Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
పువ్వులతో చర్మ సౌందర్యం, ఈ వీకెండ్ లో మీరు తప్పక ట్రై చేయాల్సిన ఫ్లవర్ ఫేస్ ప్యాక్స్
అందంగా కనిపించడం కోసం నిరంతరం ఏవో ఒకటి ముఖానికి అప్లై చేస్తుండే అమ్మాయిలను చాలా మందినే చూస్తుంటాము. ఒక్క మాటలో చెప్పాలంటే వీరిని స్కిన్ కేర్ ప్రొడక్ట్ అడిక్టర్ అని పిలవవచ్చు. చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడం కోసం ఎన్నో ప్రయోగాలను చేస్తుంటాము. అలాంటి ప్రయోగాల్లో పువ్వులు కూడా ఒకటి.
అందానికి పువ్వులను ఉపయోగించినట్లు మీరెప్పుడైనా విన్నారా? చాలా మందికి గులాబీ నీళ్ళు గుర్తుకొస్తాయి. రోజ్ వాటర్ ను అందాన్ని మెరుగుపరుచుకోవడానికి, చర్మ సుభ్ర పరుచుకోవడానికి అనేక రకాల ఫేస్ ప్యాక్ లలో ఉపయోగించడం చూసుంటారు. రోజ్ వాటర్ చర్మానికి అద్భుత మార్పులను తీసుకొస్తుంది!

గులాబీ వాటర్ లాగే కొన్ని రకముల పువ్వులు కూడా చర్మంలో అద్భుత మార్పులు తీసుకురాగలవని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు .
అయితే పువ్వులతో వేసుకునే ఫేస్ ప్యాక్ లు కొంత సమయం తీసుకుంటుంది. అందువల్ల పువ్వులతో ప్యాక్ లను వారాంతంలో లేదా సెలవుల్లో ప్రయత్నించండి..
వివిధ రకాల పువ్వులను ఉపయోగించి వివిధ రకాల ఫేస్ ప్యాక్ లను ప్రయత్నించవచ్చు . అవేంటో ఒకసారి తెలుసుకుందాం..

మందారంతో ఫేస్ ప్యాక్
కావల్సిన పదార్థాలు:
1 టీస్పూన్ మందారంపువ్వును పౌడర్ చేసినది
1/4 కప్పు బ్రౌన్ రైస్ పౌడర్
1 టేబుల్ స్పూన్ పెరుగు
1 ఫ్రెష్ అలోవెర జెల్
1 బౌల్

రిసిపి:
మందరం పువ్వు ప్యాక్ తయారీ కోసం ఒక వారం ముందు నుండే తయారుచేసుకోవాలి. ఫ్రెష్ గా ఉన్న మందారం పువ్వులు తీసుకుని, ఎండబెట్టాలి. ఒక వారం పాటు ఎండ బెట్టి తర్వాత పొడి చేసుకోవాలి.
ఫేస్ ప్యాక్ వేసుకోవాలనుకున్నప్పుడు, ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ మందారం పువ్వు పౌడర్, బ్రౌన్ రైస్ పౌడర్, వేసి కలిపి పెట్టుకోవాలి.
ఈపొడిలో కొద్దిగా పెరుగు, కలబంద రసం వేసి బాగా కలపాలి. తర్వాత ప్యాక్ వేసుకోవాలి.

గులాబీ, తేనె, పెరుగు ఫేస్ ప్యాక్
కావల్సిన వస్తువులు:
10-15 తాజా గులాబీ రేకులు
1 టేబుల్ స్పూన్ తేనె
1 పెరుగు

రిసిపి:
ఈ ఫేస్ ప్యాక్ తయారుచేసుకోవడానికి , ఒక బౌల్లో నీళ్లు పోసి, అందులో కొన్ని గులాబీ రేకులు వేసి నానబెట్టాలి.
ఈ గులాబీ రేకులను మరుసటి రోజు తీసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి
గులాబీ రేకుల పేస్ట్ కు పెరుగు, తేనె కలిపి మిక్స్ చేసుకోవాలి.
మొత్తం మిశ్రమాన్ని బాగా కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి.

బంతిపువ్వులతో ఫేస్ ప్యాక్
కావల్సిన వస్తువులు:
1 ఒక చిన్న కప్పు బంతిపువ్వుల రేకులు
½ టీస్పూన్ పెరుగు
½ గంధం పొడి లేదా పేస్ట్
మిక్సీ గ్రైండర్
1 చిన్న బౌల్

బంతిపువ్వులతో ఫేస్ ప్యాక్
రిసిపి:
ముందుగా బంతిపూల రేకులను తీసుకుని మెత్తగా పేస్ట్ చేయాలి.
ఈ పేస్ట్ ను ఒక బౌల్లోకి తీసుకుని, పెరుగు, గంధం పొడి వేసి మొత్తం బాగా కలుపుకోవాలి.
ఫేస్ ప్యాక్ రెడీ. డ్రై గా మారితే రోజ్ వాటర్ ను కలపుకోవచ్చు.
రెడీ అయిన తర్వాత ముఖానికి ప్యాక్ వేసుకోవాలి

మల్లెపూలతో ప్యాక్
కావల్సిన వస్తువులు:
20-25 ఫ్రెష్ పువ్వులు
1 టేబుల్ స్పూన్ తేనె
మిక్సర్
1 చిన్న బౌల్

మల్లెపూలతో ప్యాక్
రిసిపి:
మల్లెపువ్వుల రేకులు, కొద్దిగా నీళ్లు మిక్స్ చేసి పేస్ట్ చేసుకోవాలి.
ఒక బౌల్లో తీసుకుని, తేనె వేసి స్మూత్ పేస్ట్ గా చేసుకోవాలి. ఇది సెన్సిటివ్ స్కిన్ కు గ్రేట్ గా సహాయపడుతుంది.

తామరపువ్వులతో ఫేస్ ప్యాక్
కావల్సిన వస్తువులు:
10 తామరపువ్వు రేకులు
1/2 చిన్న కప్పు పచ్చిపాలు
కొన్ని చుక్కల బాదం ఆయిల్
మిక్సర్
1 చిన్న బౌల్
రిసిపి
ముందుగా తామరపువ్వు రేకులను మొత్తగా పేస్ట్ చేసి, అందులో పచ్చిపాలు, బాదం ఆయిల్ మిక్స్ చేసి చిక్కటి పేస్ట్ గా చేసుకోవాలి. దీన్ని ముఖానికి ప్యాక్ వేసుకోవాలి.



Click it and Unblock the Notifications