Latest Updates
-
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.!
DIY: వర్షాకాలంలో డ్రై స్కిన్ నివారించే హోం రెమెడీస్
ప్రస్తుతం వర్షా కాలం. వాతావరణంలో తడి లేదా తేమ ఎక్కువగా ఉండటం వల్ల మన దినచర్య గండంగా మారుతుంది. ఎందుకంటే ఈ తడి వాతావరణంలో ఇన్ఫెక్షన్స్ త్వరగా వ్యాప్తి చెంది త్వరగా జబ్బు పడేలా చేస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో జుట్టు మరియు చర్మ సమస్యలు అధికంగా ఉంటాయి. చర్మ తర్వగా డ్రైగా మారుతుంది.
వాతావరణంలో, ఉష్ణోగ్రతలో వచ్చే అకస్మిక మార్పులు వల్ల చర్మంలో మార్పులు సహజంగా వస్తుంటాయి. చలికాలంలో కానీ, వర్షాకాలంలో కానీ డ్రై స్కిన్ సమస్యలు ఎక్కువ. వర్షాకాలంలో చర్మం త్వరగా డ్రైగా మారుతుంది. పొడి బారడంతో పాటు, దురద కూడా ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి, ఈ రోజుల్లో చర్మం గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.

చర్మం పాడవడానికి ఎండాకాలం కాదు, వర్షాకాలమే కదా అని చాలా మంది సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ అప్లై చేయకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే వర్షాకాలంలో కూడా చర్మానికి మాయిశ్చైరజర్ అవసరం అవుతుంది. ఇది చర్మానికి రక్షణ కల్పిస్తుంది. సన్ స్క్రీన్ కేవలం ఎండకాలంలోనే కాదు, వర్షాకాలంలో కూడా అవసరవం అవుతుంది.
వర్షకాలంలో చర్మ సంరక్షణ కోసం ఇంట్లోనే కొన్ని మాయిశ్చరైజర్స్ ను స్వయంగా, సులభంగా తయారుచేసుకోవచ్చు. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చర్మానికి సురక్షితమైనవి. అయితే ఆ హోం మేడ్ మాయిశ్చరైజర్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం..

1) బట్టర్ మాస్క్:
పొడిబారిన చర్మానికి బట్టర్ మాస్క్ చాలా ఉత్తమైనది.
కావల్సిన పదార్థాలు:
- 1 టీస్పూన్ మృదువుగా ఉండే వెన్న తీసుకోవాలి.
- 1 టీస్పూ వాటర్ తీసుకోవాలి
తయారుచేసే పద్ధతి :
1) బట్టర్ అండ్ వాటర్ రెండూ మిక్స్ చేసి మిక్సీలో వేసి బ్లెండ్ చేసి, ముఖానికి ప్యాక్ లా అప్లై చేయాలి.
2) ప్యాక్ వేసుకుని ఒక 15-20నిముషాలు డ్రైగా మారే వరకూ ఉండాలి.
3) తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

2) అవొకాడో మాస్క్ :
పండ్లలో ఇది ఒక ఆరోగ్యకరమైన పండు, ఇది ముఖానికి మాయిశ్చరైజర్ గా గ్రేట్ గా పనిచేస్తుంది. దీనికి తేనె మిక్స్ చేయడం వల్ల, ఇందులో ఉండే మాయిశ్చరైజింగ్, యాంటీసెప్టిక్ లక్షణాలు ఉండటం వల్ల సూపర్ ఎఫెక్టివ్ మాస్క్ గా పనిచేస్తుంది.
కావల్సిన పదార్థాలు:
- 1 బాగా పండిని అవొకాడో
- 1 ఒక టేబుల్ స్పూన్ ఆర్గానిక్ హనీ
తయారుచేయు విధానం:
1) అవొకాడో తీసుకుని, మెత్తగా పేస్ట్ చేయాలి.
2) ఈ పేస్ట్ కు ఒక టేబుల్ స్పూన్ తేనె కలపాలి.
3) ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేయాలి.
4) అప్లై చేసిన 15 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

