మీ ముఖంపై ఎట్టి పరిస్థితిలో ఉపయోగించకూడని ఆర్డినరీ వస్తువులు

By Y. Bharat Kumar Reddy
Subscribe to Boldsky

ముఖం మన అందానికి కేంద్రంగా.. భావోద్వేగవ్యక్తీకరణకు కేరాఫ్ గా ఉంటుంది. ఎదుటి వ్యక్తులు అవతలి వారిలో మొదట చూసేది ఫేసే కదా. అలాంటి ముఖాన్ని అందంగా ఉంచుకోవాలని అందరూ తాపత్రయపడుతుంటారు. ఆ తలంపుతో కొన్ని తప్పులు కూడా చేస్తుంటారు. ముఖం అందాన్ని పాడుచేసేవి చాలానే ఉంటాయి.

మనకు తెలియకుండానే ఈ విషయంలో తప్పులు చేస్తుంటాం. శరీరానికో, జుట్టుకో ఉపయోగించే సౌందర్య చిట్కాలను ముఖంపై ప్రయోగిస్తుంటాం. ఎంతో సున్నితమైన కణాలు కలిగి ఉండే ఫేస్ మరి వాటిని తట్టుకోగలుతుందా అని ఆలోచించం. వేటిని పడితే వాటిని రుద్దేస్తూ ఉంటాం.

మహిళల బ్యూటీ కిట్ లో ఉండాల్సిన కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్

అలా చేస్తే ఎన్నో దుష్ర్పభావాలుంటాయో తెలిస్తే షాక్ అవుతారు. మీ ముఖ చర్మాన్ని పాడు చేసే ఈ 11 విషయాల గురించి ఒకసారి తెలుసుకోండి.

1. షాంపూ

1. షాంపూ

మన శరీరంలో జుట్టు, ముఖం కాస్త విభిన్నంగా ఉంటాయి. హెయిర్ ను ఆయిల్, దుమ్ము ధూళి వంటి వాటి నుంచి సంరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరికీ బలమైన సర్ఫ్యాక్టెంట్లు అవసరమవుతాయి. అలాగే ముఖం కాంతివంతంగా మారడానికి కాస్త సున్నితమైన పదార్థాలు అవసరం అవుతాయి. ఎంతో సున్నితంగా ఉండే ముఖాన్ని షాంపూల ద్వారా శుభ్రం చేసుకోవడం మంచిది కాదు. ఒకవేళ మీరు ముఖం కడుక్కోవడానికి షాంపూని ఉపయోగించి మీ ముఖకాంతి మొత్తం పోతుంది. ఫేస్ మొత్తం పొడిబారుతుంది. అలాగే మీరు జుట్టును షాంపూతో శుభ్రం చేసుకునే సమయంలో అది మీ ముఖానికి తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా చేస్తే మీ ముఖంలోని తేమ తగ్గదు. కాంతివంతంగా ఉంటుంది.

2. జుట్టుకు వేసుకునే రంగు

2. జుట్టుకు వేసుకునే రంగు

జుట్టుకు రంగే వేసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని మనలో అందరికీ తెలిసిందే. అది ముఖానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అంటుకోకుండా చూసుకోవాలి.

ఎందుకంటే హెయిర్ కలర్ లో చాలా రసాయనాలుంటాయి. అవి చర్మానికి చాలా హాని కలిగిస్తాయి. ఇక కొందరేమో వారి జుట్టు ఏ రంగులో ఉంటుందో అలాగే కనుబొమ్మలు కూడా ఉండాలని కోరుకుంటారు. అయితే మీరు జుట్టుకు ఉపయోగించే కలర్ కాకుండా ప్రత్యేకంగా కనుబొమ్మల కోసం ఎలాంటి హాని కలిగించని రంగు సిద్ధం చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీ చర్మం రసాయనాల బారినపడకుండా ఉంటుంది. వీలైనంత వరకు వెజిటేబుల్స్ డైలు ఉపయోగించడం ఉత్తమం. ఇక బాక్స్ డైస్ వల్ల మీరు చాలా ఇబ్బందులుపడాల్సి వస్తుంది. కళ్లు మండుతాయి. అలాగే కళ్ల నుంచి నీరు కూడా వస్తుంది. అందువల్ల కనుబొమ్మలకు రంగు వేయాలనుకుంటే మాత్రం హానీ కలిగించని నేచరల్ కలర్స్ వినియోగించండి.

