా మరియు పిగ్నెంటేషన్ తో ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయడం వల్ల పిగ్మేంటేషన్ నేచురల్ గా నివారించబడుతుంది.

ఆరెంజ్ పీల్
ప్లెయిన్ పెరుగు మరియు కొద్దిగా ఎండిన ఆరెంజ్ తొక్కను తీసుకొని పేస్ట్ చేసి పిగ్మెంటేషన్ ప్రభావితం అయిన ప్రదేశంలో అప్లై చేయాలి. 15నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవడం వల్ల స్కిన్ టానింగ్ నివారించవచ్చు.

మింట్
స్కిన్ టోన్, నల్ల మచ్చలను మాయం చేయడానికి పుదీనా చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. పుదీనా ఆకులను పేస్ట్ చేసి పిగ్మెంటేషన్ ఉన్న ప్రదేశంలో అప్లై చేస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది.

ఆనియన్ జ్యూస్
మరో ఉపయోగకరమైన హోం రెమెడీస్. ఉల్లిపాయ రసంలో కొద్దిగా ఆపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి చర్మానికి అప్లై చేయాలి. అంతే ఇది స్కిన్ పిగ్మెంటేషన్ ను నివారిస్తుంది . లేదా ఉల్లిపాయ ముక్కను వెనిగర్ లో డిప్ చేసి ఎపెక్టెడ్ ఏరియాలో మర్దన చేయాలి.

టర్మరిక్
ప్రెగ్నెన్సీ పిగ్మెంటేషన్ ను నివారించడంలో ఇది చాలా ఎఫెక్టివ్ హోం రెమెడీ. పసుపు, నిమ్మరసం శెనగపిండి, మిల్క్ క్రీమ్ మెత్తగా పేస్ట్ లా చేసి, ముఖానికి పట్టించాలి. మరింత ఉత్తమ ఫలితాల కోసం రోజ్ వాటర్ ను మిక్స్ చేయవచ్చు.

లెమన్ జ్యూస్
స్కిన్ పిగ్మెంటేషన్ నివారించడానికి మరో ఎఫెక్టివ్ హోం రెమెడీ నిమ్మరసం, కీరదోసకాయ రసాన్ని మిక్స్ చేసి ప్రభావితప్రాంతాల్లో అప్లై చేసి కొద్దిసేపటి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

పచ్చి బొప్పాయి
పచ్చి బొప్పాయిను పచ్చి పాలతో కలిపి పది నిమిషాల పాటు ముఖంపై మర్దన చేయండి. ఈ లేపనం .మీ చర్మం పైన మచ్చలకు ప్రభావవంతమైన చికిత్స. ఎందుకంటే ఇందులో పెపైన్ అనే ఎంజైమ్ స్కిన్ ఎక్స్ ఫ్లోయేట్ చేస్తుంది. చర్మాన్ని శుభ్రపరుస్తుంది . దాంతో స్కిన్ పిగ్మెంటేషన్ నివారించబడుతుంది.

సన్ స్క్రీన్ లోషన్
ఒక వేళ మీరు బయట ఉన్నట్టయితే ప్రతి మూడు గంటల కొకసారి సన్ స్క్రీన్ లోషన్ ను తిరిగి పూయండి.ఎస్ పి ఎఫ్ 30ఉన్న సన్ స్క్రీన్ లోషన్ ఎండకాలంలోనే కాదు, ఏసీజన్ అయినా, శరీరానికి అప్లై చేయవచ్చు.



Click it and Unblock the Notifications