ఎగ్ వైట్ ఫేస్ ప్యాక్ తో చర్మ సౌందర్యం రెట్టింపు..మొటిమలు, మచ్చలు మాయం..

Posted By:
Subscribe to Boldsky

మన శరీరం మొత్తం ఆరోగ్యంలో చర్మ సంరక్షణ చాలా ముఖ్యం ఎందుకంటే శరీరంలోని లోపలి అవయవాలకు రక్షణగా ఉండేది చర్మం కాబట్టి, చర్మ సంరక్షణ చాలా అవసరం. ముఖ్యంగా డైలీ స్కిన్ కేర్ కోసం ఎగ్ వైట్ ను ఉపయోగించడం వల్ల ఆయిల్ స్కిన్ నివారిస్తుంది. చర్మంలో ఏర్పడ్డ చర్మ రంధ్రాలను మాయం చేస్తుంది.

ఎగ్ వైట్ ను చర్మ సంరక్షణకు ఉపయోగించడం వల్ల స్కిన్ టోన్ మెరుగుపరుస్తుంది. ఇన్ స్టాంట్ గా స్కిన్ ఎలాటి మెరుగుపరుడుతుంది. ఎగ్ వైట్ లో ఉండే లైసోజైమ్ చర్మ సంరక్షణకు గ్రేట్ గా సహాయపడుతుంది. ఈ లైసోజైమ్ అనే ఎంజైమ్ నిరంతరం యాక్టివ్ గా ఉండి మెటిమలు , మచ్చలు, చర్మ సమస్యలకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.

ఎగ్ వైట్ ను రెగ్యులర్ గా అప్లై చేయడం వల్ల ఎండ వేడిమి వల్ల చర్మం పాడవకుండా నివారిస్తుంది. ఏజింగ్ లక్షణాలను నివారిస్తుంది. చర్మం నిండుగా కనబడేలా చేస్తుంది. దాంతో హెల్తీ అండ్ గ్లోయింగ్ స్కిన్ ను పొందవచ్చు.

మీరు గ్లోయింగ్ అండ్ హెల్తీ స్కిన్ పొందాలనుకుంటే , అందుకు ఎగ్ వైట్ ఫేషియల్ మాస్క్ లు, అన్ని చర్మ తత్వాలకు ఉపయోపడే మాస్క్ లు అందుబాటులో ఉన్నాయి...అవేంటో తెలుసుకుందాం..

ఎగ్ వైట్ మరియు తేనె ఫేస్ ప్యాక్ :

ఎగ్ వైట్ మరియు తేనె ఫేస్ ప్యాక్ :

ఒక గుడ్డు తీసుకుని అందులో ఒక ఎగ్ వైట్ వేయాలి. తర్వాత అందులో 5 స్పూన్ల తేనె మిక్స్ చేయాలి. రెండూ బాగా మిక్స్ చేసి, తర్వాత ముఖానికి మెడకు అప్లై చేయాలి. 15 నిముషాల తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఈ ఎగ్ వైట్ ఫేస్ మాస్క్ ను ముఖానికి ఉపయోగించడం వల్ల డ్రై స్కిన్ ను ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. ఇది చర్మానికి మాయిశ్చరైజింగ్ గుణాలు అందిస్తుంది.

ఎగ్ వైట్ మరియు ఆలివ్ ఆయిల్ ప్యాక్ :

ఎగ్ వైట్ మరియు ఆలివ్ ఆయిల్ ప్యాక్ :

ఒక కప్పు ఎగ్ వైట్ తీసుకుని అందులో 10 చెంచాల ఆలివ్ ఆయిల్ మిక్స్ చేయాలి. ఈ రెండు పదార్థాలు బాగా మిక్స్ అయ్యే వరకూ మిక్స్ చేసి, తర్వాత ముఖానికి అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

ఎగ్ వైట్ ఆలివ్ ఆయిల్ ఫేస్ ప్యాక్వ ల్ల డల్ అండ్ డ్రై స్కిన్ కు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చర్మంను డీప్ గా శుభ్రం చేసి కాంతివంతంగా మార్చుతుంది.

