స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ని అప్లై చేసుకునే కరక్ట్ ఆర్డర్ ఇదే

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

స్కిన్ కేర్ అనేది ముఖ్యమైనది. వయసుతో సంబంధం లేకుండా అందరూ స్కిన్ కేర్ కి తగిన ప్రాముఖ్యాన్నివ్వాలి. మనలో చాలా మంది యవ్వనంలో స్కిన్ కేర్ ని నిర్లక్ష్యం చేస్తారు. ఇలా చేస్తే వయసు పెరిగిన కొద్దీ చర్మసౌందర్యం దెబ్బతింటుందన్న విషయాన్ని గుర్తించాలి. యవ్వనంలోనే చర్మాన్ని చక్కగా సంరక్షించుకుంటే చర్మసౌందర్యం పదిలంగా ఉంటుందన్న విషయం తెలుసుకోవడం మంచిది.

కాబట్టి, స్కిన్ కేర్ విషయంలో బద్దకాన్ని వీడండి. అదనపు సమయాన్ని కేటాయించి స్కిన్ కు తగిన కేర్ ను అందించండి. స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ని అప్లై చేసే విధానం తెలిస్తే స్కిన్ కేర్ అనేది సాధ్యమవుతుంది. అయితే, ఈ ప్రోడక్ట్స్ ని ఎలా వాడాలో కాస్త కన్ఫ్యూషన్ ఉండటం సహజమే. అయితే, ఇప్పుడు చింతించకండి. మీకు స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ను అప్లై చేసుకునే ఆర్డర్ ను ఇక్కడ సరళంగా వివరించాము.

The Correct Order Of Applying Skin Care Products

గుడ్ స్కిన్ కేర్ అనేది మీ అపియరెన్స్ ను ప్లెజంట్ గా ఉంచేందుకు తోడ్పడుతుంది. మేకప్ అనేది ఫ్లాలెస్ గా ఉండేందుకు కూడా సహకరిస్తుంది. అవును, స్కిన్ పై ఉన్న ఫ్లాస్ ను అలాగే బ్లేమిషస్ ను మేకప్ తో కవర్ చేయవచ్చు. అయితే, మీరు చక్కటి స్కిన్ కేర్ రొటీన్ ని అనుసరిస్తున్నప్పుడు మీ స్కిన్ టెక్స్చర్ మేకప్ కి అనుగుణంగా మారుతుంది. తద్వారా, తక్కువ మేకప్ తోనే మీ అందానికి మెరుగులు దిద్దుకోవచ్చు.

స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ని సరైన ఆర్డర్ లో ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మిసెల్లర్ వాటర్:

మిసెల్లర్ వాటర్:

మిసెల్లర్ వాటర్ అనేది రోజంతా ముఖంలో పేరుకుపోయిన దుమ్మూ ధూళిని తొలగించేందుకు తోడ్పడుతుంది. చర్మంలోని నూనె శాతం తగ్గకుండా చర్మాన్ని శుభ్రంచేయడానికి ఈ వాటర్ ఉపయోగకరంగా ఉంటుంది.

మేకప్ రిమూవర్ లలో ఇది జెంట్లియెస్ట్ టైప్. కంటి చుట్టూ వాడడానికి కూడా ఇది సురక్షితమే. వాటర్ ప్రూఫ్ మేకప్ ను కూడా ఇది తొలగిస్తుంది.

ఒక కాటన్ ప్యాడ్ ని మిసెల్లర్ వాటర్ లోముంచి ఈ కాటన్ తో మేకప్ ట్రేస్ లను తొలగించండి. మేకప్ ని తొలగించడం ముఖ్యమైన ప్రక్రియ. మేకప్ అనేది చర్మంపై ఎక్కువ సేపు ఉంటే పోర్స్ ను క్లాగ్ చేస్తుంది. విపరీతమైన బ్రేకవుట్స్ తలెత్తుతాయి.

క్లీన్స్:

క్లీన్స్:

ఈ స్టెప్ ను చాలా మంది స్కిప్ చేస్తారు. మిసెల్లర్ వాటర్ అనేది క్లీన్సింగ్ ప్రక్రియను పూర్తిచేసింది వీరు భావిస్తారు. అయితే, క్లీన్సర్ ను వాడటం తప్పనిసరి. చర్మాన్ని మరింత శుభ్రపరిచేందుకు క్లీన్సర్ ను వాడటం అవసరం.

ఎక్స్ఫోలియేట్:

ఎక్స్ఫోలియేట్:

ఎక్స్ఫోలియేషన్ ని వారంలో రెండు సార్లు పాటించడం ద్వారా చర్మసౌందర్యాన్ని కాపాడుకున్నవారవుతారు. స్క్రబ్ తో ముఖాన్ని ఎక్స్ఫోలియేట్ చేసుకోండి. డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించి చర్మానికి కాంతిని అలాగే నిగారింపును కలిగించండి.

చర్మంపైన టాప్ లేయర్ లో డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోవడం వలన చర్మం నిస్తేజంగా అలాగే నిర్జీవంగా కనిపిస్తుంది. ఎక్స్ఫోలియేషన్ అనేది డెడ్ సెల్స్ ను తొలగించి చర్మాన్ని కాంతివంతంగా చేసేందుకు సహాయపడుతుంది. అయితే, అతిగా ఎక్స్ఫోలియెట్ చేయడం వలన పోర్స్ అనేవి శాశ్వతంగా పెద్దవిగా మారే ప్రమాదం ఉంది.

టోనర్:

టోనర్:

టోనర్ అనేది దుమ్ము రెసిడ్యూస్ ని తొలగిస్తుంది. ఇంతకు ముందు స్టెప్స్ తరువాత కూడా చర్మంపై ఇంకా మిగిలిన దుమ్మును టోనర్ తో తొలగించవచ్చు. అలాగే స్క్రబ్ అలాగే ఫేస్ వాష్ ల రెసిడ్యూలను కూడా తొలగించుకోవచ్చు.

