For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మ రంద్రాలు లేని స్వచ్చమైన చర్మ సౌందర్యానికి 7 DIYఫేస్ వాష్ లు

|

చర్మ సంరక్షణ అంటేనే అందరూ మొదటగా ఆలోచించే విషయం క్లెన్సింగ్. అవునా ?

దుమ్ము మరియు బాక్టీరియా చర్మంపై పేరుకుపోయిన కారణంగా, క్రమంగా శరీరం నలువైపులా మురికితో కూడుకున్న మృతచర్మాన్ని తయారుచేస్తాయి. తద్వారా అనేక చర్మ సమస్యలకు, మరియు ఇతరత్రా వ్యాధులకు దారితీస్తుంది.

కావున చర్మ సంరక్షణ పట్ల జాగ్రత్త మరియు దినచర్య అవసరంగా ఉంటుంది. సరైన శుభ్రతా విధానాలను పాటించకపోతే ఈ మలినాలు చర్మం రంద్రాలపై పేరుకునిపోయి, క్రమంగా అనేక చర్మ సమస్యలకు దారితీస్తాయి.

కానీ వాస్తవానికి ఇంట్లో తయారు చేసే ఫేస్ వాష్లు ఈ చర్మ సమస్యలను నివారించడంలో అత్యుత్తమంగా సహాయపడతాయని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు. ఇవి చర్మానికి దుష్ప్రభావాలు తలెత్తకుండా చూసుకోవడంతో పాటు, అత్యుత్తమ ప్రయోజనాలను అందివ్వగలవు. మరియు మార్కెట్లో దొరికే రసాయనిక ఫేస్ వాష్లతో పోలిస్తే, చాలా చవకగా కూడా ఉంటాయి. చర్మరకానికి తగినవిధంగా క్లెన్సర్ తయారు చేయడం అన్నిటికన్నా ముఖ్యం. దీనికై ఇంట్లోనే వంటగదిలో లభ్యమయ్యే కొన్ని పదార్థాలు సహాయం చేయగలవు.

వివిధ రకాల చర్మరకాలకు ఇంట్లోనే తయారుచేయదగిన ఫేస్ వాష్లు :

సాధారణ మరియు పొడి చర్మం కలిగిన వారికోసం ఇంట్లోనే తయారు చేసుకోగల ఫేస్ వాష్లు :

పొడి చర్మం ఉన్న వ్యక్తులు కెమికల్ ఫేస్ వాష్లను వినియోగించడం మూలంగా ప్రభావితమవుతారు, ఎందుకంటే ఇవి ముఖాన్ని మరింత పొడిగా మార్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి. కావున పొడిచర్మం ఉన్నవారు, ఇంట్లోనే ఫేస్ వాష్ లేదా క్లెన్సర్స్ తయారుచేసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చునని సూచించబడుతుంది. ఈ పద్దతి ముఖంమీద సహజసిద్దంగా తేమ సమతుల్యతను పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. ఈ ఫేస్ వాష్ల గురించిన రెసిపీ వివరాలకోసం వ్యాసంలో ముందుకు సాగండి.

1. పెరుగు మరియు తేనె క్లెన్సర్ :

1. పెరుగు మరియు తేనె క్లెన్సర్ :

ఒక గిన్నెలో 2 టీస్పూన్ల పెరుగును తీసుకోండి. అందులో 1 టీస్పూన్ ముడి తేనెను కలపండి. ఈ ప్యాక్ ను బాగా మిశ్రమంగా చేసి ముఖంపై నలుదిక్కులా విస్తరించునట్లు అప్లై చేయండి. ముఖాన్ని సుమారు 2 నుండి 3 నిమిషాల పాటు అలాగే ఉంచుకుని చల్లటి నీటితో శుభ్రపరచండి. మీరు ఎక్కువగా పొడిచర్మాన్ని కలిగి ఉంటే, ఈ ప్యాక్లో 1 టీస్పూన్ ఆలివ్ ఆయిల్ కూడా జోడించుకోవచ్చు. ఈ ప్రక్రియ తర్వాత, సాధారణ ప్రాతిపదికన మాయిశ్చరైజింగ్ మరియు టోనింగ్ ప్రక్రియలను కొనసాగించవచ్చు. ఈ క్లెన్సర్ ను రోజూవారీ దినచర్యలో భాగంగా కూడా వినియోగించవచ్చు, ఇది చర్మం మృదువుగా ఉండేందుకు దోహదపడుతుంది.

