Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి!
ఇంటివద్దే చర్మాన్ని బ్లీచ్ చేసుకోవడమెలా?
ఇంటివద్దే చర్మాన్ని బ్లీచ్ చేసుకోవడమెలా?
స్కిన్ బ్లీచింగ్ అనేది ఏజ్ ఓల్డ్ మెథడ్. దీని ద్వారా స్కిన్ టోన్ ని లైటెన్ చేయవచ్చు. పిగ్మెంటేషన్ మరియు ట్యానింగ్ వంటి సమస్యలను తొలగించవచ్చు. స్కిన్ కాంప్లెక్షన్ ను డార్కెన్ చేసే సమస్యలను తగ్గించేందుకు బ్లీచింగ్ టెక్నీక్ తోడ్పడుతుంది.
ఈ బ్యూటీ మెథడ్ ను ప్రపంచవ్యాప్తంగా మహిళలందరూ వినియోగిస్తున్నారు. ప్రయోజనాలను పొందుతున్నారు. అందువలన బ్యూటీ స్టోర్స్ లో అనేక స్కిన్ బ్లీచింగ్ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉంటున్నాయి.
అంతేకాక, ఈ మెథడ్ అనేది స్కిన్ టోన్ ను మెరుగుపరచడంతో పాటు డార్క్ స్పాట్స్ ని లైటెన్ చేస్తుంది. పిగ్మెంటేషన్ సమస్యను తగ్గుముఖం పట్టిస్తుంది. సన్ ట్యానింగ్ ను తొలగిస్తుంది.

చర్మంలో మెలనిన్ లెవల్స్ ను సమర్థవంతంగా తగ్గిస్తుంది. అలా చేయడం ద్వారా, స్కిన్ టోన్ ను మెరుగుపరచి చర్మాన్ని అందంగా అలాగే కాంతివంతంగా తయారుచేస్తుంది.
అయితే, ఈ బ్యూటీ మెథడ్ కూడా సైడ్ ఎఫెక్ట్స్ కు అతీతం కాదు. ముఖ్యంగా, కమర్షియల్ బ్లీచింగ్ ప్రోడక్ట్స్ ని వాడితే ఆ ప్రోడక్ట్స్ తయారీలో వాడే హానికర కెమికల్స్ అనేవి చర్మంపై దుష్ప్రభావం చూపుతాయి. దాంతో, దీర్ఘ కాల చర్మ సమస్యలతో ఇబ్బంది పడవలసి వస్తుంది.
మార్కెట్ లో లభ్యమయ్యే వాటిని వాడే బదులు నేచురల్ స్కిన్ బ్లీచింగ్ ఇంగ్రిడియెంట్స్ ను బ్యూటీ రొటీన్ లో భాగంగా చేసుకుంటే అత్యంత ప్రయోజనం పొందవచ్చు. ఎందుకంటే, నేచురల్ ఇంగ్రిడియెంట్స్ అనేవి వాడటానికి సురక్షితం అలాగే వీటి వలన చర్మానికి హానీ కలగదు.
మరీ ముఖ్యంగా, ఈ పదార్థాలు మీ కిచెన్ క్యాబినెట్ లో సులభంగా లభ్యమవుతాయి. వీటిని బ్యూటీ రొటీన్ లో సరైన విధంగా వాడితే స్కిన్ టోన్ లైటెన్ అవుతుంది.
చాలా మంది మగువలు బ్లీచింగ్ సెషన్ కోసం సెలూన్ ను రెగ్యులర్ బేసిస్ లో సందర్శిస్తారు. అయితే, చర్మాన్ని బ్లీచ్ చేయడానికి ఇది ఒక్కటే మార్గం కాదు. నేచరుల్ రెమెడీస్ ను ఉపయోగించి కూడా చర్మాన్ని బ్లీచ్ చేసుకోవచ్చు. ఇంటివద్దే ఈ రెమెడీస్ ను పాటించవచ్చు.
ఈ రెమెడీస్ ను వేరువేరుగా వాడవచ్చు లేదా ఇతర ఆద్భుతమైన రెమెడీస్ తో కంబైన్ చేసి ఫేస్ ప్యాక్ లా వాడవచ్చు. కొన్ని రోజుల పాటు ఈ హోమ్ రెమెడీస్ ను లేదా ఫేస్ ఫ్యాక్స్ ను వాడటం వలన స్కిన్ టోన్ లో మార్పును మీరు గుర్తించడం ప్రారంభిస్తారు.
ఈ కింది విధానాల ద్వారా చర్మాన్ని ఇంటి వద్దే సులభంగా బ్లీచ్ చేసుకోవచ్చు:

1. పొటాటో ప్యాక్
పొటాటో అనేది అద్భుతమైన స్కిన్ బ్లీచింగ్ ఇంగ్రిడియెంట్ గా వ్యవహరిస్తుంది. ఇది స్కిన్ కలర్ ను లైటెన్ చేయగలదు. ఇది పిగ్మెంటేషన్ మరియు ట్యానింగ్ ను ట్రీట్ చేస్తుంది.
ఎలా వాడాలి:
• పొటాటోను పీల్ చేయండి. బ్లెండ్ చేసి పేస్ట్ లా తయారుచేసుకోండి.
• ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని ఆలాగే అర టీస్పూన్ రెడ్ లెంటిల్ పౌడర్ ను ఈ పొటాటో పేస్ట్ కు జోడించండి.
• ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ప్యాక్ లా తయారుచేసుకోండి.
• దీన్ని స్కిన్ పై అప్లై చేయండి. కొన్ని నిమిషాల పాటు మసాజ్ చేయండి.
• ఆ తరువాత గోరువెచ్చటి నీటితో వాష్ చేయండి.
• ఈ మెథడ్ ను వారానికి నాలుగైదు సార్లు పాటిస్తే గురించదగిన ఫలితాలను పొందుతారు.

