For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పువ్వుల్లో దాగున్న చర్మసౌందర్యం రహస్యాలెన్నో..

ఫ్లవర్స్, ఫ్లవర్ సీడ్స్ నుండి తయారుచేసిన ఆయిల్ఎక్స్ ట్రాక్ట్ బ్యూటి కోసం ఉపయోగిస్తే యంగ్ అండ్ గ్లోయింగ్ స్కిన్ తో మెరిసిపోతుంటారు.

By Lekhaka
|

పువ్వుల్లో దాగున్న చర్మసౌందర్యం రహస్యాలెంతో మధురం..

అందంగా కనిపించడం కోసం నిరంతరం ఏవో ఒకటి ముఖానికి అప్లై చేస్తుండే అమ్మాయిలను చాలా మందినే చూస్తుంటాము. ఒక్క మాటలో చెప్పాలంటే వీరిని స్కిన్ కేర్ ప్రొడక్ట్ అడిక్టర్ అని పిలవవచ్చు. చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడం కోసం ఎన్నో ప్రయోగాలను చేస్తుంటాము. అలాంటి ప్రయోగాల్లో పువ్వులు కూడా ఒకటి. పువ్వుల నుండి తీసి ఎక్స్ ట్రాక్ట్(పువ్వులను నీళ్ళలో లేదా నూనెలో ఉడికించి తీసిన రసాలు)ను అనేక బ్యూటీ ప్రొడక్ట్స్ లో ఉపయోగించడం మనం చూస్తూనే ఉంటాం..ఫ్లవర్స్, ఫ్లవర్ సీడ్స్ నుండి తయారుచేసిన ఆయిల్ఎక్స్ ట్రాక్ట్ బ్యూటి కోసం ఉపయోగిస్తే యంగ్ అండ్ గ్లోయింగ్ స్కిన్ తో మెరిసిపోతుంటారు.

Different Floral Face Masks You Should Try At Home

ఫ్లవర్ ఫేస్ ప్యాక్ ను ఉపయోగించడం వల్ల చర్మం బ్రౌట్ గా మార్చుతుంది , ఇది స్కిన్ ఎలాసిటిని పెంచుతుంది. మరి ఫ్లవర్ బెనిఫిట్స్ ను మీరు కూడా ఎంజాయ్ చేయాలని కోరుకుంటే..ఇక్కడ మీకోసం కొన్ని హోం మేడ్ ఫ్లవర్ ఫేస్ ప్యాక్స్ ఉన్నాయి. వీటిని ప్రయత్నించి ట్రైచేసి చూడండి.

రోజ్ పెటల్, గోధుమ ఫేస్ ప్యాక్

రోజ్ పెటల్, గోధుమ ఫేస్ ప్యాక్

గులాబీ చర్మానికి తేమను అందివ్వడం మాత్రమే కాదు, ఇది స్కిన్ హైడ్రేట్ చేస్తుంది. మాయిశ్చరైజ్ చేస్తుంది, హెల్తీ అండ్ గ్లోయింగ్ స్కిన్ అందిస్తుంది. గోధుమ స్కిన్ ను లైట్ గా మార్చుతుంది. చర్మాన్ని డీప్ గా ఎక్స్ ఫ్లోయేట్ చేస్తుంది. కొద్దిగా గులాబీ పువ్వు రేకులు తీసుకుని, ఎండలో ఎండబెట్టి, మెత్తగా పౌడర్ చేసుకోవాలి. గులాబీ పౌడర్ రెండు స్పూన్లు, గోధుమ పిండి రెండు స్పూన్లు తీసుకుని అందులో కొద్ది పెరుగు చేర్చి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసి డ్రైగా మారిన తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి.

మందారం మరియు పెరుగు ఫేస్ ప్యాక్

మందారం మరియు పెరుగు ఫేస్ ప్యాక్

చర్మ సౌందర్యానికి మందారం అద్భుత మార్పులు కలిగిస్తుంది. యంగర్ లుక్ ను ప్రోత్సహిస్తుంది. ఫైన్ లైన్స్ , ముడుతలను నివారిస్తుంది. కొన్ని మందారం పువ్వులు తీసుకుని, ఎండలో ఎండబెట్టాలి. దీన్ని మెత్తగా పౌడర్ చేసి, నిల్వచేసుకుని అవసరమైనప్పుడు తీసి, ఒక స్పూన్ కు మందారం పౌడర్ కు ఒక స్పూన్ పెరుగు చేర్చి పేస్ట్ లా చేయయాలి. అలాగే కొద్దిగా గందం పౌడర్ కూడా చేర్చి, మిక్స్ చేసి, ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. ఈ ప్యాక్ ద్వారా చర్మం తేమగా, కాంతివంతంగా మెరుస్తుంటుంది.

