Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
అప్పుడప్పుడు ముఖానికి ఆవిరి పట్టడం తప్పనిసరి ..ఎందుకంటే..?
ముఖం అందంగా ఉంచుకోవడానికి స్టీమింగ్ ఒక ఉత్తమ మార్గం. కత్రిమంగా తయారైనటువంటి రసాయనిక ఉత్పత్తులు ఎన్ని వాడినా..వాటి ప్రయోజనం అంతంత మాత్రమే.అదే సహజ పద్దతులతో చేసుకొనేది ఏదైనా సరే సహజ అందాన్నే అందిస్తుంది
బుతువులను బట్టి వాతావరణం కాలుష్యం..ఇతర కారణాలు..శరీరంలో విషపదార్థాలను పెంచడమే కాదు అందాన్నీ ప్రభావితం చేస్తాయి. ఇక వాతావరణంలో చోటుచేసుకునే మార్పులు చర్మాన్ని నిర్జీవంగా మారుస్తాయి. ఇలాంటి సమస్యలకు చర్మాన్ని నిర్జీవంగా మారుస్తాయి. ఇలాంటి సమస్యల నుండి బయట పడాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం...
ముఖం అందంగా ఉంచుకోవడానికి స్టీమింగ్ ఒక ఉత్తమ మార్గం. కత్రిమంగా తయారైనటువంటి రసాయనిక ఉత్పత్తులు ఎన్ని వాడినా.. వాటి ప్రయోజనం అంతంత మాత్రమే. అదే సహజ పద్దతులతో చేసుకొనేది ఏదైనా సరే సహజ అందాన్నే అందిస్తుంది. అందులో ఒక పద్దతే స్టీమింగ్. ముఖానికి స్టీమింగ్(ఆవిరి) పట్టడం వల్ల చర్మం ఫ్రెష్ గా తయారవుతుంది.

చర్మలోని రంధ్రాలు తెరచుకొని చర్మం లోపలినుండి చర్మాన్ని శుభ్రపరుస్తుంది. ఫేషియల్ స్టీమింగ్ తో ఇటు అందానికి అటు ఆరోగ్యానికి రెండింటికి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఖర్చులేటువంటి పద్ధతిని ఇంట్లో ఎప్పుడైనా ఏ రోజైనా చేసుకోవచ్చు. కాబట్టి మీ చర్మాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకొనేందుకు ఈ ఫేస్ స్టీమింగ్ పద్దతి ఒక సారి చేసి చూడండి తర్వాత ఫలితం మీకే తెలుస్తుంది.
ఫేస్ స్టీమింగ్ అంటే ఏమిటి? ఇది కొన్ని నిమిషాల పాటు ముఖానికి పట్టాల్సిన ఆవిరి. ఈ ఫేస్ స్టీమింగ్ ను ఎలా పట్టాలంటే ఒక వెడల్పాటి గిన్నెలో నీటిని బాగా మరింగించి తల, ముఖం కవర్ అయ్యేట్లు టవల్ కప్పుకొని డైరెక్ట్ గా ముఖానికి ఆవిరి పట్టడం. జలుబు చేసి.. ముక్కు మూసుకు పోయినప్పుడో.. ఫేషియల్ చేయించుకున్నప్పుడో ముఖానికి ఆవిరి పట్టడం సహజం. అలాకాకుండా వారానికోసారి.. ముఖానికి ఆవిరిపట్టడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం..

ఫేస్ క్లీన్ అవుతుంది
ఆవిరి పట్టడానికి ముందు తప్పనిసరిగా ముఖం శుభ్రంగా కడుక్కోవాలి. ఒకవేళ ముఖానికి మేకప్ ఉంటే...దానిని తొలగించుకున్నాకే ఆవిరిపట్టాలి. ఇలా చేయడం వల్ల చర్మంగ్రంథుల్లో చేరిన మురికి వెలుపలికి వచ్చేస్తుంది. ముఖం శుభ్రపడుతుంది.

డెడ్ స్కిన్, బ్లాక్ హెడ్ సమస్య తగ్గుతుంది
యాక్నె సమస్య ఉన్నవారు.. ముఖానికి ఆవిరి పట్టడం వల్ల ఆ వేడికి చర్మ గ్రంథులు తెరచుకుంటాయి. లోపల మృతకణాలు తొలగిపోయి. బ్లాక్‌హెడ్స్ సమస్య మెల్లగా తగ్గుముఖం పడుతుంది.

స్కిన్ సాప్ట్ గా మారుతుంది
ముఖ చర్మంలో రక్తకణాలు ఉత్తేజితమవుతాయి. రక్తప్రసరణ సక్రమంగా జరిగి.. చర్మం మృదువుగా మారుతుంది. ముఖ చర్మ కణజాలానికి సరిపడా ప్రాణవాయువు అందుతుంది.

సన్ టాన్ నివారిస్తుంది
ప్రయాణాలూ, ఎండలో తిరగడం వల్ల చర్మం కమిలిపోయి...నిర్జీవంగా తయారైనప్పుడు మృదువుగా ఏదైనా క్రీమ్‌తో మర్దన చేసుకుని ఆవిరి పట్టడితే చక్కటి ఫలితం ఉంటుంది.

స్టీమ్ బాత్
ఈ కాలంలో చెమట వల్ల శరీరంలోని వ్యర్థాలు చేరిపోతాయి. వాటిని తొలగించుకోవాలంటే..ఆవిరిస్నానానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. అందుబాటులో లేనప్పుడు కనీసం ముఖానికైనా ఆవిరి పడితే మేలు.

ముఖం ఉబ్బినట్టు ఉన్నప్పుడు
ముఖం ఉబ్బినట్టు ఉన్నప్పుడు కూడా ఆవిరి పడితే... చక్కటి ఫలితం ఉంటుంది.

ఆవిరి పట్టడం వల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికీ..
ఆవిరి పట్టడం వల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నీళ్లు మరీ వేడిగా మసులుతున్నప్పుడు ఎక్కువ సమయం ఆవిరి పట్టకూడదు. అలా చేస్తే చర్మం ఎర్రగా కందిపోతుంది. ముఖం మీద విపరీతంగా మొటిమలున్నవారు ఆవిరికి దూరంగా ఉండటం మంచిది.



Click it and Unblock the Notifications