2. టమాటో ప్యాక్:
టమాటోలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. అందువలన, స్కిన్ టోన్ ను మెరుగుపరచడం కోసం టమాటోను అద్భుతమైన రెమెడీగా పేర్కొంటారు.
ఎలా వాడాలి:
• ఒక టేబుల్ స్పూన్ టమాటో పల్ప్ ను తీసుకోండి.
• చర్మంపై ఈ టమాటో గుజ్జును అప్లై చేస్తూ కొద్ది నిమిషాల పాటు మసాజ్ చేయండి.
• ఈ ప్యాక్ ను పదినిమిషాల పాటు అలాగే ఉంచండి.
• గోరువెచ్చటి నీటితో చర్మాన్ని రిన్స్ చేయండి.
• ఈ ప్యాక్ ను వారానికి రెండు సార్లు పాటిస్తే ఆశించిన ఫలితాలను పొందుతారు.

3. కుకుంబర్ ప్యాక్:
కుకుంబర్ లో లభ్యమయ్యే పదార్థాలు స్కిన్ టోన్ ను మెరుగుపరచి చర్మసౌందర్యాన్ని రెట్టింపు చేయడానికి తోడ్పడతాయి.
ఎలా వాడాలి:
• ఒక కుకుంబర్ ను తురిమి స్క్వీజ్ చేసి అందులోంచి రసాన్ని సేకరించాలి.
• ఈ కుకుంబర్ రసానికి కాస్తంత అలో వెరా జెల్ ను జోడించాలి.
• ఈ ప్యాక్ ను చర్మంపై అప్లై చేయాలి.
• పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఈ ప్యాక్ ను చర్మంపై అలాగే ఉండనివ్వాలి.
• ఆ తరువాత గోరువెచ్చటి నీటితో ఈ ప్యాక్ ను వాష్ చేయాలి.
• ఈ ప్యాక్ ను వారానికి మూడు లేదా నాలుగు సార్లు అప్లై చేస్తే ఆశించిన ఫలితం లభిస్తుంది.

4. ఆరెంజ్ ప్యాక్:
ఆరంజ్ పీల్ పౌడర్ పౌడర్ లో విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది. అందువలన, ఇది అద్భుతమైన బ్లీచింగ్ ఏజెంట్ లా పనిచేస్తుంది.
ఎలా వాడాలి:
• ఒక టీస్పూన్ ఎండిన ఆరెంజ్ పీల్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఆర్గానిక్ హనీ మరియు ఒక టీస్పూన్ రోజ్ వాటర్ ను కలిపి మిశ్రమంగా తయారుచేసుకోండి.
• ఈ ప్యాక్ ను స్కిన్ పై అప్లై చేయండి.
• పదిహేను నిమిషాల పాటు ఈ ప్యాక్ ను ఆరనివ్వండి.
• ఈ ప్రాసెస్ ను వారానికి ఒకసారి పాటిస్తే అద్భుతమైన ఫలితాలను పొందుతారు.

5. నిమ్మరసం:
ఇందులో స్కిన్ బ్లీచింగ్ ప్రాపర్టీస్ పుష్కలంగా కలవు. అందువలన, స్కిన్ కాంప్లెక్షన్ ను ఇంప్రూవ్ చేయడానికి ఇది అద్భుతమైన రెమెడీగా పనిచేస్తుంది.
ఎలా వాడాలి:
• ఒక పాత్రను తీసుకుని అందులో నిమ్మరసాన్ని అలాగే ఆర్గానికి తేనెను జోడించండి.
• ఈ పదార్థాలను బాగా కలిపి ప్యాక్ ను సిద్ధం చేసుకోండి.
• ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసుకుని సర్క్యూలర్ మోషన్స్ లో కొద్ది నిమిషాల పాటు మసాజ్ చేయండి.
• గోరువెచ్చటి నీటితో వాష్ చేయండి.
• ఈ ప్యాక్ ను వారానికి ఒకసారి అప్లై చేస్తే ఆశించిన ఫలితాలను పొందుతారు.
చర్మాన్ని కాంతివంతంగా మార్చుకోవడం కోసం పాటించవలసిన చిట్కాలు:
- చర్మాన్ని హైడ్రేటెడ్ గా అలాగే మాయిశ్చరైజ్డ్ గా ఉంచడం వలన కాంతివంతంగా మారుతుంది.
- యువీ రేస్ నుంచి చర్మాన్ని సంరక్షించుకుంటే స్కిన్ డేమేజ్ తగ్గుతుంది. తద్వారా, స్కిన్ డల్ గా మారటాన్ని అరికట్టవచ్చు.



Click it and Unblock the Notifications











