Latest Updates
-
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.!
మగవారి ముఖ సౌందర్యానికి 5 సులువైన చిట్కాలు
మగువలు ఎలా అయితే తమ మొహాన్ని అందంగా సంరక్షించుకుంటారో అదే విధంగా మగవాళ్లు తమ ముఖ సౌందర్యంపై దృష్టిసారించాలి. అయితే ఇదంతా చాలా సమయాన్ని తినే వ్యవహరంగా భావించి నిర్లక్ష్యం చేసేస్తున్నారు. మళ్లీ వీళ్లే మొహంపై ఒక్క మచ్చ, గాటు, మొటిమ కనిపిస్తే చాలు లబోదిబోమంటూ మొత్తుకుంటారు.
మొహాన్ని సంరక్షించే విధానం ఒక్క రోజులో జరిగే పని కాదు. తాజా కాంతివంతమైన ఆరోగ్యకర ముఖ వర్చస్సు కోసం ప్రతి రోజు మొహన్ని సంరక్షిస్తుండాలి.
రోజు మొహాన్ని శుభ్రంగా ఉంచుకోవడం వల్ల మొటిమలు, ర్యాషెస్ ఏర్పడకుండా ఉంటాయి. సరైన పోషకాలు అందుతుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది.
కాబట్టి ప్రియమైన మగమహారాజులారా! ఇక్కడ చెప్పే చిట్కాలను ప్రతిరోజూ పాటించి తొలి చూపులోనే మంచి ముద్ర వేసుకునేలా చూడండి.

1. సరైన ముఖ సంరక్షణ ఉత్పత్తుల ఎంపిక
మగవాళ్లు మొహానికి సంబంధించి క్లెన్సర్, స్క్రబ్బర్, మాయిశ్చరైజర్ లాంటివెన్నో వాడవచ్చు. అయితే వీటిల్లో ఆల్కహాల్, డై, హానికర పరిమళాలు లాంటివెన్నో ఉండవచ్చు. ఇలాంటివి లేని ఉత్పత్తులను ఎంచుకోవడం మంచిది. రెండు ఉత్పత్తులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. అవి ఆఫ్టర్ షేవ్ మరొకటి ఫోమ్ ఉన్న షేవింగ్ క్రీమ్. ఆఫ్టర్ షేవ్ లోషన్‌లో గాఢమైన పరిమళాలుంటాయి. అవి చర్మానికి హాని చేస్తాయి. ఇక ఫోమ్ ఉన్న షేవింగ్ క్రీమ్ బాహ్యా చర్మాన్ని పొడిబారేలా చేస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే హానికారక కెమికల్స్ ఉన్నవాటికి దూరంగా ఉండాలి.

2. మగవారికి ప్రత్యేకమైనవే...
చాలా మంది మగవాళ్లకి చర్మ సంరక్షణ అనగానే అమ్మాయిలు వాడే రకరకాల క్రీములు, టోనర్లు, మాయిశ్చరైజర్లు వాడాలని చూస్తుంటారు. ఇది చర్మంపై ప్రభావం చూపించగలదు. అమ్మాయిల కోసం రూపొందించిన కాస్మొటిక్స్ వాళ్ల కోసమే ఉద్దేశించిందై ఉంటుంది. అది మీ చర్మానికి సరిపడకపోవచ్చు. స్కిన్ అలర్జీలు వచ్చినా రావచ్చు. కాబట్టి మగవారికోసమే ప్రత్యేకమైన చర్మ సౌందర్య ఉత్పత్తులను వాడడం మంచిది.

3. గ్లైకోలిక్ యాసిడ్
మంచి సంరక్షణ పాటించే మగవాళ్లు తమ మొహాన్ని ఉదయం లేవగానే రాత్రి పడుకోబోయే ముందు కడుక్కుంటారు. ఇది చాలా మంచి అలవాటు కూడా. కేవలం నీళ్లతో మొహాన్ని కడగకుండా కాస్త గ్లైకోలిక్ యాసిడ్ వాడి చూస్తే ఆరోగ్యకర చర్మం సొంతమవుతుంది. నేరుగా చర్మంపై గ్లైకోలిక్ యాసిడ్ వాడటం ఇష్టంలేనివారు గ్లైకోలిక్ యాసిడ్ కలగలిసిన క్లెన్సర్ ను వాడవచ్చు.

4. మొహానికి, శరీరానికి ఒకటేనా...
మొహానికి శరీరంలోని మిగతా భాగాల అవసరాలు వేరువేరుగా ఉంటాయి. బాడీ లోషన్‌ను మొహానికి రాస్తే సూక్ష్మ రంధ్రాలు మూసుకుపోయే ప్రమాదముంది. కాబట్టి మొహానికి ఫేస్ క్రీమ్ లేదా మాయిశ్చరైజర్‌ను మెడ దాకా రాసుకోవాలి. ఇక మిగతా భాగాలకు బాడీ లోషన్ పూసుకోవాలి. అన్నింటికి ఒకే క్రీమ్ వాడతామంటే తప్పుడు ట్రాక్‌లో పడుతున్నట్టే లెక్క.

5. పొడిబారకుండా చూసుకోవాలి...
మొహాన్ని ఎంత బాగా కడిగినా, మంచి ఫేస్ క్రీమ్ వాడినా సరే ముఖం పొడిబారినట్టు రఫ్ గా కనిపిస్తుంటుంది. మొహానికి అందాల్సిన తేమ శాతం అందకపోవడమే దీనికి కారణం. మీరు మాయిశ్చరైజర్ వాడే విధానం తప్పు కావొచ్చు. ముఖం కాస్త తడిగా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్‌ను పూసుకోవాలి. అప్పుడే అది కాస్త ఎక్కువ సేపు ఉండిపోతుంది. పొడి మొహంపైన అది పూసుకుంటే ఫలితం ఎక్కువ సేపు ఉండదు.



Click it and Unblock the Notifications