ఎగ్ వైట్ మరియు ముల్తాని మట్టి ఫ్యాక్ :

ఎగ్ వైట్ మరియు ముల్తాని మట్టి ఫ్యాక్ :

కొద్దిగా ఎగ్ వైట్ తీసుకుని, తర్వాత దీనికి ఒక టేబుల్ స్పూన్ ముల్తాని మట్టిని జోడించి , ఒక టీస్పూన్ నిమ్మరసం మిక్స్ చేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ ప్యాక్ ను ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

ఎగ్ వైట్, ముల్తాని మట్టి ఫేస్ ప్యాక్ ను ఉపయోగించడం వల్ల ఇది చర్మంలో ఎక్సెస్ ఆయిల్ ఉత్పత్తి కాకుండా నివారిస్తుంది, దాంతో అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది. ఆయిల్ స్కిన్ ఉన్నవారు ముల్తాని మట్టి, ఎగ్ వైట్ ఫేస్ ప్యాక్ ను వేసుకోవాలి.

ఎగ్ వైట్-లెమన్ ప్యాక్ :

ఎగ్ వైట్-లెమన్ ప్యాక్ :

మీరు కనుక చర్మంలో పెద్ద రంద్రాలతో బాధపడుతున్నట్లైతే ఎగ్ వైట్ అండ్ లెమన్ ప్యాక్ గ్రేట్ గా సహాయపడుతుంది. ఒక ఎగ్ వైట్ తీసుకుని,అందులో నిమ్మరసం మిక్స్ చేసి, ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఎగ్ వైట్ లెమన్ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మ రంద్రాలను క్లోజ్ చూి, టైట్ చేస్తుంది.

ఎగ్ వైట్-కొబ్బరి నూనె ప్యాక్ :

ఎగ్ వైట్-కొబ్బరి నూనె ప్యాక్ :

ఎగ్ వైట్ మరియు కోకనట్ ఆయిల్ ఫేస్ మాస్క్ చర్మాన్ని కాంతివంతంగా మార్చుతుంది. ఎగ్ వైట్ తీసుకుని అందులో కొద్దిగా కొబ్బరి నూనె మిక్స్ చేయాలి. ఇప్పుడు అందులో ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ నిమ్మరసం మిక్స్ చేయాలి. అన్ని బాగా కలిసేలా చేసి ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి.

ఎగ్ వైట్ మరియు టీట్రీ ఆయిల్ :

ఎగ్ వైట్ మరియు టీట్రీ ఆయిల్ :

ఒక బౌల్లో ఎగ్ వైట్ మరియు కొద్దిగా టీట్రీ ఆయిల్ తీసుకుని, రెండూ బాగా మిక్స్ చేయాలి. ఈ రెండింటి మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. మీకు టీట్రీ ఆయిల్ అందుబాటులో లేకపోతే, మీరు రెగ్యులర్ గా ఉపయోగించే ఆయిలే మిక్స్ చేసుకోవచ్చు. ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ ను వారంలో రెండు మూడు సార్లు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఎగ్ వైట్ మరియు మిల్క్ ఫేస్ మాస్క్ :

ఎగ్ వైట్ మరియు మిల్క్ ఫేస్ మాస్క్ :

కొద్దిగా ఎట్ వైట్ తీసుకుని, అందులో కొద్దిగా పచ్చిపాలను మిక్స్ చేసి, అలాగే అరటీస్పూన్ పసుపు , ఒక స్పూన్ లెమన్ మిక్స్ చేయాలి. ఈ రెండూ మిక్స్ చేసిన తర్వాత ముఖానికి అప్లై చేయాలి. ఈ ప్యాక్ వేసుకున్న అరగంట తర్వాత ముఖం గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ హోం రెమెడీని వారంలో రెండు మూడు సార్లు వేసుకుంటే అద్భుతమైన మార్పు ఉంటుంది. ముఖంలో అద్భుతమైన కాంతి వస్తుంది.

English summary

Different Egg White Facial Masks That Suit All Types Of Skin

Egg white is extremely beneficial to be included in your daily skin care routine. Egg white does wonders on greasy and oily skin by shrinking large-sized pores on the skin.
Story first published: Tuesday, April 4, 2017, 11:21 [IST]
Subscribe Newsletter