For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దోసకాయ, పుదీనా మరియు పెరుగుతో ముఖంలో గ్లో పెరుగుతుంది

|

ప్రస్తుతం ఉన్న బిజీ జీవితంలో ఆరోగ్యం పక్కన పెడితే, చర్మం గురించి అస్సలు పట్టించుకోము. చర్మం గురించి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే చర్మ సమస్యలు చుట్టుముడుతాయి. చర్మం పొడిగా మారటం, అలసట మరియు పొరలుగా ఉండటం దీనికి కారణం. సూర్యుడి అతినీలలోహిత కిరణాలు మరియు కాలుష్యం వల్ల ఈ చర్మ సమస్యలు వస్తాయి. ఈ చర్మ సమస్యలను ఖరీదైన క్రీమ్‌తో చికిత్స చేయవలసిన అవసరం లేదు.

Cucumber

ఇంట్లో సహజంగా దొరికే పదార్థాలు లేదా ఉత్పత్తులను వాడటంతో చర్మ సమస్యలు సహజంగానే నివారించుకోవచ్చు. నల్లగా మారిన ముఖాన్ని కాంతివంతంగా మార్చడానికి దోసకాయ ఉత్తమ నివారణ. దోసకాయతో పాటు కొన్ని పదార్ధాలను జోడించడం ద్వారా మీ ముఖం నలుపు మరియు నల్ల మచ్చలను సులభంగా వదిలించుకోవచ్చు. మరి ఆ సహజపదార్థాలేంటో అవి ఏవిధంగా ఉపయోగపడతాయో చూదాం..

బంగాళాదుంప రసం

బంగాళాదుంప రసం

బంగాళాదుంపల్లో బ్లీచింగ్ లక్షణాలు ఉన్నాయి, ఇవి మీ చర్మాన్ని తెల్లగా మార్చడానికి సహాయపడతాయి. మొత్తం బంగాళాదుంప రసం మరియు సగం దోసకాయ రసం తీసుకొని బాగా కలపాలి. శుభ్రంగా ఉన్న పత్తి తీసుకొని దానిని ఈ మిశ్రమంలో నానబెట్టి మీ ముఖం మీద రుద్దండి. కొద్దిసేపు ఆరనివ్వండి, తరువాత శుభ్రం చేసుకోండి.

పాల పొడి

పాల పొడి

ముందుగా పాలపొడిని తీసుకోండి. ఒక బౌల్లో పాలపొడి, దోసకాయ రసం వేసి బాగా కలపండి. ఈ మిశ్రమం పేస్ట్ లాగా కనిపిస్తుంది. ఈ పేస్ట్ తీసుకొని ముఖం మరియు మెడపై రాయండి. పేస్ట్ ఆరిపోయినప్పుడు, గోరువెచ్చని నీటితో చర్మాన్ని సున్నితంగా మసాజ్ చేయండి. తర్వాత చన్నీటితో కడిగేయండి. అవసరమైతే దీనిలో గుడ్డులోని తెల్లసొనను జోడించవచ్చు. ఇలా వారానికి ఒకసారి చేయవచ్చు.

 పుదీనా ఆకులు

పుదీనా ఆకులు

పుదీనా ఆకులు మరియు దోసకాయలతో ముఖ నల్లబడకుండా నివారించవచ్చు. పుదీనా ఆకులు యాంటీ ఫంగల్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. మిక్స్ లో కొన్ని పుదీనా ఆకులు మరియు కొన్ని దోసకాయ ముక్కలు మిక్స్ చేసి పేస్ట్ గా రుబ్బుకోవాలి. ఈ పేస్ట్ ను మీ ముఖానికి ఫేస్ మాస్క్ లా వేసుకోవాలి. అరగంట సేపు ఉంచి, ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. ముఖం మీద నలుపు తగ్గి కాంతివంతంగా. మీరు ఇలా వారానికి నాలుగు సార్లు చేయవచ్చు.

