For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆముదం నూనె వాడుతూ స్ట్రెచ్ మార్క్స్ ను తొలగించుకునే 7 మంచి పద్ధతులు

ఆముదం నూనె వాడుతూ స్ట్రెచ్ మార్క్స్ ను తొలగించుకునే 7 మంచి పద్ధతులు

|

కడుపుతో ఉన్నప్పుడు మాత్రమే స్ట్రెచ్ మార్కుల సమస్య వస్తుందనే అపోహ చాలామంది ఆడవారిలో సాధారణంగా ఉంది. ఇది పూర్తిగా నిజం కాదు. యవ్వనంలోకి వచ్చి వేగంగా ఎదుగుతున్నప్పుడు కూడా కండరాలు సాగటం వలన మగవారు, ఆడవారు ఇద్దరిలో స్ట్రెచ్ మార్కులు కన్పించవచ్చు. కొన్ని కేసులలో అయితే, రుతుక్రమం సమయంలో ఆగకుండా బరువు పెరగటం,తగ్గటం, మెనోపాజ్ కూడా స్ట్రెచ్ మార్క్స్ పెరగటానికి కారణం కావచ్చు.

7 Effective Ways To Fight Against Stretch Marks Using Castor Oil

చర్మం పైపొర క్యుటికిల్ సాగినప్పుడు, అది చర్మం కణజాలాలను, సాగేగుణాన్ని పాడుచేయటమేకాదు, ఆత్మవిశ్వాసాన్ని కూడా తగ్గిస్తుంది. కానీ ఈ మచ్చలు తొలగించుకోవటం అంత అసాధ్యమేమీ కాదు. సాధారణంగా అందరూ ఖరీదైన లేజర్ చికిత్స లేదా కృత్రిమంగా రసాయన పదార్థాలు పరిష్కారంగా వాడతారు కానీ, దీర్ఘకాలంలో వాటివలన చాలా హానికర సైడ్ ఎఫెక్ట్’స్ ఉంటాయి.

నిజానికి చాలా ఇంటి చిట్కాల ద్వారా, స్ట్రెచ్ మార్క్స్ ను సులభంగా రాకుండా, కన్పడనీయకుండా మనం చేసుకోవచ్చు.

ఆముదం నూనె ఎందుకు వాడాలి?

ఆముదం నూనె ఎందుకు వాడాలి?

ఆముదం నూనెలో ఉండే విశేషమైన మెడిసినల్ విలువలు చర్మసమస్యలకి మంచి చికిత్సగా పనిచేస్తుంది. ఇందులో ఉండే సహజమైన ఫ్యాటీయాసిడ్ ను రిసినోలిక్ యాసిడ్ అంటారు. ఆముదం నూనెలోని ట్రైగ్లిసరైడ్ అణువులు చర్మం లోపలి పొరలలోకి చొచ్చుకుపోతాయి. అక్కడ కనెక్టివ్ కణజాలం, వెంట్రుక కుదుళ్ళు, చెమట గ్రంథులు ఉంటాయి.

ఆముదం నూనెలో ఉండే సహజ ఫ్యాటీయాసిడ్ చర్మంపై సహజమైన తేమ బ్యాలెన్స్ ను తెస్తుంది.

ఆముదం నూనెలో ఉండే సహజ ఫ్యాటీయాసిడ్ చర్మంపై సహజమైన తేమ బ్యాలెన్స్ ను తెస్తుంది.

• తేమను చర్మంపై పట్టివుంచి చర్మంపై కణాలు జీవంగా ఎక్కువ సమయం ఉండేలా చేస్తుంది.

• కొల్లాజెన్, ఎలాస్టిన్ ఉత్పత్తిని ప్రేరేపించి, చర్మంపై కొత్త స్ట్రెచ్ మార్క్స్ రాకుండా చేస్తుంది.

• దానిలో ఉండే బ్యాక్టీరియా వ్యతిరేక,యాంటీసెప్టిక్ లక్షణాలు మచ్చలు తగ్గుతున్న సమయంలో సూక్ష్మజీవులతో పోరాడుతాయి.

• ఆముదం నూనెలో ఉండే రికినోలిక్ యాసిడ్ చర్మాన్ని వాపునుండి, వివిధ ఇన్ఫెక్షన్ల నుండి దూరంగా ఉంచుతుంది.

ఆముదం నూనెను ఎలా వాడాలి?

ఆముదం నూనెను ఎలా వాడాలి?

ఆముదం నూనె కొబ్బరినూనెతో ;

• 1 చెంచా ఆముదం నూనెను 1 చెంచా కొబ్బరినూనెతో కలపండి.

