కడుపుతో ఉన్నప్పుడు డయాబెటిస్ వలన తల్లీబిడ్డలకి వచ్చే సమస్యలు

Written By: DEEPTHI T A S
Subscribe to Boldsky

కడుపుతో ఉన్నప్పుడు వచ్చే డయబెటిస్ ను గెస్టేషనల్ డయాబెటిస్ అంటారు, ఇది చాలామంది స్త్రీలలో సమస్యగా మారుతుంది. దీని అర్థం పుట్టబోయే బిడ్డకి కూడా మధుమేహం వస్తుందని కాదు. డయాబెటిస్ ఉన్న మెజారిటీ ఆడవారు ఆరోగ్యకరమైన, ఏ సమస్యలు లేని పిల్లలనే కంటున్నారు. కానీ ఈ స్థితిని నిర్లక్ష్యంగా వదిలేస్తే, అనేక సమస్యలకి దారితీయవచ్చు. సాధారణంగా కడుపుతో ఉన్నప్పుడు డయాబెటిస్ మెల్లిటస్ ద్వారా వచ్చే సమస్యలు సి-సెక్షన్ డెలివరీలకి దారితీస్తాయి.

కడుపుతో ఉన్నప్పుడు డయాబెటిస్ మెల్లిటస్ వలన తల్లికి వచ్చే సమస్యలు

కడుపుతో ఉన్నప్పుడు డయాబెటిస్ మెల్లిటస్ వలన తల్లికి వచ్చే సమస్యలు

తర్వాత జీవితంలో ఈ చక్కెరవ్యాధి వచ్చే అవకాశం ; మీరు ఇప్పుడు మొదటిసారి గర్భం దాలిస్తే, ఇంకా మీకు డయాబెటిస్ సమస్యలు ఉంటే, భవిష్యత్తులో గర్భం దాల్చినప్పుడు కూడా ఇదే సమస్య కలగవచ్చు. అలాగే మీ వయస్సు పై బడుతున్నకొద్దీ మీకు చక్కెర వ్యాధితో సమస్యలు రావచ్చు. మంచి జీవనశైలిని అలవాటు చేసుకోవడం, ఆరోగ్యకరమైన డైట్ పాటించడం, సరైన వ్యాయామం ఇవన్నీ చేయటం వలన భవిష్యత్తులో చక్కెర వ్యాధి దుష్ప్రభావాలను తగ్గించుకోవచ్చు.

అధిక రక్తపోటు ;

అధిక రక్తపోటు ;

కడుపుతో ఉన్నప్పుడు వచ్చే చక్కెర వ్యాధి వలన రక్తపోటు పెరుగుతుంది, ఇది తల్లికి, పెరుగుతున్న బిడ్డకి ఇద్దరికీ హానికరం.

ప్రీక్లాంప్సియా ;

ప్రీక్లాంప్సియా ;

డయాబెటిస్ ఉన్న గర్భవతులకి ప్రీక్లాంప్సియాతో వచ్చే దుష్ప్రభావాలు పెరుగుతాయి, అంటే అధిక రక్తపోటు, ఇంకో అవయవ వ్యవస్థకి సాధారణంగా కిడ్నీలకి హాని జరగటంలాంటివి జరుగుతాయి. ఈ సమస్య సాధారణంగా కడుపుతో ఉన్నప్పుడు 20వ వారం తర్వాత మొదలవుతుంది. మీకు ప్రీక్లాంప్సియా ఉంటే దానికి ఉన్న ఒకే పరిష్కారం కాన్పు త్వరగా జరగటమే.