3. హెయిర్ సెరమ్

3. హెయిర్ సెరమ్

ఇతర కాస్మోటిక్స్ మాదిరిగానే హెయిర్ సెరమ్ కూడా చర్మానికి హాని చేసే గుణాలు కలిగి ఉంటుంది. హెయిర్ సెరమ్ లో సిలికాన్ ఉండటం వల్ల ఇది జుట్టును షైనింగ్ చేస్తుంది. అయితే ఇది చర్మానికి తగిలితే మాత్ర చాలా ఇబ్బందులుపడాల్సి వస్తుంది. మీ వెంట్రుకలకు ఇది బాగా ఉపయోగపడొచ్చు కానీ మీ చర్మానికి మాత్రం చాలా ఎక్కువగా హాని చేస్తుంది. అందువల్ల దీన్ని ఉపయోగించేటప్పుడు చర్మానికి, (తలపై కూడా) ఎక్కడ తగలకుండా జాగ్రత్తపడాలి.

4. హెయిర్ స్ప్రే

4. హెయిర్ స్ప్రే

చాలామంది హెయిర్ స్ప్రే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే వీటిని మీ ముఖంపై ఎప్పుడూ కూడా స్ప్రే చేసుకోకూడదు. ఎందుకంటే వీటిలో అనేక ఆల్కహాల్స్, రసాయనాలుంటాయి. దీనివల్ల మీ చర్మం పొడిబారుతుంది. కాంతిహీనంగా మారుతుంది. ఈ స్ప్రే పొరపాటున చర్మంపై పడ్డా అక్కడ వాపు రావడం లేదా ఎర్రగా మారడం జరుగుతుంది. చర్మానికి హాని కలిగించే అనేక రసాయనాలు ఇందులో ఉండడమే కారణం.

5. బాడీ లోషన్స్

5. బాడీ లోషన్స్

మన శరీరంలోని ఒక్కోపార్ట్ సౌందర్యాన్ని పరిరక్షించుకునేందుకు వివిధ రకాల లోషన్స్ అవసరం అవుతాయి. అందుకోసం మార్కెట్లో కూడా రకరకాల, విభిన్నమైన ప్రాడక్ట్స్ లభిస్తాయి. వాటన్నింటిని మనం రోటిన్ లైఫ్ లో ఉపయోగిస్తూనే ఉంటాం. అయితే బాడీ లోషన్స్ ను ముఖ సౌందర్యం కోసం ఉపయోగించవచ్చని కొందరు అనుకుంటారు. ఇది చాలా తప్పు. అలా చేయడం వల్ల ఫేస్ పై ఉండే సున్నితమైన కణాలు దెబ్బతింటాయి. బాడీ లోషన్లు కాస్త ఎక్కువ సువాసనలతో కాస్త ఘాటుగా ఉంటాయి. వాటిని తట్టుకునే గుణం మీ ముఖంపై ఉండే చర్మానికి ఉండదు. ఫేస్ కోసం కేవలం స్మూత్ నెస్ ఇచ్చే క్రీమ్స్ మాత్రమే ఉపయోగించాలి. మీరు ఒకవేళ బాడీ లోషన్స్ ను ఫేస్ క్లీన్ చేసుకోవడానికి వినియోగిస్తుంటే వెంటనే మానుకోండి.

6. పాదాలకు ఉపయోగించే క్రీమ్స్

6. పాదాలకు ఉపయోగించే క్రీమ్స్

ఎవరైనా పాదాలకు ఉపయోగించే క్రీమ్స్ ఫేస్ కు పూసుకుంటారా ? అని మీరనుకోవొచ్చు. కానీ అలా చేసే వారు కూడా ఉంటారు. కాంతిహీనంగా ఉండే కాళ్లే అంత అందంగా తయారైతే మరి ముఖం ఎంత కాంతివంతంగా తయారవుతుందో అని ప్రయోగించే వాళ్లుంటారు. ఇలాంటి క్రీముల్లో కాస్త రసాయనాలు ఎక్కువగా ఉంటాయి. అవి మృత కణాలకు జీవం పోయడానికి ప్రత్యేకంగా తయారు చేసే ఇటువంటి క్రీమ్స్ ముఖంలోని సున్నితమైన కణాల్ని దెబ్బతీస్తాయి. అందువల్ల కాళ్లకు ఉపయోగించే క్రీమ్స్ కాళ్లకే ఉపయోగించండి.