2. తేనె మరియు గుడ్డు క్లెన్సర్ :

2. తేనె మరియు గుడ్డు క్లెన్సర్ :

1 పెద్ద గుడ్డు పచ్చసొన తీసుకుని, అందులో 1 టీస్పూన్ ముడి తేనెను కలపండి. 6 నుండి 7 బాదం పప్పులను మెత్తగా పేస్ట్ వలె చేసి, ఈ ప్యాక్ కు జోడించండి. తరువాత ఈ ప్యాక్ ను ముఖం మీద నలుదిక్కులా విస్తరించునట్లు అప్లై చేయండి. దీన్ని 10 నుండి 15 నిమిషాలపాటు అలాగే ఉంచి, బాగా ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయండి. క్రమంతప్పకుండా అనుసరించడం ద్వారా, మృదువైన మరియు తేమతో కూడిన ముఖాన్ని త్వరలోనే సాధించగలరు.

3. క్రీమ్ మరియు ఆపిల్ క్లెన్సర్ :

3. క్రీమ్ మరియు ఆపిల్ క్లెన్సర్ :

చిన్న సైజులో ఉన్న ఆపిల్ పండును ఉడికించి, ఫోర్క్ సహాయంతో మృదువుగా మాష్ చేయండి. ఇందులోకి 1 టీస్పూన్ క్రీమ్, 1 టీస్పూన్ ఆలివ్ ఆయిల్, 1 టీస్పూన్ నిమ్మరసం లేదా ఆరెంజ్ జ్యూస్ కలపండి. ఈ పదార్దాలన్నింటినీ మిశ్రమంగా అయ్యేవరకు బాగా కలపండి. ఈ ప్యాక్ ను ముఖం, నుదురు, మెడ వంటి భాగాలలో పూర్తిస్థాయిలో అప్లై చేయండి. క్రమంగా 5 నిమిషాలపాటు అలాగే ఉంచి, ఆరిన తర్వాత, గోరువెచ్చని నీటితో శుభ్రపరచుకోండి.

జిడ్డు మరియు మొటిమలతో కూడిన చర్మం కోసం ఇంట్లోనే తయారుచేయగలిగిన ఫేస్ వాష్లు :

జిడ్డు చర్మం సాధారణంగానే అధిక స్థాయిలో మురికిని ఆకర్షిస్తుంది. ఇది తరచుగా మొటిమలు, బ్లాక్ హెడ్స్, మరియు ఆక్నే సమస్యలకు దారితీస్తుంది. ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా , జిడ్డు చర్మంతో కూడిన సమస్యలతో పోరాడడానికి ఆర్గానిక్ క్లెన్సర్లు అత్యంత అనువుగా ఉంటాయని చెప్పబడింది.

4. పెరుగు/యోగర్ట్ మరియు స్ట్రాబెర్రీ క్లెన్సర్ :

4. పెరుగు/యోగర్ట్ మరియు స్ట్రాబెర్రీ క్లెన్సర్ :

2 తాజా పండిన స్ట్రాబెర్రీలను తీసుకుని మాష్ చేసి గుజ్జుగా చేయండి. అందులో 2 టీస్పూన్ల పెరుగు లేదా యోగర్ట్ కలపండి. లేదా అన్ని పదార్ధాలను ఒకేసారి మిక్సర్లో వేసి, రెండింటిని మిక్స్ చేయండి. నెమ్మదిగా షేక్ చేయండి. ఆ తరువాత ముఖం మీద నెమ్మదిగా పోస్తూ, మసాజ్ చేయండి. 5 నుండి 7 నిమిషాలపాటు అలాగే ఉంచి, ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగేయండి. ఈ క్లెన్సర్ ముఖం నుండి, అధికమైన జిడ్డును మరియు, సెబంను తొలగిస్తుంది.

