Latest Updates
-
లంచ్ బాక్స్ కైనా, లైట్ డిన్నర్ కైనా ది బెస్ట్ ఆప్షన్.. నిమిషాల్లో రెడీ అయ్యే అవకాడో చికెన్ సలాడ్ -
బీపీని తరిమికొట్టే 5 సూపర్ ఫుడ్స్.. ఇక మందులతో పనిలేదు! -
సాయంత్రానికి నోరూరించే జొన్న పకోడీ..మామిడికాయ పచ్చడితో తింటే ఆ రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
వేడిని తగ్గించే కీర దోసకాయతో.. నోరూరించే కొరియన్ కిమ్చి..ఈజీగా చేసేయండిలా.. -
ఫిట్స్ వస్తే చేతిలో తాళాలు పెడుతున్నారా? అయితే ఈ షాకింగ్ నిజం తెలుసుకోండి! -
నోరూరించే వంకాయ పచ్చి కారం..వేడి అన్నంతో తింటే అద్భుతో అద్భుత అద్భుతసహ్య.. -
ఎముకలను ఉక్కులా మార్చే రాగి నువ్వుల లడ్డూ..15 నిమిషాల్లో ఎలా చేసుకోవాలంటే.. -
వృషభం, మిథునం, సింహ రాశుల వారికి ఈ వారం ధన యోగం.. మీ అదృష్టం ఎలా ఉంది? - 17 నుండి 23 మే 2026 వరకు -
వృషభం, సింహం, ధనస్సు రాశుల వారికి రాజయోగం.. ఆదివారం మీ అదృష్టం ఎలా ఉంది? - ఆదివారం, 17 మే 2026 -
Chilkur Balaji Temple: వీసా మాఫియా గుడి.. చిలుకూరు బాలాజీ ఆలయంపై ట్రంప్ పార్టీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
కాస్మొటిక్ అలర్జీలను దూరం చేసుకోండిలా !
అందమంటే ఆడవారికి ఎంతో ఇష్టం. దాన్ని మరింత పెంచుకునేందుకు కాస్మొటిక్స్ ఎక్కువగా ఉపయోగింటారు. అలాగే కొందరు సౌందర్యాన్ని మరింత రెట్టింపు చేసుకునేందుకు బ్యూటీ పార్లర్లను ఎక్కువ ఆశ్రయిస్తుంటారు. దీని వల్ల సౌందర్యం పెరుగుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో అది ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది.
లిప్ స్టిక్, స్కిన్ క్లీనర్, ఐషాడో, లోషన్స్ ఇలా మొదలైన వాటిని తరుచు మగువలు ఉపయోగిస్తుంటారు. అయితే అందాన్ని ఎంత పెంచుతాయో అంతేవిధంగా అలెర్జీకి కూడా కారణం అవుతాయి.
అయితే మీరు కొన్ని చిట్కాలు పాటిస్తే ఈజీగా ఈ సమస్యకు పరిష్కారం పొందొచ్చు. మీ ఇంట్లో దొరికే ఔషదాలు, పదార్థాల ద్వారా మీరు ఉపశమనం పొందొచ్చు.
అయితే వీటిలో కూడా కొందరి చర్మాలకు కొన్ని పడవు. అందువల్ల మీ చర్మానికి సూటయ్యే వాటినే మీరు ఎంచుకోండి.

కలబంద
కలబంద అనేది మనకు పరిచయం అవసరం లేని మొక్క. సౌందర్య ఉత్పత్తులలోను, ఆయుర్వేద వైద్యంలోను దీనిని ఎక్కుగా ఉపయోగిస్తున్నారు. ఇది ఒక మంచి ఔషధ మొక్క. ఇది చర్మంపై మంచి ప్రభావం చూపుతుంది. ఒక కలబంద మొక్క నుంచి జెల్ ను బయటకు తీయండి. ఆ కలబంద రసంతో మీకు ఎక్కడైతే కాస్మొటిక్ అలర్జీ ఉందో అక్కడ పూయండి. దీని ద్వారా మీ సమస్యకు ఈజీగా పరిష్కారం లభిస్తుంది.
అలాగే కలబంద గుజ్జుకు తగినంత పసుపును జోడించి ముఖానికి ఫేషియల్ చేసుకుని 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖంపై పేరుకున్న మురికి తొలగిపోయి ముఖం కాంతివంతం అవుతుంది.

రోజ్ వాటర్
రోజ్ వాటర్ తో అనేక ప్రయోజనాలున్నాయి. ఈ సువాసనభరితమైన ద్రవంలో ఔషధ, సౌందర్య గుణాలు పుష్కలంగా ఉన్నాయి . రోజ్ వాటర్ లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. అలాగే యాంటీ సెప్టిక్, యాంటీబ్యాక్టిరియాలో లక్షణాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. రోజ్ వాటర్ అన్ని రకాల చర్మ సంరక్షణకు సహాయపడుతుంది. మీ చర్మంపై ఎక్కడైతే ఎలర్జీ ఉంటుందో అక్కడ దీన్ని అప్లయ్ చేయండి. దీంతో మీకు వెంటనే ఉపశమనం కలుగుతుంది.