3) ఆలివ్ ఆయిల్ మరియు షుగర్ స్ర్కబ్
ఆలివ్ ఆయిల్లో అనేక బ్యూటీ బెనిఫిట్స్ ఉన్నాయి. అందువల్ల ఇది అందాన్ని పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. బ్రౌన్ షుగర్ లో తేమ స్వభావం అధికంగా ఉండటం వల్ల చర్మానికి మాయిశ్చరైజింగ్ గుణాలను అందిస్తుంది. వర్షాకాలంలో ఇది చర్మానికి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది.
కావల్సిన పదార్థాలు :
- 4 టేబుల్ స్పూన్ల బ్రౌన్ షుగర్
- 1 టేబుల్ స్పూన్ తేనె
- 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్
తయారుచేయు విధానం:
1) పైన సూచించిన విధంగా పదార్థాలన్నింటిని మిక్స్ చేయాలి.
2) ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి స్క్రబ్ చేయాలి. తర్వాత దీన్ని సర్క్యులర్ మోషన్ లో మర్దన చేయాలి.

4) పెరుగు మరియు బొప్పాయి చికిత్స:
పెరుగు అద్భుతమైన స్కిన్ హైడ్రేటింగ్ ఏజెంట్. ఇందులో యాంటీఆక్సిడెంట్స్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉన్నాయి. బొప్పాయి చర్మానికి మంచి గ్లో ఇస్తుంది.
కావల్సిన పదార్థాలు:
- అరకప్పు పెరుగు
- 3 టేబుల్ స్పూన్ల బొప్పాయి పేస్ట్
- 2 చుక్కల తేనె
- 5-6 చుక్కల నిమ్మరసం
తయారుచేయు విధానం:
1) ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో నిమ్మరసం, పెరుగు వేసి మిక్స్ చేయాలి.
2) తర్వాత ఇందులో తేనె మరియు బొప్పాయి వేసి మిక్స్ చేయాలి.
3) ఈ మిశ్రమాన్ని చర్మానికి ప్యాక్ లా వేసుకోవాలి.
4) 20 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. దీన్ని వారానికొకసారి అప్లై చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

5) గుడ్డులోని పచ్చసొన, మరియు ఆరెంజ్ జ్యూస్ ట్రీట్మెంట్ :
గుడ్డులోని పచ్చసొన గ్రేట్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. ఆరెంజ్ జ్యూస్ లో విటమిన్స్ అధికంగా ఉంటాయి. ఈ ఫేస్ ట్రీట్మెంట్ వల్ల చర్మంలో అద్భుత మార్పులు వస్తాయి.
కావల్సిన పదార్థాలు:
- 1 గుడ్డు పచ్చసొన
- 1 టేబుల్ స్పూన్ ఆరెంజ్ జ్యూస్
- 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్
- కొద్దిగా రోజ్ వాటర్
తయారుచేయు విధానం:
1) పైన సూచించిన పదార్థాలన్నింటిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసి మిక్స్ చేయాలి.
2) ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి.
3) 15 నిముషాల తర్వాత గోరువెచ్చని నీళ్ళతో శుభ్రం చేసుకోవడం వల్ల చర్మం సాప్ట్ గా మరియు సపెల్ గా మరియు స్మూత్ గా తయారవుతుంది.
పొడి చర్మంను నివారించడంలో ఈ న్యాచురల్ రెమెడీస్ గ్రేట్ గా సహాయపడుతాయి. వీటితో పాటు మీ చర్మతత్వాన్ని బట్టి ఫేస్ వాష్ ఎంపిక చేసుకుని ఉపయోగించాలి.
వీటితో పాటు రెగ్యులర్ డైట్ ఫ్రూట్స్ చేర్చుకోవాలి. ఆల్కహాల్, స్మోకింగ్ వంటివి మానేయాలి. ఎక్కువ సమయం ఎండలో తిరగకపోవడం మంచిది.



Click it and Unblock the Notifications