5. పాలు మరియు తేనె క్లెన్సర్ :

5. పాలు మరియు తేనె క్లెన్సర్ :

1 టీస్పూన్ తేనెను 2 టీస్పూన్ల పచ్చిపాలతో కలిపి మిశ్రమంగా చేయండి. ఇది మీ చర్మానికి చక్కని లోషన్ వలె పనిచేస్తుంది కూడా. ఈ మిశ్రమాన్ని ముఖం మీద నలుదిక్కులా విస్తరించునట్లు అప్లై చేసి, 2 నుంచి 3 నిమిషాలపాటు మీ చర్మంపై మృదువుగా మసాజ్ చేయండి. తరువాత 2 నుండి 3 నిమిషాలు అలాగే ఉంచి, ఆరిన తరువాత వెచ్చని నీటితో శుభ్రపరచండి. ఈ క్లెన్సర్ మీ చర్మాన్ని ప్రకాశవంతంగా చేయడమే కాకుండా, మీ ముఖం మీద నుండి అధికమైన నూనెలను తొలగించడంలో సహాయం చేస్తుంది. క్రమంగా సున్నితమైన చర్మానికి ఒక అద్భుతమైన హోంమేడ్ ఫేస్ వాష్ అని చెప్పవచ్చు.

6. ముల్తానీ మట్టి/బంకమట్టి మరియు ఆస్ప్రిన్ క్లెన్సర్ :

6. ముల్తానీ మట్టి/బంకమట్టి మరియు ఆస్ప్రిన్ క్లెన్సర్ :

అన్నిరకాల చర్మాలకు సరిపోయే ఉత్తమమైన క్లెన్సర్ గా దీనిని సూచించవచ్చు. ఇది చర్మం మీద అధికంగా చేరిన నూనెలను, మురికి మరియు సెబంను శోషించుకుంటుంది. ఇది చర్మానికి చిరాకును తొలగించి తాజాదనాన్ని అందిస్తుంది. క్రమంగా చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. ఆస్ప్రిన్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయని మనందరికీ తెలిసిన విషయమే. క్రమంగా, ఈ క్లెన్సర్ మీ ముఖాన్ని శుభ్రపరచడమే కాకుండా, మొటిమలు మరియు ఆక్నే సమస్యను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. ఒక గిన్నెలో రెండు టీస్పూన్ల ముల్తానీ మట్టిని వేసి, అందులో 2 నుండి 3 పొడిచేసిన ఆస్పిరిన్ మాత్రలను చేర్చి, అందులో కొద్దిగా నీటిని చేర్చి మృదువైన మిశ్రమంవలె చేసి, ముఖానికి పట్టించండి. 10 నిమిషాలపాటు అలాగే ఉంచి, పూర్తిగా ఆరిన తరువాత కాటన్ బాల్ వినియోగించి చల్లటి నీటితో శుభ్రపరచండి. ఉత్తమ ఫలితాల కోసం వారానికి కనీసం ఒకసారి అనుసరించండి.

 7. పైనాపిల్ క్లెన్సర్ :

7. పైనాపిల్ క్లెన్సర్ :

2 టీస్పూన్ల పైనాపిల్ జ్యూస్ తీసుకుని, అందులో 2 టీస్పూన్ల నిమ్మరసాన్ని కలపండి. ఇందులో 1 టీస్పూన్ బేకింగ్ సోడా వేసి చిక్కటి మిశ్రమంలా చేయండి. మీ ముఖం మొత్తం నలుదిక్కులా విస్తరించునట్లు సున్నితంగా అప్లై చేసి మసాజ్ చేయండి. కనీసం 5 నిమిషాలు ఆరనిచ్చిన తర్వాత, చల్లని నీటితో శుభ్రపరచండి.

కావున, రసాయనిక ఫేస్ వాష్లను వినియోగించి దుష్ప్రభావాల బారిన పడేబదులు. ఇంట్లోనే తయారుచేసుకోదగిన ఈ ఫేస్ వాష్ల వాడకం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందగలరు. క్రమంగా ఇవి చర్మ రంద్రాలను తొలగించడంతో పాటు, చర్మంలో మురికి పేరుకోకుండా చూడగలదు. అంతేకాకుండా ఈ డై ఫేస్ వాష్లను క్రమం తప్పకుండా అనుసరిస్తున్న ఎడల నెమ్మదిగా ఆక్నే మరియు ఇతర చర్మ సంబంధిత సమస్యలను దూరంచేయగలవు.

