2018 లో ప్రాముఖ్యం సంతరించుకునే 8 స్కిన్ కేర్ ట్రెండ్స్

By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

స్కిన్ కేర్ కి సంబంధించిన ట్రెండ్స్ అనేవి ఎల్లప్పుడూ మార్పులకు గురవుతూనే ఉన్నాయి. ప్రతి ఏడాది, స్కిన్ కేర్ ట్రెండ్స్ అనేవి మారుతూ ఉండడం మనం గమనిస్తూనే ఉన్నాము.

సృజనాత్మకమైన కే బ్యూటీ నియమావళి లేదా మైక్రో బాల్డింగ్ వంటి కొన్ని స్కిన్ కేర్ ట్రెండ్స్ అనేవి ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించాయి. కొన్ని ట్రెండ్స్ అనేవి బ్యూటీ కమ్మూనిటీలో సంచలనం సృష్టిస్తూ ఉంటే కొన్ని మాత్రం అంచనాలను అందుకోలేక డీలా పడిపోవడం మనకు తెలిసిన విషయమే.

skincare trends that will be huge in 2018skincare trends that will be huge in 2018

ఉద్భవిస్తున్న స్కిన్ కేర్ ట్రెండ్స్ గురించి తెలుసుకోవాలని మీరు తహతహలాడుతున్నవారైతే ఈ పోస్ట్ మీకు తగినది. ఈ రోజు, 2018లో ఉద్భవించనున్న స్కిన్ కేర్ ట్రెండ్స్ గురించి ఇందులో పొందుపరచాము.

ఈ ట్రెండ్స్ అనేవి బ్యూటీ కమ్యూనిటీ దృష్టి మొత్తాన్ని ఆకర్షించాయి. స్కిన్ కేర్ ఎక్స్పర్ట్స్ నుంచి బ్యూటీ బ్లాగర్స్ అలాగే సెలెబ్రిటీస్ వరకు ప్రతి ఒక్కరూ ఈ స్కిన్ కేర్ ట్రెండ్స్ అంటే ప్రేమను పెంచుకున్నారు. ఈ రోజు, వాటిలో కొన్నిటి గురించి తెలుసుకుందాం.

బ్యూటీ వరల్డ్ లో సంచలనం సృష్టిస్తున్న ఈ ట్రెండ్స్ గురించి తెలుసుకోండి.

1. ఆర్గానిక్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్

1. ఆర్గానిక్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్

గతేడాది, ప్రపంచవ్యాప్తంగా ఆర్గానిక్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ఈ ట్రెండ్ అనేది ఈ ఏడాది కూడా కొనసాగుతుందని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. కెమికల్ తో నిండిన ప్రోడక్ట్స్ ని వాడటం కంటే ఆర్గానిక్ ప్రాడక్ట్స్ ని వాడటం ఉత్తమమని భావించిన మహిళలు ఈ ప్రోడక్ట్స్ వైపు ఎక్కువగా ఆకర్షితులవడం మనం గమనించదగిన విషయం.

2. ఇంటి వద్ద ఉపయోగించే బ్యూటీ టూల్స్

2. ఇంటి వద్ద ఉపయోగించే బ్యూటీ టూల్స్

ఇంటి వద్ద సులభంగా ఉపయోగించుకునే బ్యూటీ టూల్స్ యొక్క డిమాండ్ విపరీతంగా పెరిగింది. డెర్మా రోలర్స్, స్కిన్ ఎక్స్ఫోలియేటర్స్ వంటివి బ్యూటీ కమ్యూనిటీలో తగిన ప్రాధాన్యతని సంతరించుకున్నాయి. ఇవి, మరింత ప్రసిద్ధి చెందుతాయని చెప్పుకోవచ్చు. ఈ టూల్స్ పై వన్ టైం ఇన్వెస్ట్మెంట్ తో స్కిన్ కేర్ రొటీన్ ని మరింత మెరుగుపరుచుకోవచ్చు.

3. నైట్ క్రీమ్స్ మరియు మాస్క్స్

3. నైట్ క్రీమ్స్ మరియు మాస్క్స్

రాత్రికి రాత్రే చర్మాన్ని ఉత్తేజ పరచడానికి వాడే కొన్ని రకాల క్రీమ్స్ మరియు మాస్క్ లు చర్మ సంరక్షణలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఇటువంటి, స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అనేవి బ్యూటీ కమ్మ్యూనిటీలో ఎక్కువ అటెన్షన్ ను అందుకుంటున్నాయి. ఈ అటెన్షన్ అనేది ఈ ఏడాది కూడా వీటికి భారీగా లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్ అనేవి బిజీగా ఉండే మహిళలను దృష్టిలో పెట్టుకుని తయారుచేయబడినవి.