• ఈ మిశ్రమాన్ని చర్మంపై స్ట్రెచ్ మార్క్స్ ఉన్నచోట రాయండి.

• మెల్లగా 5 నిమిషాలపాటు మసాజ్ చేయండి.

• చర్మం పీల్చుకునేదాకా 30 నిమిషాలు అలా వదిలేయండి.

• గోరువెచ్చని నీటితో కడిగేసి మెత్తని గుడ్డతో తుడవండి.

• ఈ పద్ధతిని వారంలో 3-4సార్లు పాటించండి.

ఆముదం నూనె బంగాళదుంపతో ;

ఆముదం నూనె బంగాళదుంపతో ;

• 1 బంగాళదుంప నుండి రసాన్ని తీయండి.

• ఈ బంగాళదుంప రసాన్ని 2 చెంచాల ఆముదం నూనెతో కలపండి.

• ఈ మిశ్రమాన్న్ స్ట్రెచ్ మార్క్స్ పై చక్కగా రాసి 30 నిమిషాలపాటు ఆరనివ్వండి.

• ఈ మిశ్రమాన్ని గోరువెచ్చని నీటితో కడిగేసి,పొడిగా తుడవండి.

• వారంలో ఈ పద్దతిని 3-4సార్లు పాటించండి.

ఆముదం నూనె లవంగాలతో ;

ఆముదం నూనె లవంగాలతో ;

• కొన్ని లవంగాలను పొడిగా చేసి, సరిపోయేంత ఆముదం నూనెను దానికి కలపండి.

• ఈ మిశ్రమాన్ని రెండు నిమిషాలు గోరువెచ్చగా వేడిచేయండి.

• ఈ మిశ్రమాన్ని చల్లబరిచి స్ట్రెచ్ మార్కులపై రాసుకోండి.

• చర్మంపై 15 నిమిషాలు మసాజ్ చేసి మరో 30 నిమిషాలు అలా వదిలేయండి.

• గోరువెచ్చని నీరుతో కడిగేసి పొడి తువ్వాలుతో అద్దండి.

• ఈ పద్దతిని ప్రతిరోజూ మంచి ఫలితాల కోసం పాటించండి.

ఆముదం నూనె ఆలోవెరాతో ;

ఆముదం నూనె ఆలోవెరాతో ;

• 1 చెంచా తాజా ఆలోవెరా జెల్ ను తీసి మెత్తని రసంలా కలపండి.

• 1 చెంచా ఆముదం నూనెను ఆలోవెరా రసంతో మొత్తంగా బాగా కలపండి.

• ఒక నిమిషంపాటు ఈ మిశ్రమాన్ని గోరువెచ్చగా వేడిచేయండి.

• ఈ గోరువెచ్చని మిశ్రమాన్ని మీ చర్మంపై రాసుకుని రాత్రంతా అలా వదిలేయండి.

• దీన్ని నీటితో కడిగేసి పొద్దున్న పొడిగా తుడవండి.

• ఈ పద్ధతిని ప్రతిరోజూ పాటించండి.

ఆముదం నూనె వాడకంతోపాటు అదనంగా చిట్కాలు ఏంటి?

ఆముదం నూనె వాడకంతోపాటు అదనంగా చిట్కాలు ఏంటి?

• మరింత ప్రభావవంతమైన ఫలితాల కోసం స్వఛ్చమైన కోల్డ్ కంప్రెస్డ్ ఆముదం నూనెను వాడండి.

• ఎక్స్ ఫోలియేట్ చేస్తున్నప్పుడు చర్మంపై నెమ్మదిగా రుద్దండి. గట్టిగా రుద్దటం వలన చర్మం పాడవుతుంది.

• క్రమం తప్పకుండా చర్మానికి నూనెతో మర్దనలు కొనసాగించండి, కొత్త స్ట్రెచ్ మార్కులు రాకుండా ఉంటాయి.

• చర్మంపై కోసుకుపోయిన లేదా పొక్కులు ఉంటే ఆముదం నూనెను రాయవద్దు.

• మీ శరీరం హైడ్రేటడ్ గా ఉండటానికి నీళ్ళు ఎక్కువగా తాగుతుండండి.

Read more about: body care
English summary

7 Effective Ways To Fight Against Stretch Marks Using Castor Oil

There is a common myth that women face the problem of stretch marks only during pregnancy, which is not entirely true. Rapid progression of puberty starts leaving marks of muscle stretch on both men and women. Whereas in some cases, continuous weight gain and loss during menstruation cycle, also menopause can be a reason for the growing stretch marks to appear.
Story first published:Saturday, April 28, 2018, 10:06 [IST]
Desktop Bottom Promotion