Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
చర్మ సమస్యలన్నింటికి, పెరుగుతో ఫర్ఫెక్ట్ ఫేస్ ప్యాక్!
పెరుగు ఇది ఒక ప్రత్యేక ఆరోగ్యప్రయోజనాలున్న ఒక పోషకాహారం. ఇది ప్రోటీన్, కాల్షియం, రిబోఫ్లావిన్, విటమిన్ B6 మరియు విటమిన్ B12 వంటి పోషకాలను కలిగిఉంటుంది. పెరుగును యోగర్ట్ అని అంటారు. కొవ్వు తక్కువగా ఉండే పెరుగులో లాక్తోబసిల్లై అధికంగా ఉంటాయి, ఇవి పేగుల్లో సహజముగా ఉండే సూక్ష్మ జీవులు. ఇవి ప్రమాదకర బాక్టీరియాను సంహరిస్తాయి . పెరుగు కొలెస్టరాల్ ను తగ్గిస్తుంది .పెరుగు తినడం వల్ల శరీరంలో పేరుకొన్న కొవ్వు నిల్వలని అరవైశాతానాకి పైగా తగ్గించుకోవడానికి అవకాశాలున్నాయి. అంతే కాదు పొట్ట చుట్టూ ఉండే కొవ్వుని ఎనభై శాతం తగ్గించి నాజూగ్గా ఉండేందుకు సహకరిస్తుంది. అందుకే పెరుగు వాడకాన్ని పెంచుకోవాలి.

ఆరోగ్యాభివృద్ధికి పెరుగు చక్కని దివ్యౌషధం. ఎండాకాలంలో పెరుగు తినటం వలన మంచి జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. కడుపులో మంటను అరికడుతుంది. పెరుగు ప్రతిరోజు తీసుకోవడం వలన శరీరం దృఢత్వాన్ని, బలాన్ని సంతరించుకుంటుంది. బలమైన, చక్కని ఆరోగ్యానికి పెరుగు దివ్యమైనది. పెరుగులో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. పాలలో మీగడ తీయకుండా తయారయిన పెరుగు చాలా మంచిది. ఆరోగ్యంలోనే కాదు సౌందర్యంలోనూ పెరుగు ఎక్కువగా ఉపయోగపడుతుంది. పెరుగుతో ఫేస్ చిటికెలో ఫేస్ ప్యాక్ లను తయారుచేసుకోవచ్చు. అయితే పెరుగుకు ఇంట్లో ఉండే మరికొన్ని సహజ పదార్థాలను కలిపితే మరింత ఎఫెక్టివ్ ఫలితాలను ఇస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ ల వల్ల అన్ని రకాల చర్మ సమస్యలను నివారించుకోవచ్చు. పెరుగుతో కొన్ని సింపుల్ ఫేస్ ప్యాక్స్ తెలుసుకుందాం..

పెరుగు, ఆలివ్ ఆయిల్ :
పెరుగు, ఆలివ్ ఆయిల్ యాంటీ ఏజింగ్ లక్షణాలను నివారిస్తుంది. చర్మంలోని ముడుతలను పోగొట్టి, చర్మంను నునుపుగా మార్చుతుంది. ఈ ఫేస్ ప్యాక్ ను రోజు వేసుకోవచ్చు.
కావల్సినవి &ఫ్యాక్ వేసుకునే పద్దతి
2 tbsp ఆలివ్ ఆయిల్
5 tbsp పెరుగు
పైన తెలిపిన విధంగా 5 టేబుల్ స్పూన్ల పెరుగులో, 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ ను మిక్స్ చేయాలి. రెండింటిని మెడ మరియు ముఖానికి అప్లై చేయాలి. డ్రైగా మారిన తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

పెరుగు మరియు శెనగపిండి
చర్మంలో వెంటనే కాంతి రావాలంటే పెరుగు, శెనగపిండి గ్రేట్ గా సహాయపడుతుంది. పెరుగుతో బ్యూటిఫుల్ ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. శెనగిపండితో ఫేస్ ప్యాక్ చాలా సింపుల్ గా తయారుచేసుకోవచ్చు
కావల్సినవి &ఫ్యాక్ వేసుకునే పద్దతి
2 tbsp శెనగపిండి
1/2 పెరుగు
అరకప్పు పెరుగులో రెండు టేబుల్ స్పూన్ల శెనగ పిండి కలిపి, ముఖం, మెడకు ప్యాక్ వేసుకోవాలి. పూర్తిగా డ్రైగా మారిన తర్వాత ముఖం చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