పురిటిసమయంలో చక్కెర వ్యాధి వలన బిడ్డకి వచ్చే సమస్యలు

పురిటిసమయంలో చక్కెర వ్యాధి వలన బిడ్డకి వచ్చే సమస్యలు

గెస్టేషనల్ డయాబెటిస్ లక్షణాలు; కడుపుతో ఉన్నప్పుడు ఉండే డయాబెటిస్ వలన మీ బిడ్డ చిక్కుకునే హానికరమైన సమస్యలు ఇవే ;

తక్కువగా రక్తంలో చక్కెరస్థాయి ;

తక్కువగా రక్తంలో చక్కెరస్థాయి ;

కడుపుతో ఉన్నప్పుడు డయాబెటిస్ ఉన్న తల్లులకి పుట్టే బిడ్డలకి పుట్టగానే రక్తంలో తక్కువ చక్కెర స్థాయిలు ఉండవచ్చు. ఈ హైపోగ్లైసీమియా తీవ్రంగా ఉంటే ఫిట్'స్ కి కూడా దారితీయవచ్చు. సరిగ్గా తినడం, ఇంజక్షన్ ద్వారా చక్కెరను ఎక్కించటం వంటివి రక్తంలో చక్కెరస్థాయిని సాధారణంకి తెస్తాయి.

పుట్టినపుడు అధిక బరువు ఉండటం ;

పుట్టినపుడు అధిక బరువు ఉండటం ;

మీ రక్తంలో ఎక్కువ చక్కెర ఉంటే, మీ గర్భాశయంలోకి కూడా అది చేరి, మీ బిడ్డలోకి ప్రవేశిస్తుంది. మీ బిడ్డలో ఉండే అధిక చక్కెర వలన క్లోమం అదనంగా ఇన్సులిన్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనివలన బిడ్డ అధికబరువుతో పుడతారు. మామూలుకన్నా 9 అదనపు పౌండ్లు ఇలా పెరిగే పిల్లలకి డెలివరీ జరిగినపుడు గాయాలు అవటం లేదా సి-సెక్షన్ డెలివరీ అవసరపడుతుంది.

సమయానికి ముందే పుట్టటం ;

సమయానికి ముందే పుట్టటం ;

కడుపుతో ఉన్నప్పుడు డయాబెటిస్ వల్ల చాలా త్వరగా కాన్పు వస్తుంది అలాగే బిడ్డ త్వరగా ఎదిగిపోతుంది. తరచూ డాక్టర్లు పెద్ద సైజు బేబీ కారణంగా త్వరగా కాన్పు చేయించుకోమని సూచిస్తారు.

 రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్ర్రోం ;

రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్ర్రోం ;

ఈ స్థితిలో చంటిబిడ్డ ఊపిరితిత్తులు పూర్తిగా ఏర్పడేదాకా, ఇంకా బలంగా మారేదాకా శ్వాసలో సమస్యలు వస్తాయి. తరచూ, సమయానికి ముందే పుట్టని బిడ్డల్లో కూడా ఈ సమస్య కన్పిస్తుంది.

బిడ్డ జీవితంలో తర్వాత టైప్2 డయాబెటిస్ వచ్చే అవకాశం ;

బిడ్డ జీవితంలో తర్వాత టైప్2 డయాబెటిస్ వచ్చే అవకాశం ;

కడుపుతో ఉన్నప్పుడు తల్లులకి డయాబెటిస్ ఉంటే, అలా పుట్టే పిల్లలకి తర్వాత జీవితంలో డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది బేబీలలో పెద్దయాక స్థూలకాయ సమస్యలు కూడా వస్తాయి.

కడుపుతో ఉన్నప్పుడు ఉండే డయాబెటిస్ ని చికిత్స చేయకుండా వదిలేస్తే, అది మీ బిడ్డ పుట్టే ముందు, లేదా పుట్టిన వెంటనే వారికి ప్రాణాంతకమవుతుంది.

English summary

Complications of Diabetes in Pregnancy for Both the Mother and Baby

Diabetes in maternity, additionally called as gestational diabetic issues is a quite typical problem with numerous women. It does not mean that babies will also obtain diabetes mellitus after the birth. The majority of women with diabetes even deliver healthy and balanced babies. However, it is sure that when the condition is not managed meticulously, it could result in a number of difficulties. Most generally, issues of diabetes mellitus in maternity can bring about C-section deliveries.