ఫేస్ క్లెన్సర్లలో వినియోగించగలిగే వివిధ రకాల పదార్థాలు మరియు వాటి ప్రయోజనాల గురించిన వివరాలను ఇప్పుడు చూద్దాం.

  • ఓట్స్ - ఇది చర్మాన్ని శుభ్రపరచడానికి, మృదువుగా చేయడానికి మరియు చర్మం మీద తేమను పెంచడానికి సహాయపడుతుంది.
  • బంకమట్టి లేదా ముల్తానీ మట్టి - ఇది చర్మాన్ని బిగుతుగా చేయడంలో సహాయపడుతుంది, విషతుల్య పదార్ధాలను శోషించుకుంటుంది మరియు చర్మాన్ని మృదువుగా చేస్తుంది.
  • బాదం - ఇది చర్మాన్ని ఎక్స్ ఫోలియేట్ చేసి, చర్మాన్ని మృదువుగా చేయడంలో తనవంటి ప్రయోజనాలను కలిగి ఉంటుంది.
  • ఎండిన(డ్రై) పువ్వులు - గులాబి, లావెండర్, మరియు క్యాలెండులా పువ్వులు వాటి స్వస్థత, ఉపశమన, మరియు మాయిశ్చరైజింగ్ లక్షణాల కారణంగా ఫేస్ వాష్ల తయారీలో వినియోగించబడుతాయి.
  • లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ - లావెండర్ అనేది అత్యంత వైవిధ్యభరితమైన నూనెగా చెప్పబడుతుంది. మరియు ఇది పొడి, సున్నితమైన, మొటిమలు మరియు చిరాకుతో కూడిన, మంటతో కూడిన లేదా జిడ్డుగా ఉండే చర్మ రకాలకు ఎంతో మంచిది.
  • చివరగా, ఈ హోంమేడ్ డై ఫేస్ వాష్ రెసిపీలు మీ చర్మాన్ని ఆరోగ్యవంతంగా చేయడంతోపాటు సహజసిద్దమైన కాంతులీనే చర్మాన్ని అందివ్వగలుగుతాయని సూచించబడుతుంది.పైగా ఇవి చర్మానికి ఎటువంటి హానీ కలిగించని సహజసిద్దమైన పదార్ధాలను కలిగి ఉన్న కారణంగా, ఎటువంటి సంశయమూ లేకుండా వినియోగించవచ్చునని సౌందర్య నిపుణులచే సిఫారసు చేయబడుతాయి. కాకపోతే చర్మ రకాన్ని అనుసరించి పైన సూచించినట్లు ఫేస్ వాష్లను ఎంచుకోవలసి ఉంటుంది. ఇన్నిరకాల ప్రయోజనాలను కూడుకుని ఉన్న ఈ ఫేస్ వాష్లను అనుసరించి, మీ అభిప్రాయాలను క్రింది వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

    గమనిక : రసాయన పదార్ధాలను కలిగి ఉండే సౌందర్య ఉత్పాదనలకు వీలైనంత దూరంగా ఉండడమే మంచిది. ఇవి తాత్కాలిక ప్రయోజనాలను కలిగి ఉన్నా, దీర్ఘకాలిక వాడకం మూలాన దుష్ప్రభావాలకు దారితీస్తాయి. కొన్ని రసాయనాలు కాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు కూడా దారితీస్తాయని అధ్యయనాలలో తేలింది కూడా.

    ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి

English summary

7 DIY face wash recipes for clear, pores free skin

Face wash is an essential part of our skin care routine. It helps to keep our face free from dirt and bacteria. And, if the face wash is homemade, nothing like it. Curd and honey, yogurt and strawberry, milk and honey, honey and egg, pineapple, etc., serve as the best ingredients for amazing homemade face washes.
Story first published:Monday, May 6, 2019, 15:30 [IST]
Desktop Bottom Promotion