పెరుగు మరియు చమోమెలీ ఎసెన్షియల్ ఆయిల్
స్కిన్ టాన్ నివారించడానికి పెరుగు, చమోమెలీ ఆయిల్ సహాయపడుతుంది. రెగ్యులర్ గా అప్లై చేయడం వల్ల చర్మంలో డార్క్ ప్యాచెస్ తొలగించుకోవచ్చు. చర్మంలో మంచి కాంతి పెరుగుతుంది.
కావల్సినవి &ఫ్యాక్ వేసుకునే పద్దతి:
4-5 చుక్కల చమోమెలీ ఆయిల్
3 ఫ్రెస్ పెరుగు
ఒక క్లీన్ బౌల్ తీసుకుని అందులో పెరుగు వేసి బీట్ చేయాలి. తర్వాత అందులోనే చమోమెలీ ఎసెన్షియల్ ఆయిల్ వేసి స్పూన్ తో మిక్స్ చేయాలి. ముఖం, మెడకు ప్యాక్ లా వేసుకుని, డ్రై అయిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి

పెరుగు మరియు తేనె
డ్రై స్కిన్, ఫ్లాకీ స్కిన్ , డల్ స్కిన్ నివారించడంలో పెరుగు మరియు తేనె కాంబినేషన్ గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది చర్మానికి కావాల్సిన హైడ్రేషన్ అందిస్తుంది.
కావల్సినవి &ఫ్యాక్ వేసుకునే పద్దతి:
1 tbsp తాజా పెరుగు
2 tsp తేనె
ఒక బౌల్లో పెరుగు, తేనె మిక్స్ చేయాలి. ఈ మిశ్రమం మరీ గట్టిగా ఉంతే పెరుగు కలుపుకోవచ్చు. ఈ ఫేస్ ప్యాక్ ను రెగ్యులర్ గా వేసుకుంటే చర్మ కాంతి పెరుగుతుంది. చర్మానికి కావల్సిన తేమ అందుతుంది.

పెరుగు మరియు పసుపు
చర్మంలో మొటిమలు మచ్చలున్నప్పుడు ఈ ప్యాక్ వేసుకోవడం మంచిది. పెరుగులో ఉండే ల్యాక్టిక్ యాసిడ్, మరియు యాంటిసెప్టిక్ లక్షణాలు చర్మానికి మంచి ఫలితాలను అందిస్తుంది.
కావల్సినవి &ఫ్యాక్ వేసుకునే పద్దతి:
1 tbsp పెరుగు
1 చిటికెడు పసుపు
పెరుగులో, కొద్దిగా పుసుపు కలపాలి, మరీ ఎక్కువైతే, చర్మం పసుపుగా మారుతుంది. ఎక్కువ కలపకుండా, పరిమితంగా మాత్రమే మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి అప్లౌ చేసి పూర్తిగా డ్రైగా మారిన తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి

పెరుగు, నిమ్మరసం
పెరుగులో ఉండే ల్యాక్టిక్ యాసిడ్, నిమ్మలో ఉండే సిట్రిక్ యాసిడ్స్ రెండు చర్మం మీద ఎఫెక్టివ్ గా పనిచేసి, చర్మంలోని మొటిమలు, మచ్చలు తొలగించి, చర్మ కాంతిని పెంచుతుంది.
కావల్సినవి &ఫ్యాక్ వేసుకునే పద్దతి:
1 tbsp పెరుగు
1 tbsp నిమ్మరసం
పెరుగు మరియు నిమ్మరసం మిక్స్ చేసి, ముఖం, మెడ, చేతులకు అప్లై చేయాలి. ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత పూర్తిగా డ్రై అయిన తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి.



Click it and Unblock the Notifications