కొబ్బరి నూనె
కొబ్బరి నూనెను మనం సంప్రదాయంకంగా ఇళ్లలో ఉపయోగస్తూనే ఉంటాం. కాస్మొటిక్ ఎలర్జీలను నివారించేందుకు కొబ్బరి నూనె బాగా ఉపయోగపడుతుంది. చర్మంపై వచ్చే దురదలకు ఇది ఒక మంచి ఔషధంగా పని చేస్తుంది. అలెర్జీ ఉన్న చోట దీన్ని రాస్తే మీకు వెంటనే ఉపశమనం కలుగుతుంది. కాబట్టి ఎలర్జీ ఉన్న ప్రాంతాల్లో మీరు మొదట దీన్ని అప్లయ్ చేయండి.

ఐస్ క్యూబ్స్
మీరు నిత్యం ఉపయోగించే కాస్మొటిక్స్ వల్ల చాలా ఇబ్బందులుపడుతుంటారు. ఐస్ క్యూబ్స్ కాస్మోటిక్ అలర్జీలను దూరం చేస్తాయి. అయితే మీ ఎక్కడైతే మీకు అలెర్జీగా ఉంటుందో ఆ ప్రాంతంలో ఐస్ క్యూబ్స్ పెట్టుకోవడం వల్ల మీరు వెంటనే ఉపశమనం పొందవచ్చు. అలాగే మీరు ఆ సమయంలో మంచి ప్రశాంతతను పొందుతారు.

విటమిన్ ఈ ఆయిల్
చర్మానికి ఎన్నో ప్రయోజనాలు కలిగించే యాంటీఆక్సిడెంట్స్ విటమిన్ ఈ ఆయిల్ లో ఉంటాయి. చర్మంపై ఎక్కడైతే అలెర్జీ ఉంటుందో ఆ ప్రాంతంలో విటమిన్ ఈ ఆయిల్ ని అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. విటమిన్ 'ఈ' చర్మాన్ని మృదువుగా మార్చుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అలాగే విటమిన్ "ఈ" క్యాప్సుల్స్ కూడా ఉపయోగించొచ్చు.

ఆలివ్ నూనె
అన్ని రకాల చర్మ సంబంధ సంబంధిత అలెర్జీలకు కొన్ని శతాబ్దాలుగా ఆలివ్ నూనెను ఉపయోగిస్తున్నారు. కొద్దిగా ఆలివ్ నూనెను మీ చర్మంపై అప్లయ్ చేస్తే చాలు.ఇది చర్మం లోపలి పొరల్లోకి వెళ్లి పోషణనందిస్తుంది. ఫలితంగా చాలా తక్కువ సమయంలోనే చర్మంలో మార్పు కనిపిస్తుంది. మీ కాస్మొటిక్ ఎలర్జీని ఆలివ్ నూనె ఈజీగా దూరం చేస్తుంది.

గంధపు పొడి
చర్మానికి మేలు చేసే సుగుణాలెన్నో గంధం పొడిలో ఉన్నాయి. చర్మఛాయను మెరుగుపరచడంతో అలర్జీలను కూడా ఇది దూరం చేస్తుంది. అలాగే ముఖం తాజాగా కనపడేలా చేస్తుంది.
ఒక టీ స్పూన్ గంధం పొడి, అలాగే రోజ్ వాటర్ తీసుకుని ఆ రెండింటిని బాగా మిక్స్ చేయాలి. దాన్ని ఎక్కడైతే అలర్జీ ఉంటుందో అక్కడ అప్లై చేయండి. 15 నిమిషాల పాటు దాన్ని అలాగే ఉంచండి. తర్వాత చల్లటి నీటిలో కడిగేయండి. ఇది మంచి ఫలితాన్ని అందిస్తుంది.

తేనె
తేనె అలెర్జీ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. బ్యాక్టీరియాను నాశనం చేసే గుణాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. మీకు ఎక్కడైతే బాగా అలర్జీగా ఉంటుందో ఆ ప్రాంతంలో కాస్త తేనే పూయండి. దీని ద్వారా మంచి ఫలితం ఉంటుంది.

పెరుగు
పెరుగు అలెర్జీల నుంచి బాగా రక్షిస్తుంది. ఇది మనకు వెంటనే ఇంట్లో దొరికే పదార్థం. మీకు ఎక్కడైతే అలెర్జీ ఉంటుందో ఆ ప్రాంతంలో దీన్ని పూయండి. దీంతో మీకు చాలా లాభాలుంటాయి. పెరుగును మీరు అప్లై చేశాక 10 నిమిషాలు దాన్ని అలాగే ఉంచండి. తర్వాత మీరు దాన్ని చల్లని నీటితో కడిగివేయండి. దీంతో మీకు ఉపశమనం కలుగుతుంది.

దోసకాయ ముక్కలు
దోసకాయ చర్మానికి చాలా మంచిది. ఎక్కడైతే మీకు అలర్జీ ఉంటుందో ఆ ప్రాంతంలో దోసకాయ ముక్కలతో కాస్త మసాజ్ చేసినట్లయితే మీరు త్వరితగతిన ఉపశమనం పొందుతారు. దీంతో మీరు దురద సమస్య నుంచి బయటపడొచ్చు. దోసకాయను ముక్కలుగా కత్తిరొంచుకుని ఎక్కడైతే దురదగా ఉందో ఆప్రాంతంలో కొద్ది సేపు ఉంచండి. కొద్దిసేపయ్యాక వాటిని తీసేయండి. దీంతో మీరు చాలా హ్యాపీగా ఫీలవుతారు.



Click it and Unblock the Notifications