Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
Katrina Kaif: మచ్చలేని అందమైన చర్మం కోసం కత్రినా కైఫ్ ఏంచేస్తుందంటే?
కత్రినా చర్మంలా మీకు కూడా సహజమైన మెరుపునిచ్చే ముఖం కావాలంటే కత్రీనా ఫాలో అవుతున్న ఈ సీక్రెట్స్ మీరూ ఫాలో అవండి.
నాలుగు పదుల వయస్సులోనూ అందంలో ఏమాత్రం తక్కువ కాకుండా కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తోంది కత్రినా కైఫ్. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఈ బ్యూటీ అందానికి ఫిదా అవ్వాల్సిందే. ఈ బ్యూటీ ఎంతో అందమైన చర్మాన్ని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. అలాంటి మచ్చలేని, అందమైన, మెరుపునిచ్చే చర్మం కోసం రోజూ కత్రినా కైఫ్ ఏం చేస్తుందో తెలుసా? తాజాగా ఈ బ్యూటీ తన స్కిన్ కేర్ రొటీన్ ఏంటో వెల్లడించింది.

కత్రినా చర్మంలా మీకు కూడా సహజమైన మెరుపునిచ్చే ముఖం కావాలంటే కత్రీనా ఫాలో అవుతున్న ఈ సీక్రెట్స్ మీరూ ఫాలో అవండి.

కత్రినా అందాల రహస్యం:
కత్రినా అందానికి ప్రధాన సోర్స్ కిచెన్. చర్మాన్ని ఆరోగ్యంగా, రిఫ్రెష్‌గా ఉంచడానికి వంటగదిలో దొరికే రెండు వస్తువులను ఎక్కువగా ఉపయోగిస్తుంది. ఒకటి ఓట్స్, రెండోది తేనె. ఓట్స్ ను మెత్తగా చేసి అందులో తేనె బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్ లా వేసుకుంటానని కత్రినా కైఫ్ చెప్పింది.

ఐస్ వాష్:
రోజూ ఉదయం నిద్రలేవగానే పఫ్పీనెస్ ను, మంటను తగ్గించడానికి కత్రినా కైఫ్ ప్రత్యేక ఐస్ వాష్ చేసుకుంటుంది. నిద్రలేచిన తర్వాత ఒక పెద్ద గిన్నెలో ఐస్ క్యూబ్స్ వేసుకుంటుంది. దానిలో కొన్ని నీటిని కలిపి అందులో తన ముఖాన్ని ముంచుతుంది. దీని వల్ల మంట పోతుందని, పఫ్పీనెస్ తొలగిపోతుందని కత్రినా చెప్పింది.

వ్యాయామం, ఆహారం:
మంచి చర్మం కోసం, మెరుగైన ఆరోగ్యం కోసం మంచి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. ఆరోగ్యకరమైన వ్యక్తి ముఖం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. అందుకే కత్రినా వ్యాయామం, ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది.

తాను ఎప్పుడూ వ్యాయామం చేయకుండా ఉండదు. అలాగే కచ్చితంగా డైట్ పాటిస్తుంది. కత్రినా కైఫ్ మాక్రోబయోటిక్ డైట్ ని అనుసరిస్తుంది. ప్రతి 2 గంటలకు తాజాగా ఉడికించిన కూరగాయలు, పండ్లను తీసుకుంటుంటుంది. కార్బోహైడ్రేట్లకు పూర్తిగా దూరంగా ఉంటుంది. అలాగే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటుంది.



Click it and Unblock the Notifications