కలబంద

కలబంద

మొదట, రెండు టేబుల్ స్పూన్ల దోసకాయ రసం, రెండు టేబుల్ స్పూన్లు కలబంద రసం మరియు రెండు టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకోండి. ఈ మూడింటిని ఒక కప్పులో తీసుకుని బాగా మిక్స్ చేయాలి. దీన్ని ముఖం మరియు మెడపై అప్లై చేయండి. అరగంట పాటు అలాగే ఉంచి, తర్వాత శుభ్రం చేసుకోవాలి. మీరు దీన్ని వారానికి మూడుసార్లు చేయవచ్చు.

పెరుగు

పెరుగు

పెరుగు ముఖానికి తేమను అందిస్తుంది. చర్మంను కాంతివంతంగా మార్చుతుంది. ఇది చర్మంలో నలుపు తగ్గిస్తుంది. మూడు టేబుల్ స్పూన్ల పెరుగులో నాలుగు కప్పులు కీరదోసకాయ ముక్కలు జోడించండి. అలాగే ఓట్స్ కూడా కలిపి మిక్సీలో మెత్గగా గ్రైండ్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖం మరియు మెడపై అప్లై చేసి అరగంట పాటు అలాగే ఉంచాలి. వారానికి ఒకసారి ఇలా చేయండి. మీ చర్మంలో తప్పకుండా మార్పు కనబడుతుంది.

శెనగ పిండి

శెనగ పిండి

ముఖం మీద ఉన్న అదనపు నూనెను పీల్చుకోవడానికి మరియు చర్మం రంద్రాలను టైట్ చేయడానికి శెనగపిండి సహాయపడుతుంది. ముఖంలో ఉన్న మలినాలను, ధూళిని తొలగిస్తుంది. ఒక బౌల్లో దోసకాయ రసం మరియు శెనగపిండి సమాన పరిమాణంలో తీసుకోవాలి. దీన్ని ముఖం మరియు మెడ ప్రదేశంలో అప్లై చేయాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడగాలి. కడగడానికి ముందు మసాజ్ చేసి శుభ్రం చేసుకోవడం మంచిది. మంచి ఫలితం పొందాలంటే రోజు విడిచి రోజు ఈ పద్దతిని అనుసరించండి.

తేనె

తేనె

దోసకాయ- తేనె కలయికను ఉపయోగించడం వల్ల ముఖం తేమగా ఉంటుంది. మీ ముఖాన్ని ప్రకాశవంతం చేయడానికి తేనె సహాయపడుతుంది. దోసకాయ తేనె మిశ్రమంతో మీ ముఖం మీద సున్నితమైన మసాజ్ చేయండి. ఐదు నిమిషాలు మసాజ్ చేసి అరగంట వదిలివేయండి. ఇలా వారానికి రెండుసార్లు చేయవచ్చు.

చర్మంలో ట్యాన్ నివారించడానికి కొన్ని ఉపయోగకరమైన చిట్కాలు

చర్మంలో ట్యాన్ నివారించడానికి కొన్ని ఉపయోగకరమైన చిట్కాలు

మీరు త్వరగా మంచి ఫలితాలను పొందాలంటే రోజూ దోసకాయ రసం త్రాగాలి.

బాటిల్స్ లో ఇన్ స్టాంట్ గా వచ్చే కీరదోసకాయ రసాలను తాగకూడదు. స్వయంగా ఇంట్లో తయారుచేసిన పళ్లరసం లేదా ఇంట్లో తయారుచేసిన పానీయాలు తాగడం మంచిది.

సన్‌స్క్రీన్ లోషన్ ఉపయోగించకుండా ఎండలో వెళ్లవద్దు.

చర్మం తేమగా ఉండాలంటే ఎక్కువ నీరు త్రాగాలి. రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీరు త్రాగాలి.

మీ ఆహారంలో దోసకాయను తప్పనిసరిగా చేర్చండి.

మేకప్‌తో పడుకోకుండా ఉండండి. పడుకునే ముందు మేకప్ తొలగించి బెడ్ పైకి వెళ్ళండి.

English summary

How to Remove Tan With Cucumber

Our life is so busy and packed that we fail to find the time we need to take care of our health and skin. This obviously causes a lot of problems to the skin and makes it appear dull, dry and damaged. Apart from your schedule, it can also be the work of excessive amount of pollution, harsh rays of the sun..
Story first published: Friday, September 6, 2019, 16:08 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more