Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
కలబందతో అందంగా మెరిసిపోవడం ఎలా?
సాధారణంగా దీనిని గార్డెన్లో అందంకోసమే పెంచుతుంటారు. క్రొత్తగా కట్టిన ఇళ్లకూ, భవంతులకూ కూడ దీన్ని దృష్టి దోషనివారణకోసం కడుతుంటారు. ఒక చిన్నమొక్కను తెచ్చి పెరట్లో నాటి అప్పుడప్పుడు కొంచెం నీళ్లు పోస్తుంటే చాలు. ఈ మొక్క ఎన్నో సంవత్సరాలు పెరుగుతూనే ఉంటుంది. వేర్ల నుంచే మళ్లీ దీనికి మొక్కలు వస్తాయి. దీనిని ఇంగ్లీషులో అలోవేరా అంటారు.
కలబంద రసం వాడకం వలన కలిగే ప్రయోజానాలు అందరికి తెలిసినవే. కలబంద రసం వలన కలిగే ప్రయోజనాలపై ఇప్పటికే చాలా మంది అవగాహన కలిగి ఉన్నారు. కలబందలో ఉండే పోషకాలు, శరీరంలో ప్రమాదాలను మరమ్మత్తులను చేస్తాయి. మన శరీరం స్వస్తతకు గురైనపుడు నయం చేయటానికి కావాల్సిన పోషకాలు అన్ని కలబంద రసంలో ఉంటాయి.

కలబంద అధిక మొత్తంలో విటమిన్ మరియు మినరల్ లను కలిగి ఉంటుంది. విటమిన్ 'A', 'C', 'E', 'B1', 'B2', 'B3', 'B6', ఫోలిక్ ఆసిడ్ మరియు కోలీన్ వంటి ముఖ్యమైన విటమిన్ లన్నిటిని కలిగి ఉంటుంది. విటమిన్ 'B12' కలిగి ఉండే కొన్ని చెట్లలో ఇది కూడా ఒకటి. అంతేకాకుండా, కాల్షియం, మెగ్నీషియం, జింక్, సెలీనియం, ఐరన్, పొటాషియం, కాపర్ మరియు మాంగనీస్ వంటి మినరల్ లను కూడా పుష్కలంగా కలిగి ఉంటుంది.
అలోవెర(కలబంద)ఆరోగ్యానికి మాత్రమే కాదు, అందానికి కూడా గొప్పగా సహాయపడుతుంది. అనేక చర్మ సంబంధిత సమస్యలకు వాడే వివిధ రకాల ఔషధాలలో అలోవెరాను ఉపయోగించారు. అందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడడంలో అలోవెరాలోని ఔషద గుణాలు చురుగ్గా పనిచేస్తాయి. చర్మాన్ని మిలమిల మెరిపించి వయసు తగ్గించి చూపే కలబంద అందానికి ఎలాంటి మేలు చేస్తుందో తెలుసుకోండి మరి.

మృతకణాలను తొలగిస్తాయి.
కలబందలో ఫాలీ సచార్డిన్స్, లెక్టిన్స్, మన్నన్ కాంపౌండ్స్ వంటి లక్షణాలుంటాయి. ఇవి చర్మంలోతుల్లోకి చొచ్చుకెళ్లి మృతకణాలను తొలగిస్తాయి.

చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.
చర్మ నిగారింపును పెంచి స్కిన్ ఎలాసిటీని మెరుగుపరుస్తుంది. కలబంద జెల్‌ను చర్మానికి నేరుగా అప్లె చేయడం వల్ల చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.

ముఖం మెరుస్తుంది.
నిమ్మరసంలో కలిపిన కలబంద జెల్‌ని ముఖానికి అప్లె చేసి అరగంట తర్వాత కడిగితే ముఖం మెరుస్తుంది.

ముఖం మీద పేరుకుపోయిన దుమ్ము, ధూళి కణాలతో పాటు, మృతకణాలు కూడా తొలగిపోతాయి.
అలోవెరా పేస్ట్‌లో తేనె కలిపి ముఖానికి మాస్క్‌లా వేసుకోవాలి. బాగా ఆరిన తర్వాత తొలగిస్తే ముఖం మీద పేరుకుపోయిన దుమ్ము, ధూళి కణాలతో పాటు, మృతకణాలు కూడా తొలగిపోతాయి.

ముడతలు పడిన చర్మం తిరిగి జీవం పోసుకుంటుంది.
బాదం నూనెలో అలోవెరా జెల్ కలిపి రాత్రి పడుకునే ముందు చర్మానికి అప్లె చేసుకుని పడుకోవాలి. ఉదయాన్నే గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి. ఇలా క్రమంగా చేస్తే ముడతలు పడిన చర్మం తిరిగి జీవం పోసుకుంటుంది.

ముఖం తెల్లబడుతుంది.
ఒక టేబుల్‌స్పూన్ బత్తాయి తొక్కల పొడిలో, నిమ్మరసం కలిపి ఆ మిశ్రమంలో టేబుల్‌స్పూన్ కలబంద గుజ్జు వేసి ఆ మిశ్రమాన్ని బాగా కలపాలి. ఈ పేస్ట్‌ని ముఖం కడుక్కుని ప్యాక్‌లా వేసుకోవాలి. అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం తెల్లబడుతుంది.



Click it and Unblock the Notifications