4. కే బ్యూటీ

4. కే బ్యూటీ

కొరియన్ స్కిన్ కేర్ రొటీన్ కి సంబంధించిన స్టెప్స్ గాని షీట్ మాస్క్స్ గాని మహిళలను విపరీతంగా ఆకట్టుకోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఈ ట్రెండ్ అనేది 2018లో కూడా రాజ్యమేలుతుందని భావించవచ్చు. కే బ్యూటీకి సంబంధించిన క్రేజ్ అనేది స్కిన్ కేర్ రొటీన్ లో ప్రధాన పాత్ర పోషిస్తుంది.

5. ఫేషియల్ ఎసెన్స్

5. ఫేషియల్ ఎసెన్స్

2018 స్కిన్ కేర్ ట్రెండ్స్ లో చోటు సంపాదించుకునే అవకాశాలు ఈ ట్రెండ్ కు భారీగానే ఉన్నాయి. ఫేషియల్ ఎసెన్స్ అనేది వాటర్ వంటి లోషన్. ఇది చర్మాన్ని లోతులోంచి మాయిశ్చరైజ్ చేసి చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. ఈ ప్రోడక్ట్ అనేది మీ చర్మాన్ని తాజాగా అలాగే కోమలంగా మార్చేందుకు తోడ్పడుతుంది.

6. యాంటీ పొల్యూషన్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్

6. యాంటీ పొల్యూషన్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్

ఎయిర్ పొల్యూషన్ అనేది విపరీతంగా పెరుగుతోంది. అందువలన, ప్రపంచవ్యాప్తంగా యాంటీ పొల్యూషన్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కున్న డిమాండ్ అనేది పెరుగుతూ ఉంది. వివిధ రకాల మేజర్ బ్రాండ్స్ అనేవి పొల్యూషన్ బ్లాకింగ్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ని ఉత్పత్తి చేస్తూ ఉన్నాయి. వీటిని వాడటం ద్వారా కాలుష్యం వలన చర్మం దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు. కాబట్టి, ఈ ప్రోడక్ట్స్ కున్న డిమాండ్ కూడా 2018లో గణనీయంగా పెరుగుతుందని నిపుణుల అంచనా.

7. బాడీ కేర్

7. బాడీ కేర్

ఫేషియల్ కేర్ లాగానే బాడీ కేర్ కూడా ముఖ్యమైనదని తెలుసుకోవాలి. ఈ ఏడాదిలో, బాడీ కేర్ కి సంబంధించిన ట్రెండ్స్ అనేవి విపరీతంగా ప్రజాదరణ పొందుతాయని తెలుస్తోంది. బాడీ స్క్రబ్స్, మాయిశ్చరైజర్స్ మరియు లోషన్స్ అనేవి ఫేస్ క్రీమ్స్ మరియు సెరమ్స్ తో పాటే సమానంగా ప్రజాదరణ పొందుతున్నాయి. ఈ ఏడాదిలో కూడా వీటికున్న ఆదరణ మరింత పెరుగుతుందని అంచనా.

8. బ్యూటీ వాటర్

8. బ్యూటీ వాటర్

బ్యూటీ వాటర్ అనేది చాలా మంది మహిళలకు అత్యంత ఫెవరెట్ స్కిన్ కేర్ ప్రోడక్ట్ గా మారింది. ఈ ప్రోడక్ట్ అనేది చర్మ సంరక్షణలో అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది. అలాగే, చర్మానికి తగినంత హైడ్రేషన్ ని అందిస్తుంది. అందువలనే, స్కిన్ కేర్ ఎక్స్పర్ట్స్, బ్యూటీ బ్లాగర్స్ తో పాటు సెలెబ్రిటీలు ఈ ప్రోడక్ట్ ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ ఏడాదిలో ఈ ప్రోడక్ట్ అనేది మరింత ఆదరణ పొందుతుందని తెలుస్తోంది.

English summary

8 Skin Care Trends That Are Going To Be Huge In 2018

There are certain skin care trends that end up getting everyone's attention in the year 2018. Some of these trends end up shaking the beauty community, while there are a few that fail to live up to the hype.
Subscribe Newsletter