Latest Updates
-
ఆకు కూరల కంటే ఎక్కువ బలం: మోకాళ్లలో గుజ్జు రప్పించి, ఎముకల్ని గట్టిగా చేసే నల్లేరు రోటి పచ్చడి -
Fridge Vastu: మీ ఇంట్లో ఫ్రిజ్ పైన ఈ 3 వస్తువులు పెడితే పట్టిందల్లా బంగారమే! -
చపాతీ, దోశల్లోకి అదిరిపోయే మలేషియన్ ఎగ్ మసాలా..4 గుడ్లు ఉంటే ఈజీగా ఇలా చేసేయండి -
ఫైబర్, పోషకాలు నిండిన పర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్..సొరకాయ మునగాకు ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్స్టా వ్యామోహం.. 18 ఏళ్ల యువకుడి కోసం ముగ్గురు పిల్లలను వదిలేసిన 38 ఏళ్ల మహిళ, చివరికి.! -
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా.. -
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.!
రోజూ ఉదయం ఇలా చేస్తే అందంగా ఉంటారు, చర్మం పాలిపోదు, కాంతివంతంగా మారుతుంది
రోజూ ఉదయం లేవగానే కొన్ని రకాల వర్క్ అవుట్స్ చేయాలి. ఇవి మీ చర్మం సున్నితంగా ఉండి అందంగా ఉండేందుకు దోహదపడతాయి. ఉదయం లేవగానే ఏరోబిక్ వ్యాయామం చేయడం వల్ల శరీరంలోని మలినాలు మొత్తం బయటకు వెళ్తాయి.
రోజూ ఉదయం మీరు పాటించే కొన్ని అలవాట్లు మీ చర్మ సౌందర్యంపై ప్రభావం చూపుతాయి. కాంతివంతమైన చర్మం మీ సొంతం అవుతుంది.

చాలా మంది ఉదయం లేవగానే ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా డైరెక్ట్ గా బ్రేక్ ఫాస్ట్ చేసేస్తుంటారు. ఇలా చేస్తే మీ చర్మం త్వరగా పాలిపోతుంది. మీ అందం తగ్గిపోతుంది. అందువల్ల కొన్ని సూచనలు పాటించి అందాన్ని కాపాడుకోండి.

నీళ్లు తాగాలి
రోజూ ఉదయం లేవగానే ఒక గ్లాస్ మంచి నీళ్లు తాగండి.
చాలా మంది పొద్దున లేవనగానే టీ కప్ చేతిలో పట్టుకుని తాగుతూ ఉంటారు. అయితే అంతకంటే ముందే మీరు ఒక గ్లాస్ నీరు తాగడం మంచిది. ఒకవేళ కేవలం నీళ్లు మాత్రమే తాగబుద్ది కాకుంటే కాస్త నిమ్మరసం, తేనే కలుపుకుని తాగండి.

శుభ్రపరుచుకోవాలి
ఇక ఉదయం లేవగానే ఫేస్ మొత్తాన్ని శుభ్రపరుచుకోవడం ముఖ్యం. అయితే మీరు ముఖానికి ఉపయోగించే క్రీమ్ లు, సోప్ ల్లో ఎక్కువ రసాయనాలు లేకుండా చూసుకోండి.

కలబంద
ఉదయం లేచిన తర్వాత కలబంద రసం లేదంటే కలబంద తయారైన క్రీమ్ లతో ఫేస్ క్లీన్ చేసుకోవడం చాలా ఉత్తమం.

యాంటీఆక్సిడెంట్, ఆల్కహాల్-ఫ్రీ టోనర్
ఇక మీరు ఉపయోగించే టోనర్ యాంటీఆక్సిడెంట్, ఆల్కహాల్-ఫ్రీ గా ఉండేటట్లు చూసుకోండి. అలాంటి వాటిని ఉపయోగిస్తే చర్మం సున్నితత్వం కోల్పొదు..

వర్క్ అవుట్
రోజూ ఉదయం లేవగానే కొన్ని రకాల వర్క్ అవుట్స్ చేయాలి. ఇవి మీ చర్మం సున్నితంగా ఉండి అందంగా ఉండేందుకు దోహదపడతాయి. ఉదయం లేవగానే ఏరోబిక్ వ్యాయామం చేయడం వల్ల శరీరంలోని మలినాలు మొత్తం బయటకు వెళ్తాయి.

ఆక్సిజన్
అలాగే మీ చర్మానికి, బాడీకి కావాల్సినంత ఆక్సిజన్ అందుతుంది. ఉదయం అలా చల్లటి వాతావరణంలో ఏరోబిక్స్ చేస్తూ ఉంటే బాడీకి కావాల్సినంత ఆక్సిజన్ అంది చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

బ్రేక్ ఫాస్ట్
రోజూ మీరు ఉదయం పూట తీసుకునే బ్రేక్ ఫాస్ట్ కూడా మీ చర్మ సౌందర్యంపై ప్రభావం చూపుతుంది. ఉదయం లేవగానే కచ్చితంగా బ్రేక్ ఫాస్ట్ తినడం అలవాటు చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేయకండి.

ఆరోగ్యకరమైన అల్పాహారం
ఆరోగ్యకరమైన అల్పాహారం కూడా మీ చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. రోజూ తృణధాన్యాలతో తయారు చేసిన బ్రేక్ ఫాస్ట్ తింటూ ఉండండి. (వోట్మీల్ వంటివి). తాజా పండ్లను తింటూ ఉండండి. వీటిలో మాంసకృత్తులు, కొవ్వుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి.

చర్మ సౌందర్యం
ఇలా రోజు ఉదయం పూట మీకుండే అలవాట్లు అన్నీ కూడా మీ చర్మసౌందర్యంపై ప్రభావం చూపుతాయి. వీటన్నింటినీ రోజూ పాటిస్తే చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవొచ్చు.



Click it and Unblock the Notifications
