Latest Updates
-
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.!
సెన్సిటివ్ స్కిన్ కు అద్భుతమైన హోం మేడ్ ఫేస్ మాస్క్...
సాధారణంగా కొంత మంది చర్మం గమనించినట్లైతే చాలా సెన్సిటివ్ గా కనిపిస్తుంది ? అలాంటి వారు కాస్మోటిక్స్ ఉపయోగించడం వల్ల వెంటనే చర్మం రియాక్ట్ అవుతుంది? దాంతో చర్మంలో మంట, స్కిన్ రాషెస్, చర్మం ఎర్రగా మారడం వంటి లక్షణాలు కనబడుతాయి. అలాంటి సెన్సిటివ్ స్కిన్ ను మీరు కూడా కలిగి ఉన్నారా?
సమాధానం అవును అన్నట్లైతే , తప్పనిసరిగా ఈ ఆర్టికల్ మీకోసమే..ఖచ్చితంగా చదివి తెలుసుకోవాల్సిందే..
చాలా మందిలో స్కిన్ కండీషన్స్ లో సెన్సిటివ్ స్కిన్ అత్యంత సాధారణమైనది. ఈ సమస్యతో చాలా మంది బాధపడుతుంటారు. అందుకోసం వైద్యపరంగా ఎలాంటి మెడికేషన్స్ లేవు . ఇంకా కొంత మంది నిపుణులు కూడా ఈ విషయాన్ని అంగీకరించారు. సాధారణ చర్మం వారితో పోల్చితే సెన్సిటివ్ చర్మం ఉన్న వారు కొద్దిమందే అన్నవిషయాన్ని కూడా గుర్తించారు.
సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు , స్కిన్ హెల్తీగా మెయింటైన్ చేయడం కష్టం. కొన్ని రకాల చర్మ తత్వాలు, డెడ్ స్కిన్ సెల్స్ ఏర్పడటం, మొటిమలు సమస్యలు చాలా సాధారణంగా ఉంటాయి మరియు కొంత మందిలో చర్మంగా ఎర్రగా కందిపోవడం, దురద, మరియు ఇతర చర్మ సమస్యలుంటాయి.

ఇలాంటి లక్షణాలున్న వారు , సెన్సిటివ్ స్కిన్ ను ఆరోగ్యంగా మరియు బ్యూటిఫుల్ గా మెయింటైన్ చేయడానికి కొన్ని సింపుల్ మార్గాలున్నాయి.అందుకు మీరు చేయాల్సిందల్లా చర్మానికి తగిన ఫేస్ మాస్క్ వేసుకోవడం వల్ల చర్మంలో డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించుకోవచ్చు, అదే సమయంలో చర్మానికి తగిన మాయిశ్చరైజర్ ను అందివ్వొచ్చు . వీటి వల్ల ఎలాంటి హాని ఉండదు. ఈ ఫేస్ మాస్క్ కోసం రెండు పదార్థాలు అవసరమవుతాయి. క్యారెట్ మరియు హనీ రెండింట కాంబినేషన్ స్కిన్ కు నేచురల్ గ్లోను ఇస్తుంది. ఈ ఫేస్ మాస్క్ వల్ల చర్మానికి ఎలాంటి హాని ఉండదు. సురక్షితమైనది మరి ఈ సెన్సిటివ్ స్కిన్ హోం మేడ్ ఫేస్ మాస్క్ ను ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం..

కావల్సిన పదార్థాలు:
తేనె: కొద్దిగా
క్యారెట్:
తయారుచేయు పద్దతి:
రెండు క్యారెట్ ను మెత్తగా ముక్కలుగా కట్ చేసి నీటిలో వేసి 15నిముషాలు ఉడికించాలి.
దీన్ని మెత్తగా పేస్ట్ చేయాలి.
తర్వాత ఇందులో కొద్దిగా తేనె మిక్స్ చేయాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.
ఈ హోం మేడ్ ఫేస్ మాస్క్ ను వారంలో రెండు సార్లు వేసుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది.
అందమైన , కాంతివంతంగా, సెన్సిటివ్ స్కిన్ పొందవచ్చు..



Click it and Unblock the Notifications