గర్భధారణ సమయంలో నివారించవలసిన 6 బ్యూటీ ఉత్పత్తులు

7. డియోడొరెంట్

7. డియోడొరెంట్

డియోడొరెంట్స్ ను సాధారణంగా చంకల్లో చెమటను, దుర్గంధాన్ని తొలగించుకునేందుకు ఉపయోగిస్తారు. కానీ దీన్ని కూడా కొందరు ముఖానికి ఉపయోగిస్తారు. ఇలా చేయడం వల్ల చాలా ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. మీ ముఖ చర్మానికి ఎక్కువగా గాలి అవసరం. ఒకవేళ మీరు దీన్ని మీ ఫేస్ పై ఉపయోగించనట్లయితే అది ముఖంలోని చర్మ కణాలకు అవసరమయ్యే గాలి అందనివ్వకుండా చేస్తుంది. అందువల్ల వీటిని ముఖంపై ఎప్పుడు కూడా వినియోగించకండి.

8. నెయిల్ పాలిష్

8. నెయిల్ పాలిష్

నెయిల్ పాలిష్ అస్సలు ముఖంపై ఉపయోగించకూడదు. ఇది యాక్రిలిక్ అణువులను కలిగి ఉంటుంది. దీన్ని పొరపాటును చర్మానికి పూసుకుంటే మీ స్కిన్ మొత్తం పొడిబారుతుంది. ఒకవేళ ముఖానికి ఏదైనా రంగు పూసుకోవాలనుకుంటే మీరు అందుకోసం ప్రత్యేకంగా తయారు చేసిన రంగులను ఉపయోగించాలి. ప్రయోగాలు చేయడం మంచిదే కానీ ముఖానికి సంబంధించిన విషయాల్లో ఇలాంటి ప్రయోగాలు చేస్తే మాత్రం ఇబ్బందులుపడాల్సి వస్తుంది.

9. మయోన్నైస్

9. మయోన్నైస్

ఇది మీ జుట్టుకు బాగా ఉపయోగపడుతుది. కానీ ముఖానికి మాత్రం దీన్ని ఉపయోగించకూడదు. ఎందుకంటే ఇందులో ఉంటే ఆమ్లజని ముఖంపై ఉండే చర్మ రంధ్రాల మూసి వేస్తుంది. దీంతో కణాలకు గాలి అందదు. కాబట్టి మీ ముఖ చర్మంపై ఎట్టి పరిస్థితుల్లోనూ మయోన్నైస్ ను ఉపయోగించకండి.

10. వెజిటేబుల్ షార్టెన్నింగ్

10. వెజిటేబుల్ షార్టెన్నింగ్

సోరియాసిస్ ను నివారించడానికి వెజిటేబుల్ షార్టెనెటింగ్ అనేది మంచి పరిష్కార మార్గం. అయితే దీన్ని కేవలం శరీరంపై ఉండే చర్మంపైనే మాత్రమే ఉపయోగించాలి. ముఖ చర్మంపై వినియోగిస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకుంటే అక్కడ ఉంటే సున్నిత కణాలపై ఇది ప్రభావం చూపుతుంది. అలాగే చర్మ రంధ్రాలను మూసివేస్తుంది.

11. ఎసిటిక్ యాసిడ్స్ అకా వెనిగర్

11. ఎసిటిక్ యాసిడ్స్ అకా వెనిగర్

వెనిగర్ మంచి టోనర్. కాస్త సురక్షితమైనది కూడా. అయితే వెనిగర్ అనేది తేమను తగ్గిస్తుంది. స్ట్రాంగ్ గా ఉండే వెనిగర్ ను ఉపయోగిస్తే, అది మీ చర్మంపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. అందువల్ల మీ చర్మానికి సూటయ్యే టోనర్స్ ఉపయోగించడం ఉత్తమం. ఇలా మన శరీర సౌందర్యాన్ని అందంగా ఉంచుకునేందుకు ఉపయోగించే వివిధ కాస్మొటిక్స్ ముఖ చర్మంపై ఎలాంటి ప్రభావాలు చూపిస్తాయనే విషయాలు తెలుసుకున్నారా కదా. ఇప్పటి నుంచి వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఫేస్ పై ఉపయోగించకండి మరి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    11 Ordinary Things You Should Never Put On Your Face

    They say your face is the center of all emotional expression. It is also your identity – the most obvious part of you that people recognize. It is very special and therefore, needsspecial attention. While there are many things you can use to enhance your complexion, these are 11 things that you should never ever put on your face. Read on, and remember.
    Story first published: Saturday, November 4, 2017, 8:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more