Latest Updates
-
ఎండలు మండుతున్నాయి.. అకస్మాత్తుగా పిడుగులు పడతాయా? మీ కుటుంబం కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
మీ భోజనం రుచిని రెట్టింపు చేసే సీక్రెట్ పచ్చిమిర్చి పచ్చడి..అప్పటికప్పుడు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మే 8: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది.. ధనలాభం ఖాయం! -
గ్యాస్, అసిడిటీకి చెక్..పడుకునే ముందు ఇదొక గ్లాస్ తాగితే కడుపు ఉబ్బరం మాయం! -
మే 8న సర్వార్థ సిద్ధి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, ధన వర్షమే! -
గుజరాతీ స్పెషల్ జొన్న ఖీచూ..బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిక్ పేషెంట్లకు సూపర్! -
అన్నమయ్య 618వ జయంతి వేడుకలు: భక్తుల పరవశం, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు.. ఈ విశేషాలు తెలుసా? -
మకర రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి కెరీర్లో తిరుగులేని విజయం.. నేటి రాశి ఫలాలు! -
వృషభం, తుల రాశులపై లక్ష్మీ కటాక్షం.. ఎవరి అదృష్టం మారబోతోంది? - శుక్రవారం, 08 మే 2026 -
డేటింగ్ యాప్‌లో పరిచయం.. కేఫ్‌లో దిమ్మతిరిగే బిల్లు! ఈ కొత్త మోసం గురించి తెలుసా?
చర్మానికి క్యారట్, పాల మిశ్రమం అప్లై చేస్తే ఏమవుతుంది ?
ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్.. ఈ కోట్ చాలామంది వినే ఉంటారు. అలాగే ఫాలో కూడా అయి ఉంటారు. అంతేకాదు.. ఇది వాస్తవమే. ఎందుకంటే.. ఎవరైనా ముందుగా చూసినప్పుడు ఏదో ఒకటి ఎట్రాక్ట్ చేస్తుంది. అలా ఎదుటివాళ్లు మిమ్మల్ని చూసినప్పుడు మీ ముఖం, గ్లోయింగ్, స్మైల్ నే గుర్తిస్తారు.
క్యారెట్ జ్యూస్ రెగ్యులర్ గా తాగితే వీర్య వృద్ధి..సంతాన ప్రాప్తి..!
కాబట్టి మీరు ఫస్ట్ ఇంప్రెషన్ కొట్టేయాలని.. అది చాలా గుర్తుండిపోయేలా ఉండాలని భావిస్తే.. మీ చర్మం హెల్తీగా, రేడియంట్ కాంప్లెక్షన్ కలిగి ఉండాలి. అలా ఉంటే.. మీ ఫ్రెండ్స్, పార్ట్ నర్ అందరూ ఎట్రాక్ట్ అయిపోతారు. ఎవరికీ నిగారింపు చర్మం పుట్టుకతో రాదు.. ఒకవేళ వచ్చినా.. రకరకాల చర్మ సమస్యలు వస్తుంటాయి.
హనీ - మిల్క్ గోల్డెన్ కాంబినేషన్ లో అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్
కాలుష్యం, దుమ్ము, కేర్ తీసుకోవడానికి సమయం లేకపోవడం, డైట్ లో లోపాలు, హెరిడిటీ వంటి కారణాల వల్ల చర్మ సౌందర్యం, ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. వీటన్నింటి వల్ల చర్మంపై మచ్చలు, పిగ్మెంటేషన్ సమస్యలు ఎదురవుతాయి. అలాగే చర్మం నిర్జీవంగా మారుతుంది. కాబట్టి మీ చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేసే.. అద్భుతమైన రెమిడీ క్యారట్, పాల మిశ్రమం. దీన్ని అప్లై చేయడం వల్ల పొందే అమేజింగ్ బెన్ఫిట్స్ ఏంటో చూద్దాం..

గ్లోయింగ్ స్కిన్
క్యారట్, పాలు కలిపి మిశ్రమంలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ చర్మంలోని కణాలకు పోషణ అందిస్తుంది. అలాగే చర్మాన్ని హెల్తీగా, గ్లోయింగ్ గా మారుస్తుంది. కాబట్టి రెగ్యులర్ గా ఈ మిశ్రమాన్ని అప్లై చేస్తూ ఉండండి.

మచ్చలు
క్యారట్, పాలు మిశ్రమం మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలు, పిగ్మెంటేషన్ తొలగించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అలాగే మీ స్కిన్ కాంప్లెక్షన్ కూడా పెరుగుతుంది.

యంగ్ లుక్
పాలు, క్యారట్ రెండింటిలో చర్మానికి నూతనోత్తేజాన్నిస్తాయి. కణాల్లో చైతన్యం నింపుతాయి. అలాగే కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. స్కిన్ ఎలాస్టిసిటీ పెంచి.. యంగ్ లుక్ ని అందిస్తుంది.

డ్రై స్కిన్
క్యారట్లలో ఉండే విటమిన్ సి, పాలల్లో ఉండే హైడ్రేటింగ్ నేచర్ చర్మానికి మాయిశ్చరైజర్ ని, కాంప్లెక్షన్ ని అందిస్తాయి. అలాగే ఎల్లప్పుడూ సాఫ్ట్ గా ఉంచడం వల్ల పొడిబారిని చర్మం నుంచి బయటపడవచ్చు.

న్యాచురల్ సన్ స్క్రీన్
క్యారట్స్, మిల్క్ కాంబినేషన్ న్యాచురల్ సన్ స్క్రీన్ లా పనిచేస్తాయి. సూర్యుడి నుంచి వెలువడే.. హానికారక యువీఏ, యువీబీ కిరణాల నుంచి రక్షణ కల్పించి.. చర్మ సమస్యలను, ట్యాన్, పిగ్మెంటేషన్ ను నివారిస్తుంది.

స్కిన్ ఇరిటేషన్
పాలు, క్యారట్స్ లో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉంటాయి. దీనివల్ల ఇవి చర్మంపై గాయాలు, పుండ్లు, దురద, దద్దుర్లు వంటి సమస్యలు నివారించి.. చర్మాన్ని స్మూత్ గా మారుస్తుంది.

చర్మ ఆరోగ్యానికి
క్యారట్ లో విటమిన్ ఏ, పాలల్లో పోషకాలు ఉంటాయి. ఈ రెండింటి మిశ్రమాన్ని చర్మానికి అప్లై చేస్తే.. రకరకాల చర్మ సమస్యల నుంచి బయటపడవచ్చు. యాక్నె, ఎగ్జిమా, రాషెస్ వంటి సమస్యలు దూరంగా ఉంటాయి.

అన్ వాంటెడ్ హెయిర్
క్యారట్, పాలు మిశ్రమంలోకి కొద్దిగా పసుపు కలిపి ఫేస్ కి అప్లై చేస్తే.. ముఖంపై వచ్చే అన్ వాంటెడ్ హెయిర్ తొలగించవచ్చు. అలాగే గ్రోత్ ని అరికట్టి.. స్మూత్ లుక్ అందిస్తాయి.



Click it and Unblock the Notifications