Latest Updates
-
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్! -
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ -
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు!
చలికాలంలోనూ చర్మ సౌందర్యం పెంచుకోవాలంటే మౌని రాయ్ చిట్కాలను ఫాలో అవ్వండి...
మౌని రాయ్ చర్మ సంరక్షణ గురించి చెబుతున్న చిట్కాలేంటో చూసేద్దాం రండి.
మనలో చాలా మంది అమ్మాయిలు అనునిత్యం అందంగా.. ఆకర్షణీయంగా కనిపించాలని కోరుకోవడం అత్యంత సాధారణమైన విషయం. ఇంటి నుండి బయటకు అడుగు పెడుతున్నామంటే చాలు కాస్త కొత్తగా.. స్టైల్ గా.. కనిపించాలని ఆశిస్తూ ఉంటారు.

అంతేకాదు నలుగురిలోనూ ప్రత్యేకంగా కనబడాలని కోరుకుంటారు. ఈ నేపథ్యంలోనే ఫ్యాషన్ వరల్డ్ లో వచ్చే లేటెస్ట్ అప్ డేట్స్ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటిలో తమకు నచ్చిన వాటిని ధరించేందుకు ఎక్కువ మక్కువ చూపుతుంటారు.

అయితే స్టైల్, ఫ్యాషన్ అనగానే చాలా మంది మహిళలు బాలీవుడ్ అందాల భామల వైపే చూడటం సహజమే. ఈ క్రమంలోనే బాలీవుడ్ బ్యూటీ మౌని రాయ్ వింటర్లోనూ స్కిన్ కేర్ తో పాటు అద్భుతమైన అలంకరణ ఎలా చేసుకోవచ్చో చెబుతోంది. ఈ సందర్భంగా ఆమె ఎలాంటి మేకప్ చిట్కాలను చెబుతోందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

లిప్ స్టిక్ లైనర్లంటే..
బాలీవుడ్ నటి మౌని రాయ్ తన అందమైన నటనతో పాటు అందమైన రూపానికి ప్రసిద్ధి చెందింది. మౌని రాయ్ తన స్టైలిష్ దుస్తులకు మరియు అద్భుతమైన మేకప్ తో ఫ్యాషన్ వర్డల్ లో ప్రముఖంగా ప్రాధాన్యతను సంపాదించుకున్నారు. ఈ నాగిని ఫేమ్ నటి మేకప్ అంటే బాగా ఇష్టపడుతుందట. ఈమెకు మేకప్ లో లిప్ స్టిక్ లైనర్లు వాడటం అంటే చాలా ఇష్టమట. ఇంకా తన అందాన్ని పెంచుకోవడానికి ఏయే చిట్కాలు పాటిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం...

కాంటౌరింగ్ ముఖ్యం..
బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ మౌని రాయ్ తన ముఖానికి పరిపూర్ణమైన గ్లో తీసుకురావడానికి కచ్చితమైన కాంటౌరింగ్ చేస్తుందట. దీని వల్ల తన బుగ్గలు అందంగా.. ఎర్రగా మెరుస్తూ ఉంటాయట. మీకు కూడా ఇలాంటి అందమైన రూపం కావాలంటే.. దీన్ని ప్రయత్నించి చూడండి.

బ్రౌన్ స్మోకీ ఐ మేకప్..
ఈ బాలీవుడ్ భామ మౌని రాయ్ తరచుగా మేకప్ వేసుకునేటప్పుడు.. ముందుగా తన కళ్లకు బ్రౌన్ స్మోకీ ఐ మేకప్ వేసుకుంటుందట. బ్లాక్ కలర్ ఐషాడోతో తరచుగా స్మోకీ ఐ మేకప్ లో ఉపయోగిస్తుందట. దీని వల్ల సంప్రదాయ రూపంలో గాని లేదా పాశ్చాత్య రూపంలో అయినా చాలా అందంగా కనిపిస్తారని చెబుతోంది. కొన్నిసార్లు బ్లాక్ లేకపోతే బ్రౌన్ కలర్ కూడా వాడొచ్చు.

రెడ్ లిప్ స్టిక్..
ఏ అమ్మాయికైనా పెదాలకు ఎర్రని రంగులో ఉండే లిప్ స్టిక్ వేసుకుంటే ఆమె అందం మరింత పెరిగిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే మౌని రాయ్ కూడా ఎక్కువగా రెడ్ కలర్ లిప్ స్టిక్ నే వేసుకుంటారు. ముఖ్యంగా బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ వేసుకున్నప్పుడు.. బ్లాక్ స్మోకీ ఐ మేకప్ కు రెడ్ కలర్ లిప్ స్టిక్ వేసుకుంటే మీకు కచ్చితంగా అందమైన లుక్ వస్తుందని.. ఇలాంటి చిట్కాలను మీ మేకప్ లో అనుసరించొచ్చని సలహాలిస్తోంది.

మేకప్ కు ముందు..
మౌని రాయ్ మేకప్ వేసుకోవడానికి ముందు కచ్చితంగా కొన్ని ఫౌండేషన్ పద్ధతులను పాటిస్తారు. ఆ తర్వాతనే మేకప్ వేసుకుంటారట. ముందుగా ఈ బాలీవుడ్ అందాల భామ ముఖం మీద బ్లషర్ ఉపయోగిస్తుంది. దీని తర్వాత ఫైనల్ లుక్ కోసం హైలైటర్ ను వాడుతుందట.

కొత్త లుక్ కోసం..
ఎలాగో త్వరలో కొత్త సంవత్సరం రాబోతోంది. కాబట్టి ఈ కొత్త సంవత్సర వేళ.. మీరు మరింత కొత్తగా కనిపించేలా.. కొత్త మేకోవర్ ను ప్రయత్నించండి.. ఓ కొత్త లుక్ ట్రై చేసి మిమ్మల్ని మీరు కొత్తగా అందరికీ చూపించండి. అలా కొత్త ఉత్సాహంతో న్యూ ఇయర్ ను స్టార్ చేయండి.



Click it and Unblock the Notifications