పోర్స్ సైజ్ ను తగ్గించి ముఖంపై పిహెచ్ లెవల్స్ ను తిరిగి సాధారణ స్థాయికి తేవడానికి తోడ్పడుతుంది. అలాగే, చర్మంపై మాయిశ్చర్ ను నిలిపి ఉంచుతుంది. ఇప్పుడు మిగతా స్టెప్స్ ను ఫాలో అవడానికి చర్మాన్ని సిద్ధపరుస్తుంది. క్లీన్సర్ లేదా స్క్రబ్ తరువాత టోనర్ ని వాడటం తప్పనిసరని తెలుసుకోండి.

సెరమ్:

సెరమ్:

స్కిన్ కేర్ లో సెరమ్ అనేది యాడెడ్ స్టెప్ మాత్రమే. సెరమ్ ని వాడటం మొదలు పెట్టిన వెంటనే చర్మం మెరుగవడం మీరు గమనించి తీరుతారు.

25 దాటిన తరువాత యాంటీ ఏజింగ్ సెరమ్ న వాడడాన్ని చాలామంది మగువలు ప్రిఫర్ చేస్తారు. ఇది నిజంగా మంచి ఐడియానే. మొట్ట మొదటి ఏజింగ్ సైన్స్ అనేవి ఇరవైల మధ్యలో ప్రారంభమవుతాయి కాబట్టి ఈ విధానం స్కిన్ కేర్ కు తోడ్పడుతుంది.

సెరమ్ అనేది చర్మాన్ని స్మూథెన్ చేస్తుంది. తద్వారా, మాయిశ్చర్ ను నిలుపుతుంది. చాలా మటుకు సెరమ్స్ అనేవి వాటర్ బేస్డ్ వి. వీటిని మాయిశ్చరైజర్ కి ముందు అప్లై చేసుకోవాలి. ఆయిల్ బేస్డ్ సెరమ్స్ ని మాత్రం మాయిశ్చరైజర్ ని వాడిన తరువాత అప్లై చేయాలి.

ఐ క్రీమ్:

ఐ క్రీమ్:

అండర్ ఐ ఏరియా అనేది చాలా సున్నితమైన ప్రదేశం. దీనికి అదనపు మాయిశ్చర్ అవసరం. ఈ ప్రదేశంలో సహజమైన ఆయిల్ తక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఐ క్రీమ్ తో అండర్ ఐ ఏరియాను మసాజ్ చేయాలి.

ఐ క్రీమ్స్ అనేవి కాస్తంత ఎక్స్పెన్సివ్ అయినా మీకు ఐ క్రీమ్ ను వాడటం మొదలుపెట్టిన దగ్గర నుంచి అండర్ ఐ ఏరియాలో చర్మం తక్కువగా డేమేజ్ అవడాన్ని గమనించడం మొదలుపెడతారు. అండర్ ఐ ఏరియాలో ఏజింగ్ సైన్స్ మొదటగా ఏర్పడతాయి. క్రోస్ ఫీట్ రూపంలో ఏజింగ్ సైన్స్ మొదలవుతాయి.

మాయిశ్చరైజ్:

మాయిశ్చరైజ్:

మీ స్కిన్ టైప్ ఏదైనా సరే మాయిశ్చరైజర్ ని వాడటం మాత్రం ముఖ్యమన్న విషయాన్ని మీరు గుర్తించాలి. చర్మం ఎంత బాగా హైడ్రేట్ అవుతుందో అంత తక్కువగా ముడుతలనేవి ఏర్పడతాయి.

డ్రై స్కిన్ కలిగిన వారు క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ ను వాడాలి. ఆయిలీ స్కిన్ కలిగిన వారు లైట్ వెయిట్ జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్ ను వాడాలి.

ఎస్ పీ ఎఫ్:

ఎస్ పీ ఎఫ్:

డే టైం స్కిన్ కేర్ రొటీన్ లో ఈ స్టెప్ ను మరువకూడదు. ఎస్ పీ ఎఫ్ ప్రోడక్ట్ ను ఎండలోకి వెళ్లబోయే పదిహేను నిమిషాలకు ముందుగా అప్లై చేసుకోవాలి.

ఏజ్ స్పాట్స్ ను అలాగే ట్యానింగ్ ను తొలగించేందుకు సన్ ప్రొటెక్షన్ తోడ్పడుతుంది. అలాగే, స్కిన్ క్యాన్సర్ ను కూడా తొలగిస్తుంది. ప్రతి కొన్ని గంటలకే సన్ స్క్రీన్ ను ఉపయోగించాలి. చెమట వలన సన్ స్క్రీన్ తొలగిపోతుంది కాబట్టి సన్ స్క్రీన్ ను రీ అప్లై చేయడం తప్పనిసరి.

లేదా మీ కన్వీనియెన్స్ కోసం స్ప్రే ఆన్ సన్ స్క్రీన్ ను ప్రయత్నించవచ్చు.

ఈ ఆర్డర్ ని స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ని అప్లై చేసుకోవడంలో పాటిస్తే మీ చర్మం మీకు ధన్యవాదాలు తెలుపుకుంటుంది. ఇటువంటి బ్యూటీ అప్డేట్స్ కోసం బోల్డ్ స్కై ని చదువుతూ ఉండండి మరి.

English summary

The Correct Order Of Applying Skin Care Products

The Correct Order Of Applying Skin Care Products,The Correct Order Of Applying Skin Care Products, tips to apply skin care products, how to apply skin care products, methods to apply skin care products
Story first published: Wednesday, March 21, 2018, 9:00 [IST]