లోటస్ మరియు బాదం ఫేస్ మాస్క్

లోటస్ మరియు బాదం ఫేస్ మాస్క్

సెన్సిటివ్ స్కిన్ కు తామరపువ్వు గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది చర్మానికి తేమను అందిస్తుంది. ఎక్కువ సమయం అందంగా కాంతివంతంగా ఉంచుతుంది. చర్మ రంద్రాలను నేచురల్ గా తగ్గిస్తుంది. చర్మంలో కాంతి పెంచుతుంది. కొన్ని తామర పువ్వు రేకులు తీసుకుని, మెత్తగా పేస్ట్ చేయాలి. దీనికి కొద్దిగా పాలు మిక్స్ చేసి , బాదం పౌడర్ జోడించిన పేస్ట్ లా చేసి, ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో ముఖంను శుభ్రం చేసుకోవాలి.

మల్లెలు , మిల్క్ ఫేస్ ప్యాక్

మల్లెలు , మిల్క్ ఫేస్ ప్యాక్

మల్లెలు, మిల్క్ ఫేస్ ప్యాక్ తో చర్మం స్మూత్ గా మారుతుంది, మొటిమలను నివారిస్తుంది. ఈ కాంబినేసన్ ఫేస్ ప్యాక్ లో యాంటీ ఏజింగ్ ప్రొపర్టీస్ అధికంగా ఉంటాయి. ఫైన్ లైన్స్ ను నివారిస్తుంది. ఈ కాంబినేషన్ ప్యాక్ డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. చర్మానికి కాంతిని అందిస్తుంది. గుప్పెడు మల్లెలను తీసుకుని ఎండ బెట్టి, పౌడర్ చేసుకోవాలి. అందులో రెండు టీస్పూన్ల పాలను , రెండు స్పూన్ల ముల్తాని మట్టి, రెండు స్పూన్ల ఓట్స్ పౌడర్ ను మిక్స్ చేసి, ముకానికి మాస్క్ వేసుకోవాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

రోజ్ అండ్ మిల్క్ ప్యాక్

రోజ్ అండ్ మిల్క్ ప్యాక్

రోజ్ అండ్ మిల్క్ ఫేస్ ప్యాక్ సెన్సిటివ్ స్కిన్ కు అద్బుతంగా సహాయపడుతుంది. రోజ్ , మిల్క్ ఫేస్ ప్యాక్స్ చర్మంలోకి డీప్ గా వెళ్లి స్కిన్ శుభ్రం చేస్తుంది. మూసుకుపోయిన చర్మ రంద్రాలను శుభ్రం చేసి, తిరిగి క్లోజ్ అయ్యేందుకు సహాయపడుతుంది. ఈ రెండింటి కాంబినేషన్లో వసుకున్న ప్యాక్ ను అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. గులాబీ రేకులు ఫ్రెష్ గా ఉన్నవి తీసుకుని పాలు చేర్చి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దీన్ని ఫేస్ మాస్క్ గా వేసుకుని, అరగంట తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి.

మారిగోల్డ్ మరియు రోజ్ ఫేస్ మాస్క్

మారిగోల్డ్ మరియు రోజ్ ఫేస్ మాస్క్

కొన్ని బంతిపూల రేకులు తీసుకుని, గులాబీ రేకులు కొన్ని తీసుకుని రెండింటి మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ కు రెండు స్పూన్ల పెరుగు చేర్చి, ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా మరియు తేమగా మారుతుంది..

English summary

Different Floral Face Masks You Should Try At Home

Using flower face packs helps to brighten up your skin and also improves the skin's elasticity. If you want to enjoy the benefits of flowers, here are some homemade flower packs you should try at home. Take a look.
Desktop Bottom Promotion