Latest Updates
-
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.!
సమ్మర్ లో ఆయిల్ స్కిన్ ను మ్యానేజ్ చేయడం ఎలా..
వేసవి వచ్చేసింది. బయటికెళ్లాలంటే వేడిగాలులకు జడుసుకుంటాం. అలాంటి వేసవిలో చర్మ సంరక్షణ ఎంతో అవసరమని ఆరోగ్య నిపుణులు అంటున్నా రు. మీది ఆయిల్ ఫేస్ అయితే వేసవి కారణంగా మీ చర్మం అందవిహీనంగా కనిపిస్తుంది. ఆయిల్ ఫేస్ ఉన్నవారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ వేసవి గండం నుంచి తేలికగానే గట్టెక్కవచ్చు.
సాదారణంగా జిడ్డు చర్మం మెరుస్తూ నిస్తేజంగా ఉంటుంది. చర్మంపై అదికంగా నూనె ఉండుట వలన బ్లాక్ హెడ్స్,వైట్ హెడ్స్, మొటిమలు, చర్మం మీద చికాకు వంటివి వస్తాయి. అంతేకాక వీటి వల్ల చర్మం రంద్రాలు పెద్దవి అయ్యి చర్మం ముతక రూపంలోకి మారుతుంది. మరో వైపు, పొడి లేదా సాధారణ చర్మం పోలిస్తే జిడ్డు చర్మం మీద ముడతలు వచ్చే అవకాశాలు తక్కువ. అయితే జిడ్డు చర్మంను నిర్వహించటం చాలా కష్టం.
వేసవిలో మధ్యాహ్నం పూట బయట వెళ్లాలంటే ఇబ్బందిగా ఉందా... జిడ్డు చర్మం ఉన్నవారిపై సూర్యరశ్మి ఎక్కువగా ప్రభావం చూపుతుంది. జిడ్డు చర్మంపై సూర్యరశ్మి పడ గానే ముఖం ఎక్కువ జిడ్డుని కలిగిస్తుంది. ఇలా చేయడమే కాకుండా అందాన్ని కూడా పోగొడుతుంది. ఇలాంటివారు జిడ్డు తత్వాన్ని తొలగించుకుని అందంగా కనిపించేందుకు ఇదిగో కొన్ని చిట్కాలు.

టమాటో - ఓట్స్
టమాటాలో కాస్త ఓట్స్ కలిపి మిక్స్ చేసిన మిశ్రమాన్ని ముఖానికి అప్లైచేసి 20 నిమిషాలు తర్వాత శుభ్రపరచాలి. జిడ్డు చర్మం ఉన్నవారికి టమోటాలు చాలా బాగా ఉపయోగపడతాయి. టమోటాని సగానికి కోసి ముఖనికి చేతులకు రుద్ది పావు గంట తర్వాత కడిగేయాలి. చర్మం శుభ్రపడుతుంది బ్లాక్ హెడ్స్ తగ్గుతాయి. చర్మ రంద్రాలు శుభ్రపడతాయి.

పాలు-గుడ్డు
పాలు, గుడులోని తెల్లసొన, క్యారెట్ తురుము కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించి నట్లైతే అధిక జిడ్డు తత్వాన్ని తగ్గిస్తుంది. జిడ్డు చర్మం వారు అప్పుడప్పుడు చన్నీటితో ముఖాన్ని శుభ్రపరచాలి.

మజ్జిగ
మజ్జిగని ముఖంపైన అప్లైచేసి కొంత సేపు తర్వాత శుబ్రపరచినట్లైతే జిడ్డుని తగ్గిస్తుంది. అలాగే పెరుగు కూడా జిడ్డు చర్మానికి బాగా పనిచేస్తుంది. రెండు టేబుల్ స్పూన్ల పెరుగులో కార్న్ పౌడర్, నిమ్మరసం కలిపి ముఖానికి ప్యాక్ లా వేసుకుని కాసేపయ్యాక కడిగేస్తే జిడ్డు తత్వం తొలగిపోతుంది.

కీరారసం- నిమ్మరసం
కీరారసం, నిమ్మరసం, చందనం పొడి, బాదం పౌడర్, పెరుగు, బంగాళదుంప రసాన్ని సమానంగా తీసుకొని వాటిని ముఖానికి పట్టించి కొంత సేపు తర్వాత కడిగేయాలి. ఈ విధంగా క్రమంగా చేసినట్లైతే జిడ్డు తగ్గుతుంది.

నిమ్మరసం
నిమ్మరసం, గుడ్డులోని తెల్లసొన, ద్రాక్షరసాన్ని సమపాళ్ళల్లో తీసుకొని కలిపిన మిశ్రమాన్ని ముఖానికి అప్లైచేయాలి. కొంత సేపు తరువాత ముఖాన్ని నీటితో శుభ్రం చేయాలి.

పెరుగు-శెనగపిండి
జిడ్డు చర్మం వారు ఎండలో బయటికి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే కాస్త పెరుగు, సెనగ పిండి, నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టిస్తే జిడ్డుని తగ్గించి ముఖాన్ని అందంగా చేస్తుంది.

ద్రాక్ష రసం
జిడ్డు చర్మం గలవారికి వేసవిలో మరింత జిడ్డెక్కిపోతుంది. అలాంటప్పుడు ద్రాక్షపళ్ల రసంలో ముల్తానీమట్టి కలిపి ప్యాక్‌లా వేసుకుని, అరగంట తర్వాత కడిగేసుకుంటే జిడ్డుదనం పోతుంది.

చల్లని నీటితో ముఖం కడుక్కోవాలి
జిడ్డు చర్మ తత్వం కలవారు చర్మాన్ని ఎప్పుడు ఫ్రెష్ గా ఉంచుకోవాలి. అందుకో కనీసం ఒక రోజులు రెండు మూడు సార్లైనా చల్లని నీటితో ముఖం కడుక్కోవాలి. అందుకు తగ్గ గ్లిసరిన్ సోప్స్ ను వినియోగించడమే మంచిది.

టిష్సూ పేపర్
అప్పుడప్పుడు ప్లైయిన్ టిష్సూ పేపర్ తో ముఖాన్ని అప్పుడప్పుడు శుభ్రపరచుకుంటుండాలి.

మాయిశ్చరైజర్స్ కి దూరంగా ఉండాలి.
జిడ్డు చర్మ కలవారు మాయిశ్చరైజర్స్ వాడటం వల్ల ముఖం మీద ఉన్న మొటిమలపై రుద్దడం వల్ల సమస్య మరింత ఎక్కువ అవుతుంది. కాబట్టి వేసవిలో మాయిశ్చరైజర్స్ వాడకపోవడమే మంచిది.



Click it and Unblock the Notifications
