Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
ఎక్జిమా నివారణకు వేపనూనె ఏ విధంగా ఉపయోగపడుతుంది?
ఎక్జిమా నివారణకు వేపనూనె ఏ విధంగా ఉపయోగపడుతుంది?
ఎక్జిమా అనే ఒక చర్మ వ్యాధి వలన చర్మంపై దురద మరియు మంటగా అనిపిస్తూ, చర్మం పొడిబారి పొలుసులుగా మారడం, వాపు, పగుళ్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది దీర్ఘకాలిక సమస్య అయినప్పటికీ, మీరు ఖచ్చితంగా దీనిని వ్యాప్తి చెందకుండా ,పూర్తిగా నివారించుకోవచ్చు. దీని నివారణకు ఉపయోగపడే పదార్థాలలో వేపనూనె ఒకటి.
ఆయుర్వేదం లో వేపను సర్వరోగ నివారిణిగా భావిస్తారు. వేప చెట్టుకు మల్లే, దాని నుండి వెలికి తీయబడిన నూనెకు కూడా ఔషధ గుణాలు ఉన్నాయి.

వేపనూనెలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు దూరదను మరియు వాపును తగ్గిస్తాయి. అంతేకాకుండా, చర్మంపై అసౌకర్యాన్ని కూడా తగ్గిస్తుంది. కనుక ఎక్జిమా చికిత్సలో వేపనూనెను ఎలా వినియోగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వేపనూనె మరియు కొబ్బరినూనె:
కొబ్బరినూనెలోని యాంటీబాక్టీరియల్ మరియు యాంటీఫంగల్ లక్షణాలు, వేపనూనెతో కలసి మంటగా ఉన్న చర్మాన్ని శాంతబరుస్తుంది.
కావలసిన పదార్థాలు:
1 టేబుల్ స్పూన్ కొబ్బరినూనె
కొన్ని చుక్కలు వేపనూనె
వాడే విధానం:
1. వేపనూనె మరియు కొబ్బరినూనెలను తీసుకుని ఒక గిన్నెలో బాగా కలపండి.
2. పడుకోబోయే ముందు ప్రభావిత ప్రాంతాల్లో రాసుకోండి.
3. రాత్రంతా అలా వదిలేసి తెల్లరగానే ముఖాన్ని, నీటితో కడుక్కోండి.
4. మీలో మార్పు కనపడేవరకు, అలా చేస్తూనే ఉండండి.

వేపనూనె మరియు పసుపు:
వేపనూనె మరియు పసుపు రెండింటిలో, చర్మం మీద మంట మరియు ఇన్ఫెక్షన్లు తగ్గించే గుణాలుంటాయి.
కావలసిన పదార్థాలు:
కొన్ని చుక్కలు వేపనూనె
1 టేబుల్ స్పూన్ వేప పొడి
1 టీ స్పూన్ పసుపు
1 టీ స్పూన్ తేనె
వాడే విధానం:
1. ఒక గిన్నెలో వేపనూనె, చిటికెడు పసుపు, వేపపొడి మరియు తేనె కలపండి.
2. ముక్కలుగా ఏర్పడకుండా బాగా కలపండి.
3. ఈ పేస్టును ప్రభావిత ప్రాంతాల్లో రాసుకుని, ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వండి.
4. ఆరినాక నీటితో కడిగేయండి.
5. వాపు తగ్గేదాక ఇలా చేస్తుండండి.

వేప నూనె మరియు పచ్చి బొప్పాయి గుజ్జు:
పచ్చి బొప్పాయి గుజ్జును వేప నూనెతో కలిపి వాడితే, దురద, ఎర్రదనం, పొడిబారడం మరియు పొలుసులు రాలడం ఆగుతుంది.
కావలసిన పదార్థాలు:
1 టేబుల్ స్పూన్ పచ్చి బొప్పాయి గుజ్జు
3-4 చుక్కల వేపనూనె
వాడే విధానం:
1. వేప నూనె మరియు పచ్చి బొప్పాయి గుజ్జును ఒక గిన్నెలో కలపండి.
2. ఈ పేస్టును ప్రభావిత ప్రాంతాల్లో రాసుకుని, కనీసం ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వండి.
3. ఇరవై నిమిషాల పాటు ఆరినాక నీటితో కడిగేయండి. ఇలా ఉపశమనం కలిగే వరకు చేస్తుండండి.

వేపనూనె మరియు తులసి:
వేపనూనె మరియు తులసి,ఎక్జిమా వలన కలిగే ఎర్రదనం, నొప్పి మరియు దూరదను తగ్గిస్తాయి.
కావలసిన పదార్థాలు:
1 కప్పు వేపాకులు
1 కప్పు తులసి ఆకులు
కొన్నిచుక్కల వేపనూనె
నీరు
వాడే విధానం:
1. ఒక బాణలిలో , వేపాకులు మరియు తులసి ఆకులు వేసి మరిగించాలి.
2. ఆకులు బాగా నీటిలో మరిగాక, నీరు వాటి సారాన్ని వెలికితీసాక, నీటిని వడగట్టండి.
3. దీనిని ఒక స్ప్రే బాటిల్ లో వేసుకుని , దానికి కొన్ని చుక్కలు వేపనూనె కలపండి. మిశ్రమాన్ని బాగా గిలకొట్టండి.
4. దూది ఉండను ఈ ద్రావణంతో తడిపి, ప్రభావిత ప్రదేశంలో ప్రతిరోజూ పడుకునే ముందు రాసుకుని, రాత్రంతా ఆరనివ్వాలి.
5. తరువాతి రోజు తెల్లారాక మంచి నీటితో కడిగేయాలి.

వేప స్నానం:
స్నానం చేసే నీటిలో వేపనూనె కలిపి చేస్తే, చర్మానికి తేమనిచ్చి, పొడిబారకుండా, పొలుసులుగా రాలకుండా చేస్తుంది.
కావలసిన పదార్థాలు:
8-10 చుక్కల వేపనూనె
గుప్పెడు వేపాకులు
వాడే విధానం:
1. ముందుగా ఒక బాణలిలో , వేపాకులు వేసి మరిగించి వడకట్టాలి.
2. దీనిని నీళ్లతో నింపిన స్నానాల తొట్టెలో వేయండి.
3. ఈ నీటిలో ఇరవై నిమిషాల పాటు మీరు నానండి.
4. తరువాత స్నానం చేయండి. ఉత్తమ ఫలితాలకు వేప గుణాలతో కూడిన మాయిశ్చరైజర్ ను స్నానం చేసాక రాసుకోండి.



Click it and Unblock the Notifications
