Latest Updates
-
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.!
పరిమళ స్నానాన్ని భార్యాభర్తలిద్దరూ కలిసి చేస్తే మీలో కొత్త ఉత్తేజం వస్తుంది, అందం మెరగవుతుంది
పరిమళ స్నానం పూర్తయ్యాక మీరు మీ ఒంటిని టవల్ తుడుచుకోకండి. ఒక మంచి గుడ్డను ఒంటికి చుట్టుకుని ఫ్యాన్ కింద కూర్చొండి. బాడీకి బాగా గాలి తగిలేలా చూసుకోండి. అలా ఒంటిపై ఉన్న నీరు మొత్తం ఆరిపోయేలా చేసుకోండి.
రోజూ ఆఫీస్ కు వెళ్లే ముందు ఒక నాలుగు చెంబులు తలపై పోసుకుని దాన్నే స్నానం అనేవాళ్లు మనలో చాలా మందే ఉంటారు. ప్రతి ఒక్కరూ అలాగే స్నానం చేస్తుంటారు. కానీ స్నానం చేసే విధానంలో కూడా చాలా రకాలుంటాయి.
స్నానాల్లో పరిమళ స్నానానికి ప్రత్యేక స్థానం ఉంది. వారానికి ఒకసారైనా పరిమళ స్నానం చేస్తే అందం పెరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. అందం, ఆరోగ్యానికి తోడ్పడే ఈ పరిమళ స్నానం గురించి తెలుసుకుని అప్పుడప్పుడు చేస్తూ ఉండండి.

మహిళలే చేయాలనేమీ లేదు
పరిమళ స్నానాన్ని కేవలం మహిళలే చేయాలనే నిబంధన ఏమీ లేదు.. మగవారు కూడా చేయొచ్చు. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు పరిమళ స్నానం చేస్తూ ఉండండి.

అనుభూతి చెప్పలేనిది
సుగంధ తైలాన్ని, ద్రవ్యాలను కాస్త గోరు వెచ్చగా ఉండే నీటిలో కలిపి చేసే స్నానమే పరిమళ స్నానం. దీని వల్ల వచ్చే అనుభూతి చెప్పలేనిది. కర్పూరం, చందనంతో పాటు పలు రకాల తైలాలను ఈ స్నానానికి ఉపయోగించండి.

లావెండర్ నూనె
వారాంతరాల్లో ఇలాంటి స్నానం చేయండి. సాధారణంగా స్నానం చేసే నీటిలో లావెండర్ నూనె కలుపుకుని కొందరు స్నానం చేస్తుంటారు. ఇది కూడా బాగుంటుంది.

నిమ్మరసం, తదితర సుగంద ద్రవ్యాలు
స్నానానికి ముందు శరీరానికి మొత్తం నలుగు పెట్టుకోండి. జుట్టుకు ఆయిల్ పెట్టుకుని మర్దన చేసుకోండి. గులాబీనీరు, నిమ్మరసం, తదితర సుగంద ద్రవ్యాలు కలుపుకుని ఆ నీటితో స్నానం చేయండి.

కొత్తశక్తి మీ బాడీలోకి వస్తుంది
పరిమళ స్నానం వల్ల మీలోని బద్ధకం పోతుంది. చురుకుదనం వస్తుంది. అలసట ఉండదు. స్నానం చేశాక ఒకరకమైన కొత్తశక్తి మీ బాడీలోకి వస్తుంది.
చర్మం కాంతివంతంగా మారుతుంది. బాగా నిద్ర కూడా వస్తుంది.

నొప్పులు కూడా తగ్గుతాయి
పరిమళ స్నానం వల్ల శరీరం నొప్పులు కూడా తగ్గుతాయి. పరిమళ స్నానాన్ని చాలా మంది బాత్ టబ్ లో చేస్తూ ఉంటారు. అలాగే చేయాలని నిబంధన ఏమీ లేదు. వేడి నీటితో ఉన్న బకెట్ లో కూడా కొన్ని రకాల సుగంద ద్రవ్యాలను (మీకు ఏవి నచ్చితే అవి) కలిపి కూడా స్నానం చేయొచ్చు.

ఫ్యాన్ కింద కూర్చొండి
పరిమళ స్నానం పూర్తయ్యాక మీరు మీ ఒంటిని టవల్ తుడుచుకోకండి. ఒక మంచి గుడ్డను ఒంటికి చుట్టుకుని ఫ్యాన్ కింద కూర్చొండి. బాడీకి బాగా గాలి తగిలేలా చూసుకోండి. అలా ఒంటిపై ఉన్న నీరు మొత్తం ఆరిపోయేలా చేసుకోండి.

తర్వాత చేసే కార్యకళాపాల్లోనూ
ఆ తర్వాత మీ ఒంటిపై సుగంద ద్రవ్యాల వాసన గుబాలిస్తుంది. ఎంతో హాయిగా ఉంటుంది. రాత్రి పడుకునే ముందు ఇలాంటి పరిమళ స్నానాన్ని భార్యాభర్తలిద్దరూ కలిసి చేస్తే మీలో కొత్త ఉత్తేజం వస్తుంది. తర్వాత చేసే కార్యకళాపాల్లోనూ మీరు చురుగ్గా పాల్గొనగలుగుతారు. పరిమళ స్నానానికి మీకు నచ్చిన సుగంద ద్రవ్యాలను ఏవైనా వాడొచ్చు.



Click it and Unblock the Notifications
